వి.ధనంజయ్ కుమార్
వేణుర్ ధనంజయ్ కుమార్ అల్వా ( 1951 జూలై 4 – 2019 మార్చి 4) భారతదేశ మాజీ కేంద్ర మంత్రి మంగళూరు నుండి గెలిచి ఎంపీగా పనిచేశాడు. ధనుంజయ్ కుమార్1996లో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశాడు. 1999 నుండి 2000 వరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు. 2000 నుండి 2003 వరకు కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. దక్షిణ భారతదేశం నుండి కొద్దిమంది బిజెపి ఎంపీలలో ధనుంజయ్ కుమార్ కూడా ఒకరు.
వి.ధనంజయ్ కుమార్ | |
---|---|
భారత దేశ పర్యాటక శాఖ మంత్రి | |
ప్రధాన మంత్రి | ఆటల్ బిహారి వాజపేయి |
అంతకు ముందు వారు | గులాం నబీ ఆజాద్ |
తరువాత వారు | ఇబ్రహీం |
పార్లమెంట్ సభ్యుడు | |
In office 1991–2004 | |
అంతకు ముందు వారు | జనార్ధన్ పూజారి |
తరువాత వారు | సదానంద గౌడ |
నియోజకవర్గం | మంగళూరు లోక్ సభ నియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | మంగళూరు, కర్ణాటక | 1951 జూలై 4
మరణం | 2019 మార్చి 4 మంగళూరు | (వయసు 67)
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
ఇతర రాజకీయ పదవులు | భారతీయ జనతా పార్టీ జనతాదళ్ |
జీవిత భాగస్వామి | వనిత కుమార్ |
నివాసం | బెంగళూరు |
మంగళూరు నియోజకవర్గం నుంచి ధనుంజయ్ కుమార్ వరుసగా నాలుగు పర్యాయాలు ఎంపీగా గెలిచారు. అంతకుముందు 1983లో, ధనుంజయ్ కుమార్ మంగళూరు శాసనసభ నియోజకవర్గం నుండి బిజెపి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి BS యడ్యూరప్పకు గట్టి విధేయుడు అయినందున, ధనుంజయ్ కుమార్ కర్ణాటక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు.
రాజకీయ జీవితం
మార్చు1951లో పూర్వ సౌత్ కెనరాలోని చిన్న పట్టణమైన వేనూరులో ధనంజయ్ కుమార్ జన్మించాడు., ధనుంజయ్ కుమార్ మహావీర కళాశాల, మూడబిద్రి నుండి సైన్స్ ఉడిపి న్యాయ కళాశాల నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ధనుంజయ్ కుమార్, భారతీయ జనతా పార్టీ యువ విభాగం అధ్యక్షుడుగా పనిచేశాడు. ధనుంజయ్ కుమార్1983లో కర్ణాటక శాసనసభ సభ్యుడిగా తొలిసారి గెలిచాడు. 1991లో ఎంపీగా గెలిచి ధనుంజయ్ కుమార్, ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీల హయాంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు. 1996లో ధనుంజయ్ కుమార్ జనార్ధన పూజారిని ఓడించి లోక్‌సభకు ఎన్నికయ్యారు., ధనుంజయ్ కుమార్ మంగళూరు (లోక్‌సభ నియోజకవర్గం) నుండి వరసగా నాలుగుసార్లు ఎంపీగా గెలిచాడు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ధనుంజయ్ కుమార్1996 నుంచి 1999 వరకు భారత పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. 1999 నుండి 2000 వరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ధనుంజయ్ కుమార్ 2000 నుండి 2003 వరకు కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు., 2004 లోక్‌సభ ఎన్నికలలో ధనుంజయ్ కుమార్ కు టిక్కెట్ ఇవ్వలేదు, ఆయనకు బదులుగా డివి సదానంద గౌడకు టికెట్ ఇచ్చారు. 2008 2011 మధ్య యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ధనంజయ్ ఆయనకు అత్యంత సన్నిహితులలో ఒకరిగా మారారు.
కిడ్నీ సమస్య కారణంగా దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ధనుంజయ్ కుమార్ 2019 మార్చి 4న మంగళూరులోని యూనిటీ హాస్పిటల్‌లో మరణించారు.[1]