విల్ సోమర్‌విల్లే
విలియం ఎడ్గార్ రిచర్డ్ సోమర్‌విల్లే (జననం 1984, ఆగస్టు 9) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. ఆక్లాండ్ తరపున ఆడాడు. 2018 డిసెంబరులో న్యూజీలాండ్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | విలియం ఎడ్గార్ రిచర్డ్ సోమర్‌విల్లే | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | వాడెస్టౌన్, వెల్లింగ్టన్, న్యూజీలాండ్ | 1984 ఆగస్టు 9|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | డాడ్[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 4 అం. (1.93 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 275) | 2018 డిసెంబరు 3 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2021 డిసెంబరు 3 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2004/05–2007/08 | Otago | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014/15–2017/18 | న్యూ సౌత్ వేల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015/16–2017/18 | Sydney Sixers | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018/19–present | Auckland | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2022 ఆగస్టు 23 |
ప్రారంభ, దేశీయ కెరీర్
మార్చుసోమర్విల్లే 1984, ఆగస్టు 9న వెల్లింగ్‌టన్ శివారు ప్రాంతమైన వేడ్‌టౌన్‌లో జన్మించాడు. తొమ్మిదేళ్ళ వయసులో ఇతని కుటుంబం న్యూజీలాండ్ నుండి ఆస్ట్రేలియాలోని సిడ్నీకి మారడంతో అక్కడ పెరిగాడు.[2] సిడ్నీ తూర్పు శివారులోని క్రాన్‌బ్రూక్ పాఠశాలలో చదువుకున్నాడు.[3] ఒటాగో విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి న్యూజీలాండ్‌కు తిరిగి వచ్చాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, ఆఫ్ స్పిన్ బౌలర్ గా రాణించాడు. ఒటాగో తరపున మూడు మ్యాచ్‌లు ఆడాడు, 2005 మార్చిలో వెల్లింగ్‌టన్‌తో, 2006 మార్చిలో కాంటర్‌బరీ, నార్తర్న్ డిస్ట్రిక్ట్‌లపై ఆడాడు. 2005-06 సీజన్‌లో న్యూజీలాండ్ అకాడమీ తరపున అనేక మ్యాచ్‌లలో కూడా ఆడాడు.[4]
తన చదువు తర్వాత చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేయడానికి, యూనివర్సిటీకి క్రికెట్ ఆడటానికి సిడ్నీకి తిరిగి వచ్చాడు.[2] 2013-14లో న్యూ సౌత్ వేల్స్ తరపున ఆడటం ప్రారంభించాడు. 2016 జనవరి 2న, 2015–16 బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ తరపున తన ట్వంటీ20 అరంగేట్రం చేసాడు.[5]
2016 నవంబరులో షెఫీల్డ్ షీల్డ్‌లో న్యూ సౌత్ వేల్స్ తరపున బౌలింగ్ చేస్తూ, వెస్టర్న్ ఆస్ట్రేలియాపై మూడు వికెట్ల విజయంలో సోమర్‌విల్లే 61 పరుగులకు 4 వికెట్లు, 65 పరుగులకు 5 వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.[6] క్వీన్స్‌లాండ్‌పై మొదటి ఇన్నింగ్స్‌లో 136 పరుగులకు 8 వికెట్లతో సహా 23.14 సగటుతో 35 వికెట్లతో ఆ సీజన్‌లో షెఫీల్డ్ షీల్డ్‌లోని ప్రముఖ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు.[7] 2017, అక్టోబరు 15న 2017–18 జెఎల్టీ వన్-డే కప్‌లో న్యూ సౌత్ వేల్స్ తరపున తన లిస్ట్ ఎ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[8]
2018 జూన్ లో, 2018–19 సీజన్ కోసం ఆక్లాండ్‌తో ఒప్పందం లభించింది.[9] 2018 సెప్టెంబరులో, 2018 అబుదాబి టీ20 ట్రోఫీ కోసం ఆక్లాండ్ ఏసెస్ జట్టులో ఎంపికయ్యాడు.[10]
2020 జూన్ లో, 2020–21 దేశవాళీ క్రికెట్ సీజన్‌కు ముందు ఆక్లాండ్ కాంట్రాక్ట్ ఇచ్చింది.[11][12]
అంతర్జాతీయ కెరీర్
మార్చు2018 నవంబరులో, సోమర్‌విల్లే పాకిస్తాన్‌తో జరిగిన వారి సిరీస్ కోసం న్యూజీలాండ్ టెస్ట్ జట్టులో చేర్చబడ్డాడు.[13] 2018 డిసెంబరు 3న పాకిస్తాన్‌పై న్యూజీలాండ్ తరపున తన తొలి టెస్ట్ అరంగేట్రం చేసాడు. 75 పరుగులకు 4 వికెట్లు, 52 పరుగులకు 3 వికెట్లు తీసి న్యూజీలాండ్ కు 123 పరుగుల విజయాన్ని అందిచాడు.[14]
మూలాలు
మార్చు- ↑ "Back in the Black Caps: Will Somerville plays on in sister's memory" (in ఇంగ్లీష్). Retrieved 2020-12-31.
- ↑ 2.0 2.1 "Meet Will Somerville". Retrieved 7 November 2016 – via YouTube.
- ↑ "Will Somerville (2002) to Play in Sheffield Shield". Old Cranbrookians Association. Archived from the original on 16 మార్చి 2019. Retrieved 7 November 2016.
- ↑ "Miscellaneous Matches played by Will Somerville". CricketArchive. Retrieved 9 November 2016.
- ↑ "Big Bash League, 17th Match: Perth Scorchers v Sydney Sixers at Perth, Jan 2, 2016". ESPNcricinfo. Retrieved 2 January 2016.
- ↑ "New South Wales v Western Australia 2016–17". ESPNcricinfo. Retrieved 7 November 2016.
- ↑ "Sheffield Shield bowling 2016-17". ESPNcricinfo. Retrieved 13 February 2019.
- ↑ "19th match (D/N), JLT One-Day Cup at Sydney, Oct 15 2017". ESPNcricinfo. Retrieved 15 October 2017.
- ↑ "Central Districts drop Jesse Ryder from contracts list". ESPNcricinfo. Retrieved 15 June 2018.
- ↑ "Auckland Aces to face the world in Abu Dhabi". Scoop. Retrieved 27 September 2018.
- ↑ "Daryl Mitchell, Jeet Raval and Finn Allen among major domestic movers in New Zealand". ESPNcricinfo. Retrieved 15 June 2020.
- ↑ "Auckland lose Jeet Raval to Northern Districts, Finn Allen to Wellington in domestic contracts". Stuff. 15 June 2020. Retrieved 15 June 2020.
- ↑ "Uncapped 34-year-old Will Somerville replaces injured Todd Astle in Blackcaps Test squad". International Cricket Council. Retrieved 8 November 2018.
- ↑ "3rd Test, New Zealand tour of United Arab Emirates at Abu Dhabi, Dec 3-7 2018". ESPNcricinfo. Retrieved 3 December 2018.