విశాఖపట్నం - సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
విశాఖపట్నం - సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ జంక్షన్ నుండి విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషనుకు అనుసంధానించే భారతీయ రైల్వేల ఆధ్వర్యంలో రోజువారీ నడుస్తున్న సూపర్‌ఫాస్ట్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది ప్రతిరోజూ నడుపుతున్న మొట్టమొదటి గరిబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైలు.[1] రైలు సంఖ్యలు 12739, 12740 ఉన్నాయి. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ నకు చెందినది. సికింద్రాబాదు నుండి విశాఖపట్నం వరకు 12740 నంబరుతోను, విశాఖపట్నం నుండి సికింద్రాబాద్కు 12739 నంబరుతోనూ ప్రయాణిస్తుంది.
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ | ||||
స్థానికత | ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ | ||||
తొలి సేవ | అక్టోబరు 26, 2008 10 సం. క్రితం | ||||
ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ మధ్య రైల్వే జోన్ | ||||
మార్గం | |||||
మొదలు | విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషను | ||||
ఆగే స్టేషనులు | 10 | ||||
గమ్యం | సికింద్రాబాద్ జంక్షన్ | ||||
ప్రయాణ దూరం | 701 కి.మీ. (436 మై.) | ||||
సగటు ప్రయాణ సమయం | 11 గం.15 ని. | ||||
రైలు నడిచే విధం | ప్రతిరోజు | ||||
రైలు సంఖ్య(లు) | 12739 / 12740 | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | ఎసి 3 టైర్ ఎకానమీ | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | ఉంది | ||||
పడుకునేందుకు సదుపాయాలు | ఉంది | ||||
చూడదగ్గ సదుపాయాలు | పెద్ద కిటికీలు | ||||
సాంకేతికత | |||||
రోలింగ్ స్టాక్ | 2 | ||||
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) | ||||
|
ప్రయాణ మార్గము
మార్చుఈ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుత్దుంది.[2]
రైలు కూర్పు
మార్చుగరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రేక్ ప్రారంభంలో 3ఎసి, ఎసి చైర్ కార్ కోచ్‌లు ఉండేవి; ఎసి చైర్ కార్లో ఉన్న అసౌకర్యానికి కారణంగా, ఇది తొలగించబడింది. ఇప్పుడు రైలు అన్ని 3 ఎసి కోచ్‌లతో నడుస్తుంది. ఇది రోజువారీ రైలు కానప్పుడు, సికింద్రాబాద్ - యశ్వంత్పూర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైలుతో; ఈ రైలు భోగీలు అనుసంధానం చేయబడి నడిచేది. కానీ ఇప్పుడు ఇది ఒక ప్రత్యేకమైన రైలు (రేక్) గా ఉంది.
ఈ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్, జబల్పూర్ - ముంబై గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ వలెనే భారతదేశంలో సుదీర్ఘమైన గరీబ్ రథ్ రైలుగా రికార్డు సృష్టించింది. ఈ రెండు రైళ్ళూ 16 ఎసి మూడు టైర్ కోచ్‌లు, 2 (ఈఒజి కార్లు) జనరేటర్లు మొత్తం 18 కోచ్‌లను ఒక్కొక్క రైలు కలిగి ఉంది.
లోకో లింకులు
మార్చుఇది ఒక సింగిల్ లాలాగూడా వర్క్ షాప్ ఆధారిత ఇండియన్ లోకోమోటివ్ తరగతి డబ్ల్యుఎపి4 / డబ్ల్యుఎపి7 ఇంజను ద్వారా విజయవాడ వద్ద లోకోమోటివ్ తిరోగమనం దిశతో క్రమంగా నడపబడుతుంది.
గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల జాబితా:
మార్చుఇవికూడా చూడండి
మార్చు- భారతీయ రైల్వేలు నడుపుతున్న రైళ్ళ జాబితా
- గోదావరి ఎక్స్‌ప్రెస్ - హైదరాబాద్ డెక్కన్ నుండి విశాఖపట్నం జంక్షను మధ్యన నడిచే రోజువారీ ఐసిఎఫ్ రైలు.
- దురంతో ఎక్స్‌ప్రెస్ - భారతదేశంలో నడుపుతున్న పాయింట్-టు-పాయింట్, నాన్-స్టాప్ ఎసి / నాన్-ఏసి రైళ్ళ వరుసలు.
- సికింద్రాబాద్ - విశాఖపట్నం ఎసి ఎక్స్‌ప్రెస్ - వీక్లీ ఎసి రైలు
- విశాఖ ఎక్స్‌ప్రెస్ - సికింద్రాబాద్ జంక్షన్ నుండి భువనేశ్వర్ రైల్వే స్టేషనుకు అనుసందానమైన రోజువారీ ఐసిఎఫ్ రైలు.
మూలాలు
మార్చు- ↑ "Secunderabad Visakhapatnam Garib Rath Express". భారతీయ రైల్వేలు. Retrieved 17 May 2018.
- ↑ "duvvada-halt-for-garibrath". The Hindu. Retrieved 1 January 2015.