విశ్వనాథ్ చారియాలి

అస్సాం రాష్ట్రంలోని విశ్వనాథ్ జిల్లా లోని ఒక నగరం, పురపాలక సంఘం.

విశ్వనాథ్ చారియాలి, అస్సాం రాష్ట్రంలోని విశ్వనాథ్ జిల్లా లోని ఒక నగరం, పురపాలక సంఘం. 2015 ఆగస్టు 15న విశ్వనాథ్ జిల్లా ప్రధాన కార్యాలయంగా ఏర్పాటు చేయబడింది. విశ్వనాథ్ ఘాట్ నుండి ఈ నగరం పేరు వచ్చింది.

విశ్వనాథ్ చారియాలి
నగరం
విశ్వనాథ్ చారియాలి is located in Assam
విశ్వనాథ్ చారియాలి
విశ్వనాథ్ చారియాలి
భారతదేశంలోని అసోంలో ప్రదేశం ఉనికి
విశ్వనాథ్ చారియాలి is located in India
విశ్వనాథ్ చారియాలి
విశ్వనాథ్ చారియాలి
విశ్వనాథ్ చారియాలి (India)
Coordinates: 26°43′40″N 93°09′06″E / 26.72778°N 93.15167°E / 26.72778; 93.15167
దేశం భారతదేశం
రాష్ట్రంఅస్సాం
జిల్లావిశ్వనాథ్
Population
 (2011)
 • Total19,145
భాషలు
 • అధికారికఅస్సామీ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
Vehicle registrationఏఎస్

ఇక్కడ అస్సాంలోని మొట్టమొదటి "క్లాక్ టవర్" (ఘంటఘర్, సాధారణంగా ఉత్తర భారత పట్టణాల్లో కనుగొనబడింది) ఏర్పాటు చేశారు. దీని తరువాత డిబ్రూగర్లో క్లాక్ టవర్ ఏర్పాటు చేశారు.

జనాభా మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, [1] విశ్వనాథ్ చారియాలిలో 19,145మంది జనాభా ఉండగా అందులో పురుషులు 51% మంది, స్త్రీలు 49% మంది ఉన్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం, విశ్వనాథ్ చారియాలి సగటు అక్షరాస్యత 80% కాగా, ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 85% ఉండగా, స్త్రీ అక్షరాస్యత 75% ఉంది. ఈ మెత్తం జనాభాలో 9% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.

చరిత్ర మార్చు

విశ్వనాథ్ ప్రాంతం చాలా చారిత్రక ప్రాముఖ్యతను కలిగివుంది. ఈ ప్రాంతం కామతా రాజ్యం, చుటియా రాజ్యాల మధ్య, ఆ తరువాత కోచ్ రాజ్యం, అహోం రాజ్యాల మధ్య సరిహద్దుగా ఉండేది. చుటియా రాజులు నిర్మించిన ప్రతాప్‌గర్, బురోయ్ మొదలైన కోటల శిథిలాలు ఇప్పటికీ ఇక్కడ ఉన్నాయి.[2]

విశ్వనాథ్ దృశ్యాలు మార్చు

విశ్వనాథ్ ఘాట్ మార్చు

 
విశ్వనాథ్ ఆలయం
 
ఉమతుముని ద్వీపం
 
విశ్వనాథ్ ఘాట్ నుండి సూర్యాస్తమయ దృశ్యం

విశ్వనాథ్ చారియాలికి దక్షిణం వైపున, విశ్వనాథ్ ఘాట్ ఉంది, దీనిని "గుప్తా కాశీ" అని కూడా పిలుస్తారు. ఇక్కడున్న పురాతన విశ్వనాథ్ మందిరం పేరునే ఈ నగరానికి పేరు పెట్టారు. ఈ ఘాట్‌లో వివిధ దేవతల దేవాలయాలు ఉన్నాయి. బృధగంగ (బురిగోంగా) నది బ్రహ్మపుత్రా నదిలో కలిసే ప్రాంతం దగ్గర పాణి విశ్వనాథ్ అనే శివాలయం ఉంది. కానీ ప్రస్తుతం ఇక్కడ రాతి గోటలు, ఇతర శిథిలాలు మాత్రమే మిగిలాయి. వేసవికాలంలో ఈ ఆలయం నీటిలోనే ఉంటుంది. బిహు మూడవరోజు పాణి భరాల్ అనే ప్రదేశంలో ఉత్సవం జరుగుతుంది. విశ్వనాథ్ ఘాట్ నుండి దేవతను ఒక రోజు ఈ ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ ఘాట్ కు తిరిగి వస్తారు. ఇక్కడ ఉన్న ఎత్తైన మైదానంలో మరో శివాలయం నిర్మించబడింది. కానీ 1897లో వచ్చిన భూకంపం సమయంలో ఆ శివాలయం భూమిలో మునిగిపోయింది. ఆ తరువాత దానికి బదులుగా ప్రస్తుత విశ్వనాథ్ ఆలయం నిర్మించబడింది.

నాగసంకర్ మందిరం మార్చు

విశ్వనాథ్ చారియాలి నుండి 15 కి.మీ.ల దూరంలో 52వ జాతీయ రహదారిలో ఉన్న నాగసంకర్ గ్రామంలో సా.శ. 4వ శతాబ్దంలో నిర్మించబడిన నాగసంకర్ ఆలయం ఉంది.[3][4] ఈ ఆలయ ప్రాంగణంలో "మోహన్" పేరుకు ప్రతిస్పందించే తాబేలులతో కూడిన అందమైన చెరువు ఉంది.

ఆర్థిక వ్యవస్థ మార్చు

మోనాబరీ, పెర్టుబ్‌ఘర్, సకోమాత, నిల్పూర్, పావోయి, కలాపాని, జిన్జియా, కేటెలా, బిహాలి, హెలెం, గోహ్‌పూర్, బోర్గాంగ్, ధోలీ, మిజికాజన్, మజులీగర్ అనే పచ్చని గ్రీన్ టీ తోటలు ఈ నగరం చుట్టూ ఉన్నాయి.

రాజకీయాలు మార్చు

విశ్వనాథ్ చారియాలి నగరం తేజ్పూర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉంది.[5] విశ్వనాథ్ చారియాలికి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రమోద్ బర్తకూర్ (2016-2021) ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఎంపిగా పల్లాబ్ లోచన్ దాస్ (2019-2024) లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

మూలాలు మార్చు

  1. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 21 December 2020.
  2. Journal Of The Asiatic Society Of Bengal 1904, p. 257-258
  3. "Nagsankar Mandir (Temple)". Retrieved 21 December 2020.
  4. "Nag-Sankar Temple". tripadvisor.in. Retrieved 21 December 2020.
  5. "List of Parliamentary & Assembly Constituencies" (PDF). Assam. Election Commission of India. Archived from the original (PDF) on 4 May 2006. Retrieved 21 December 2020.