విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషను

విశాఖపట్నంలోని రైల్వే స్టేషను
(విశాఖపట్నం రైల్వే స్టేషను నుండి దారిమార్పు చెందింది)


తూర్పు తీర రైల్వే జోనులోని ప్రధానమైన రైల్వేస్టేషనులలో విశాఖపట్నం రైల్వేస్టేషను ఒకటి.ఇది ఆంధ్ర ప్రదేశ్ లో అతిపెద్ద రైల్వేస్టేషన్లలో ఒకటి. ఇది హౌరా నుండి చెన్నై వెళ్ళు ప్రధాన రైలుమార్గం లో కలదు. ఇది దేశంలో 20వ రద్దీగా ఉండే స్టేషను.[1]

విశాఖపట్నం రైల్వేస్టేషను
Visakhapatnam Junction Railway station.png
Clockwise from Right to Left
Main Entrance of Visakhapatnam Railway station
Bhubaneshwar bound Intercity Express at Visakhapatnam
Guntur bound
స్టేషన్ గణాంకాలు
చిరునామాజ్ఞానాపురం,రైల్వే న్యూ కోలని ,విశాఖపట్నం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ ,530004
భారతదేశము
భౌగోళికాంశాలు17°43′20″N 83°17′23″E 
మార్గములు (లైన్స్)  హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము
వాహనములు నిలుపు చేసే స్థలంఉన్నది
సామాను తనిఖీఉన్నది
ఇతర సమాచారం
విద్యుదీకరణఅవును   
స్టేషన్ కోడ్ VSKP

విశిష్టతసవరించు

విశాఖపట్నం రైల్వేస్టేషను ను మొదటగా  వాల్తేరు రైల్వే   రైల్వేస్టేషను అని పిలిచేవారు.1987 లో దీని పేరును విశాఖపట్నం రైల్వేస్టేషను  గా మార్చారు. విశాఖపట్నం రైల్వేస్టేషను తూర్పు తీర రైల్వే లో అతిపెద్ద  రైల్వేస్టేషన్ల లో ఒకటి . దీనిని తూర్పు తీర రైల్వే జోన్ నిర్వహిస్తున్నది. విశాఖపట్నం రైల్వేస్టేషను లోనికి వచ్చు  రైలుబండ్లు తమ ప్రయాణ దిశను మార్చుకొని  ప్రయాణించవలసివుంటుంది .అందువల్ల  విశాఖపట్నం రైల్వేస్టేషను లో రైలుబండ్లు ఎక్కువసేపు ఆగవలసివుంటుంది.అందువల్ల ఈ రైల్వేస్టేషన్ లో ప్లాట్‌ఫారములు ఎక్కువ సమయం ఖాళీగా వుండవు. అందువల్ల కొన్ని రైలుబండ్లను కొత్తవలస-దువ్వాడ మార్గంలో మళ్ళిస్తున్నారు. ఈ   రైల్వేస్టేషన్ కు రెండుపక్కల ప్రవేశద్వారాలు కలవు. 

వేదికలు (ప్లాట్‌ఫారములు)సవరించు

విశాఖపట్నం రైల్వేస్టేషన్ లో మొత్తం 8  ప్లాట్‌ఫారములు కలవు.  ప్రతి వేదిక (ప్లాట్‌ఫారము) కూడా 24 కంటే ఎక్కువ బోగీలు కల ఎటువంటి రైలుబండి నయినా కూడా తీసుకుని, నిర్వహించగలుగుతుంది .ఇక్కడ అన్ని ట్రాక్లను బ్రాడ్‌గేజ్‌గా మార్చబడనవి.

విశాఖపట్నం నుండి బయలుదేరు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రైళ్లుసవరించు

రైలుబండి నంబరు. రైలుబండి పేరు వివరము బయలుదేరు స్థలం/నివాసస్థానం చేరుకొను స్థలం/గమ్యం బయలుదేరు రోజులు/ఫ్రీక్వెన్సీ      
12805/06 జన్మభూమి ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ రైల్వేస్టేషను విశాఖపట్నం ప్రతిరోజూ
12727 గోదావరి ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం హైదరాబాద్ డెక్కన్‌ స్టేషను ప్రతిరోజూ
12861/62 విశాఖపట్నం - హజరత్ నిజాముద్దీన్ లింకు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం హజరత్ నిజాముద్దీన్ ప్రతిరోజూ
18519/20 విశాఖ - ముంబాయి లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం లోకమాన్య తిలక్ టెర్మినస్ ప్రతిరోజూ
12739 విశాఖపట్నం గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ గరీబ్ రథ్ విశాఖపట్నం సికింద్రాబాద్|సికింద్రాబాద్ రైల్వేస్టేషను ప్రతిరోజూ
17240 సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం గుంటూరు ప్రతిరోజూ
17488 తిరుమల ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం తిరుపతి ప్రతిరోజూ
12807 సమతా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్ విశాఖపట్నం హజ్రత్ నిజాముద్దీన్ సోమవారం ,శుక్రవారం తప్ప
22415 ఆంధ్రప్రదేశ్ ఎ.సి సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్ ఎ.సి సూపర్ ఫాస్టు విశాఖపట్నం న్యూఢిల్లీ ప్రతిరోజూ
12718 రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ / మెయిల్ విశాఖపట్నం విజయవాడ జంక్షన్ ప్రతిరోజు
22820 విశాఖపట్నం - భుబనేశ్వర్ ఇంటర్ సిటి ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం భుబనేశ్వర్ ప్రతిరోజూ
12784 విశాఖపట్నం -సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను ప్రతి ఆదివారం

విశాఖపట్నం రైల్వేస్టేషను మీదుగా ప్రయాణించే రైలుబండ్ల వివరాలుసవరించు

రైలుబండి నంబరు. రైలుబండి పేరు వివరము బయలుదేరు స్థలం/నివాసస్థానం చేరుకొను స్థలం/గమ్యం బయలుదేరు రోజులు/ఫ్రీక్వెన్సీ
12703/04 ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషను హౌరా ప్రతిరోజూ
12839/40 హౌరా చెన్నై మెయిల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హౌరా చెన్నై సెంట్రల్ ప్రతిరోజూ
12841/42 కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హౌరా చెన్నై సెంట్రల్ ప్రతిరోజూ
12863/64 హౌరా - యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హౌరా యశ్వంతపూర్ ప్రతిరోజూ
17015/16 విశాఖ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ భుబనేశ్వర్ సికింద్రాబాద్ రైల్వేస్టేషను ప్రతిరోజూ
11019/20 కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ భుబనేశ్వర్ లోకమాన్య తిలక్ టెర్మినస్ ప్రతిరోజూ
18645/46 ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ హౌరా హైదరాబాద్ ప్రతిరోజూ
18463/64 ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ భుబనేశ్వర్ [[బెంగుళూరు సిటి రైల్వేస్టేషను|బెంగుళూరు]] ప్రతిరోజూ
18189/90 టాటానగర్ - అలప్పుఝ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ టాటానగర్ అలప్పుఝ ప్రతిరోజూ
13351/52 ధన్‌బాద్ జంక్షన్ - అలప్పుఝ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ ధన్‌బాద్ జంక్షన్ అలప్పుఝ ప్రతిరోజూ

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.

మూసలు, వర్గాలుసవరించు