విద్యా ప్రదీప్
డా. విద్యా ప్రదీప్ (జననం 1992 నవంబరు 25) భారతీయ నటి, శాస్త్రవేత్త.[2][3] ఆమె ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నది. శైవం (2014), పసంగ 2 (2015), తడమ్ (2019) వంటి ఎన్నో విజయవంతమైన తమిళ చిత్రాలలో ఆమె నటించింది. ఇందులో పసంగ తెలుగులో మేము (2016) గా డబ్బింగ్ చేసి జూలకంటి మధుసూదన్ రెడ్డి విడుదల చేశాడు.[4]
డా. విద్యా ప్రదీప్ | |
---|---|
జననం | |
ఇతర పేర్లు | విద్యా గోపకుమార్,[1] ధ్యాన |
వృత్తి | నటి, శాస్త్రవేత్త[1] |
క్రియాశీల సంవత్సరాలు | 2010–ప్రస్తుతం |
కెరీర్
మార్చువైద్య విద్య, వృత్తి
మార్చుబయోటెక్నాలజీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆమె చెన్నైలోని కంటి ఆసుపత్రిలో స్టెమ్ సెల్ బయాలజీలో పీహెచ్డీ పూర్తి చేసింది. ఆమె కంటి మూలకణాలపై పరిశోధనలు చేసి ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కార్నియా, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సెల్ థెరపీలలో రచనలు చేసింది.[5][6]
మోడల్, నటిగా
మార్చుఆమె చిన్నతనంలో భరతనాట్యం నేర్చుకుంది.[7] చదువు కొనసాగిస్తూనే ఆమె మోడల్‌గా రాణించింది. అనేక ప్రింట్, టెలివిజన్ ప్రకటనలలో చేసింది.
యామీ గౌతమ్ వంటి అనేక మోడళ్లతో కలిసి ఎ. ఎ. ఆర్. రెహమాన్ "ఆ భీ జా" మ్యూజిక్ వీడియోలో ఆమె కూడా నటించింది. ఆమె అవల్ పెయార్ తమిజరాసి (2010)లో సహాయక పాత్రలో నటించింది. అయితే, ఇందులో ఆమె ధ్యాన పేరుతో రంగప్రవేశం చేసింది. ఆ తరువాత, ఆమె విరుంతలి (2010)లో ఆమె కథానాయికగా నటించింది.[7] ఎ. ఎల్. విజయ్ రూపొందించిన విజయవంతమైన ఫ్యామిలీ డ్రామా చిత్రం శైవం (2014)లో సారా అర్జున్ తల్లి పాత్రను పోషించింది. ఆమె యాక్షన్ డ్రామా అధిబర్ (2015)లో జీవన్ సరసన నటించింది.[8][9] పాండిరాజ్ దర్శకత్వంలో వచ్చిన పసంగ 2 (2015)లో ఒక చిన్న పిల్లవాడి తల్లిగా నటించి ఆమె మెప్పించింది.[10][11] ఆమె సైకలాజికల్ థ్రిల్లర్ ఒన్నుమే పురియాల (2016)లో నటించింది, ఇది జర్మన్లో రీమేక్ చేయబడిన మొదటి తమిళ చిత్రంగా గుర్తింపు పొందింది. ఆచమింద్రి (2016)లో ఆమె అతిథి పాత్ర పోషించింది.[12][13]
ఆమె కన్నడలో బంగార s/o బంగారద మనుష్య (2017)తో శివరాజ్‌కుమార్ సరసన నటించింది. మొదటి చిత్రం తోనే ఆమె శాండల్‌వుడ్ లో చాలా సానుకూల సమీక్షలను అందుకుంది.[14][15][16] 2019 మార్చిలో, ఆమె అరుణ్ విజయ్‌తో కలిసి తడమ్లో నటించింది.[17][18]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "In vitro transdifferentiation of human skin keratinocytes to corneal epithelial cells". celltherapyjournal.org. Retrieved 30 May 2018.
- ↑ "Actress Vidya Pradeep gets doctorate in Stem Cell Biology; To head to US for job". The Times of India. Archived from the original on 25 November 2022. Retrieved 25 November 2022.
- ↑ "Thadam Actress Vidya Pradeep Gets Doctorate In Stem Cell Biology, To Head For The US » GossipChimp | Trending K-Drama, TV, Gaming News". 10 March 2022. Archived from the original on 25 November 2022. Retrieved 25 November 2022.
- ↑ Sakshi (17 October 2015). "సూర్య కొత్త సినిమా 'మేము'". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
- ↑ Jyothsna (12 September 2015). "Vidya Pradeep, a stem cell biologist and also an actress". Behindwoods.com. Archived from the original on 9 September 2018. Retrieved 30 May 2018.
- ↑ menon, thinkal (2 October 2015). "The pretty scientist on big screen". Deccan Chronicle. Archived from the original on 1 July 2020. Retrieved 1 July 2020.
- ↑ 7.0 7.1 S. R. Ashok Kumar (6 May 2010). "My First Break: Dhyana". The Hindu. Archived from the original on 23 October 2021. Retrieved 15 March 2019.
- ↑ "Vidya Pradeep shares her experience with Jeevan". kalakkalcinema.com. 23 August 2015. Archived from the original on 20 June 2018. Retrieved 30 May 2018.
- ↑ "Vidya Pradeep expects a lot from 'Athibar'". kalakkalcinema.com. 22 August 2015. Archived from the original on 19 June 2018. Retrieved 30 May 2018.
- ↑ "Upcoming actress Vidya Pradeep shares her experience working with Suriya in Pandiraj's Haiku". Behindwoods.com. 4 April 2015. Archived from the original on 24 May 2018. Retrieved 30 May 2018.
- ↑ "Pasanga-2 (aka) Haiku review". Behindwoods.com. 24 December 2015. Archived from the original on 26 December 2015. Retrieved 30 May 2018.
- ↑ K. R. Manigandan (16 January 2017). "Tamil film to be remade in German". The Times of India. Archived from the original on 4 August 2018. Retrieved 30 May 2018.
- ↑ Mrinalini Sundari (16 January 2017). "Vidya Pradeep does a cameo in Achamindri". The Times of India. Archived from the original on 5 October 2018. Retrieved 30 May 2018.
- ↑ "Bangaara S/O Bagarada Manushya Review {3.5/5}: Go ahead, watch this film — it lets you see farmers and their problems with a sheen". The Times of India. Retrieved 21 May 2017.
- ↑ "Bangara... in the footsteps of Bangarada manushya". The New Indian Express. Archived from the original on 26 May 2017. Retrieved 21 May 2017.
- ↑ "Rising in revolt for a noble cause". Deccan Herald. Archived from the original on 20 May 2017. Retrieved 21 May 2017.
- ↑ "Thadam Review {3.5/5}: Arun Vijay steals the show with dual roles". The Times of India.
- ↑ "Thadam movie review: A thriller that doesn't disappoint". 1 March 2019. Archived from the original on 2 April 2019. Retrieved 29 April 2019.