విఠపు బాలసుబ్రహ్మణ్యం

విఠపు బాలసుబ్రహ్మణ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, శాసనమండలి సభ్యుడు. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రొటెం స్పీకర్‌గా పని చేశాడు.[1]

విఠపు బాలసుబ్రహ్మణ్యం

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2007 - 2023 మార్చి 29
నియోజకవర్గం నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ

వ్యక్తిగత వివరాలు

జననం (1950-06-30) 1950 జూన్ 30 (వయసు 73)
మాముడూరు గ్రామం, చేజెర్ల మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్
జీవిత భాగస్వామి పద్మిని
నివాసం నెల్లూరు , ఆంధ్రప్రదేశ్, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

జననం,విద్యాభాస్యం మార్చు

విఠపు బాలసుబ్రహ్మణ్యం 1950, జూన్ 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా , చేజెర్ల మండలం , మాముడూరు గ్రామం లో సుబ్బ రామయ్య, లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి 1979లో ఎం.ఏ (తెలుగు) పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం మార్చు

విఠపు బాలసుబ్రహ్మణ్యం 2007లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం నియోజకవర్గ ఉపాధ్యాయుల స్థానం నుండి ప్రోగ్రెసివ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (పీడీఎఫ్‌) అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్సీగా గెలిచాడు. 2011లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్సీగా గెలిచాడు. ఆయన 2017లో జరిగిన ఎన్నికల్లో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం నియోజకవర్గ ఉపాధ్యాయుల స్థానం నుండి ప్రోగ్రెసివ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (పీడీఎఫ్‌) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి వాసుదేవనాయుడిపై 3553 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.[2] ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఎంఎ షరీఫ్‌ పదవి కాలం మే 24న, డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం పదవి కాలం జూన్‌ 18న ముగియడంతో ఆయనను 18 జూన్ 2021న ప్రొటెం స్పీకర్‌గా రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్ హరిచందన్ నియమించాడు.[3] ఆయన ఈ పదవిలో 18 జూన్ 2021 నుండి 19 నవంబర్ 2021 వరకు పని చేశాడు.

మూలాలు మార్చు

  1. Outlook India (18 June 2021). "Governor appoints pro-tem chairman of AP Legislative Council". outlookindia.com/. Archived from the original on 20 June 2021. Retrieved 20 June 2021.
  2. Sakshi (21 March 2017). "విఠపు హ్యాట్రిక్‌". Sakshi. Archived from the original on 20 June 2021. Retrieved 20 June 2021.
  3. 10TV (18 June 2021). "Andhrapradesh: శాసన మండలి ప్రొటెం స్పీకర్‌గా విఠపు బాలసుబ్రహ్మణ్యం". 10TV (in telugu). Archived from the original on 20 June 2021. Retrieved 20 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)