సాళువ వంశం
విజయ నగర రాజులు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
సాళువ వంశము విజయనగర సామ్రాజ్యమును పరిపాలించిన రెండవ వంశము. ఈ వంశస్థులు 1485 నుండి 1505 వరకు విజయనగరాన్ని పాలించారు. సాళువ వంశము కన్నడ వంశము. ఈ వంశస్థులు కళ్యాణీపురవరాధీశ్వర అనే బిరుదు ధరించడము వలన కర్ణాటకలోని కళ్యాణీ నగరం వీరి జన్మస్థలమని చరిత్రకారుల అభిప్రాయము. ముస్లింల దండయాత్రలవలన ఆంధ్ర దేశానికి వలస వచ్చారు. వీరి రాజకీయ ప్రాభల్యము కర్నూలు, చంద్రగిరి ప్రాంతాలలో ప్రారంభమైనది.
సాళువ వంశ స్థాపకుడు, సాళువ నరసింహుని ప్రపితామహుడు (ముత్తాత) మంగిరాజుకు ప్రతిపక్ష సాళువ అనే బిరుదు ఉంది. బిరుదనామమే వంశనామమయ్యిందని ఒక ఆలోచన. వీరి పూర్వీకులకు కూడా కటారిసాళువ అనే బిరుదు ఉంది. అయితే వీరి అసలు వంశనామము తెలియదు.
సాళువాభ్యుదయము గ్రంథమును అనుసరించి కంపరాయల మధురాపురి దండయాత్రలో, శ్రీరంగనాథుని పునప్రతిష్ఠించుటలో సాళువ మంగిరాజు ప్రముఖ పాత్ర పోషించాడు. ఈయన శ్రీరంగనాథునికి 60వేల మాడలు, 8 గ్రామాలు దానము చేశాడు. అప్పటి నుండి సాళువ వంశస్థులు కర్నూలు, చంద్రగిరి ప్రాంతాలను విజయనగర ఉద్యోగులుగా పాలించినట్లు స్థానిక చరిత్రలు, శాసనాలు చెబున్నాయి కానీ సాళువాభ్యుదయము ప్రకారము సాళువ నరసింహుని తండ్రి గుండరాజు కళ్యాణీ నుండి పాలించాడని చెబుతున్నది. గుండరాజు మరణానంతరము కళ్యాణీ నగరానికి విపత్తు సంభవించగా నరసింహదేవ రాయలు రాజధానిని చంద్రగిరికి మార్చాడట.
మూలములు
మార్చు- ఆంధ్రుల చరిత్ర - బి.యస్.యల్.హనుమంతరావు