విరాజ్
విరాజ్ (జననం హరి ప్రశాంత్) భారతీయ నటుడు. ఎక్కువగా తమిళ భాషా చిత్రాలలో నటించే ఆయన నేపథ్య గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎస్. ఎన్. సురేందర్ కుమారుడు, విరాజ్ బాల నటుడిగా ఉయిరిలే కలంతతు (2000), అన్నియన్ (2005), చెన్నై 600028 (2007)లలో సహాయ పాత్రల్లో నటించాడు.[1][2]
విరాజ్ | |
---|---|
జననం | హరి ప్రశాంత్ 1992 ఆగస్టు 25 చెన్నై, భారతదేశం |
వృత్తి | నటుడు |
బంధువులు | శోభ చంద్రశేఖర్ (సోదరి) ఎస్.ఎ.చంద్రశేఖర్ (మామ) |
విరాజ్ నటించిన చిత్రాలన్ని వివిధ భాషల్లోకి డబ్ చేయబడ్డాయి. ఉయిరిలే కలంతతు చిత్రం హిందీలోకి సూర్య భాయ్ ఎంబీబిఎస్ (2007), తెలుగులో పోరాటం, మలయాళంలో రఘు రామన్ ఐఏఎస్ గా డబ్ చేయబడింది.[3][4] తమిళంలో చిత్రీకరించబడిన అన్నియన్ నాలుగు దక్షిణ భారత రాష్ట్రాల్లో ఏకకాలంలో విడుదలైంది, ఈ చిత్రం తెలుగులోకి అపరిచితుడుగా వచ్చింది. హిందీలో అపరిచిత ది స్ట్రేంజర్‌గా డబ్ చేయబడింది. అంతేకాకుండ, ఫ్రెంచ్‌లోకి డబ్ చేయబడింది. చెన్నై 600028 చిత్రం తెలుగులో కొడితే కొట్టాలిరా అనే పేరుతో డబ్ చేయబడింది.[5]
ఫిల్మోగ్రఫీ
మార్చుYear | Film | Role | Notes |
---|---|---|---|
2000 | ఉయిరిలే కలంతతు | చిన్నప్పుడు రఘువరన్ | చైల్డ్ ఆర్టిస్ట్ |
2002 | ఉన్నై నినైతు | నిర్మల సోదరుడు | చైల్డ్ ఆర్టిస్ట్ |
2003 | తిథికుధే | యువకుడు చిన్ను | చైల్డ్ ఆర్టిస్ట్ |
2003 | ఉన్నై చరనదైందేన్ | చైల్డ్ ఆర్టిస్ట్ | |
2005 | అన్నియన్ | చిన్న అంబి | చైల్డ్ ఆర్టిస్ట్ |
2007 | చెన్నై 600028 | హరి | |
2016 | చెన్నై 600028 II: రెండవ ఇన్నింగ్స్ | హరి |
వ్యక్తిగత జీవితం
మార్చువిరాజ్ కోలీవుడ్ కు చెందిన ఎస్. ఎన్. సురేందర్ కుమారుడు, గాయని శోభా చంద్రశేఖర్ సోదరుడు. నటుడు విజయ్ అతని కజిన్, అతని మామ ఎస్. ఎ. చంద్రశేఖర్ కూడా సినిమా దర్శకుడు.
మూలాలు
మార్చు- ↑ "S.Hariprashanth - Official Site of South Indian Artists Association, Nadigar Sangam, Tamil Nadigar Sangam". www.nadigarsangam.org.
- ↑ thmrn (2002-05-17). "Unnai Ninaithu". The Hindu. Archived from the original on 2003-02-10.
- ↑ Kalyug Ka Khandhan Hindi Dubbed Full Movie || Surya, Jyothika || Eagle Hindi Movies. YouTube. Archived from the original on 2021-12-11.
- ↑ PORATAM | TELUGU FULL MOVIE | SUPER HIT ACTION MOVIE | SURYA | TELUGU MOVIE ZONE. YouTube. Archived from the original on 2021-12-11.
- ↑ "Chennai 600028 to be dubbed in Telugu". Filmibeat. 2007-07-20. Archived from the original on 30 June 2022.