రక్తసంబంధం (1962 సినిమా)
రక్తసంబంధం 1962లో విడుదలైన తెలుగుచిత్రం. వి.మధుసూదనరావు దర్శకత్వంలో, ఎన్టీ రామారావు, సావిత్రి (నటి) ముఖ్యపాత్రల్లో నటించారు.[1] ఈ సినిమాను డూండీ నిర్మాణం చేశారు. తమిళంలో శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, సావిత్రి ప్రధాన పాత్రల్లో నటించగా విజయవంతమైన పాశమలర్ (பாசமலர்) దీనికి మాతృక.
రక్తసంబంధం (1962 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వి.మధుసూదన్ రావు |
---|---|
నిర్మాణం | సుందర్ లాల్ నహతా & పి. డూండీ |
తారాగణం | నందమూరి తారక రామారావు, సావిత్రి, దేవిక, కాంతారావు, సూర్యకాంతం |
సంగీతం | ఘంటసాల |
నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల |
గీతరచన | అనిసెట్టి |
నిర్మాణ సంస్థ | రాజ్యలక్ష్మి పిక్చర్స్ |
భాష | తెలుగు |
నిర్మాణం
మార్చుఅభివృద్ధి
మార్చుతమిళంలో శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, సావిత్రి ప్రధాన పాత్రల్లో నటించిన హిట్ సినిమా పాశమలర్. అన్నాచెల్లెళ్ళ అనుబంధం నేపథ్యంలో సాగే భారీ నాటకీయ చిత్రం ఇది. సినిమా నిర్మాత డూండీ తమిళ చిత్రం హక్కులు కొని, రచయితగా అప్పటికి సినీరంగానికి పూర్తి కొత్తవారైన ముళ్ళపూడి వెంకటరమణను నియమించుకున్నారు. అయితే భారీ నాటకీయత, శోకభరితమైన సన్నివేశాలూ ఉన్న హెవీ డ్రామా సాహిత్యరంగంలో హాస్యరచయితగా పేరొందిన ముళ్ళపూడి వల్ల ఏమవుతుందని పరిశ్రమ వర్గాలు పెదవి విరిచినా, డుండీ మాత్రం "హాస్యం, విరుపు తెలిసినవాడే హెవీడ్రామా రాయగలడు" అంటూ ప్రోత్సహించారు.[2]
తమిళ స్క్రిప్ట్ అందగానే రమణ తెలుగు స్క్రిప్టును ముఖ్యమైన షాట్ విభజనలు సూచించడంతో సహా సినిమాను దాదాపు రెండు వారాల్లో రాసేశారు. దర్శకుడు వి.మధుసూదనరావు స్క్రిప్ట్ అయినంతవరకూ తీసుకురమ్మని రెండు వారాలకు అడగ్గానే, మొత్తం స్క్రిప్టును చేతిలో పెట్టడంతో ఒకేసారి స్క్రిప్ట్ చూసి ఒకే చేసేశారు.[3]
పాటలు
మార్చుపాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
రక్తసంబంధం ఇదే రక్తసంబంధం హృదయాలను కలిపేది కలకాలం నిలిచేది నిజమైన జన్మ బంధం | అనిసెట్టి | ఘంటసాల | ఘంటసాల |
చందురుని మించు అందమొలికించు ముద్దు పాపాయివే నిను కన్న వారింట కష్టముల నీడ కరిగి పోయేనులే. | అనిసెట్టి | ఘంటసాల | ఘంటసాల, పి.సుశీల |
బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్ళి జరిగేనే కళ్యాణశోభ కనగానే కనులార తనివితీరేనే | అనిసెట్టి | ఘంటసాల | పి.సుశీల, బృందం |
అల్లారు ముద్దుగా అన్నయ్య .. ఇదే రక్తసంబంధం | అనిశెట్టి సుబ్బారావు | ఘంటసాల | ఘంటసాల బృందం |
ఆకాశమేలే అందాలరాజే నకెదురైనడే నన్నే చూసి | డా॥ సినారె | ఘంటసాల | ఎస్. జానకి బృందం |
ఎవరో నను కవ్వించి పోయేదెవరో ఎవరో కాని విరసి విరియని | సి.నారాయణ రెడ్డి | ఘంటసాల | పి.బి. శ్రీనివాస్, పి.సుశీల |
ఓహొ వయ్యారి వదినా ఉలుకెందుకే నీ వగలన్ని ఒకేసారి చూపకే | ఆరుద్ర | ఘంటసాల | పి.సుశీల |
మంచిరోజు వస్తుంది మాకు బ్రతుకునిస్తుంది | కొసరాజు | ఘంటసాల | ఘంటసాల, పి.సుశీల బృందం |
మూలాలు
మార్చు- ↑ ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (11 November 1962). "రక్తసంబంధం చిత్ర సమీక్ష". విశాలాంధ్ర: 6. Retrieved 27 October 2017.[permanent dead link]
- ↑ ముళ్ళపూడి, వెంకటరమణ (జూలై 2013). (ఇం)కోతి కొమ్మచ్చి (6 ed.). హైదరాబాద్: వరప్రసాద్ రెడ్డి.
- ↑ బి.వి.ఎస్.రామారావు (అక్టోబరు 2014). కొసరుకొమ్మచ్చి (3 ed.). హైదరాబాద్: వరప్రసాద్ రెడ్డి.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.