వి. జగదీశ్వర్ గౌడ్
వాలిదాసు జగదీశ్వర్ గౌడ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్‌గా గెలిచాడు.[2]
వి. జగదీశ్వర్ గౌడ్ | |||
పదవీ కాలం 2009 నుండి ప్రస్తుతం | |||
నియోజకవర్గం | శేరిలింగంపల్లి | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1975 జూన్ 24 నల్లగండ్ల, హైదరాబాదు, తెలంగాణ | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలంగాణ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | హరిశంకర్, భాగ్యమ్మ | ||
జీవిత భాగస్వామి | పూజిత[1] | ||
సంతానం | హారిక, వైభవ కృష్ణ | ||
నివాసం | నల్లగండ్ల, హైదరాబాదు, భారతదేశం | ||
మతం | హిందూ |
జననం, విద్యాభాస్యం
మార్చువి. జగదీశ్వర్ గౌడ్ 1975 జూన్ 24న తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, నల్లగండ్ల గ్రామంలో వాలిదాసు హరిశంకర్, భాగ్యమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన సిస్టర్ నివేదిత కాలేజీ నుండి ఎంబీఏ, హైదరాబాద్‌లోని పెండికంటి న్యాయ కళాశాల నుండి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ 2003 నుండి 2004లో వరకు బార్ కౌన్సిల్‌కు ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
మార్చువి. జగదీశ్వర్ గౌడ్ రాజకీయ నేపధ్యమున్న కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన చినాన్న మల్లికార్జున్ గౌడ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ కేంద్రమంత్రిగా పని చేశాడు. జగదీశ్వర్ గౌడ్ 2004లో కాంగ్రెస్ పార్టీ ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి 2002లో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా, ఆ తరువాత 2008లో జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేసి యువజన వ్యవహారాలు & క్రీడలు మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్త సంస్థ నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌కు కార్యనిర్వాహక సభ్యుడిగా నియమితుడయ్యాడు.
జగదీశ్వర్ గౌడ్ 2009లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్‌గా తొలిసారి గెలిచాడు. ఆయన ఆ తరువాత 2016[3], 2020లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెండుసార్లు బీఆర్‌ఎస్ పార్టీ నుండి 107 డివిజన్ మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్‌గా గెలిచాడు.[4]
జగదీశ్వర్ గౌడ్ 2018లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే టికెట్ ఆశించగా, పార్టీ నచ్చజెప్పడంతో ఆయన పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గెలుపులో కీలకంగా పని చేశాడు. ఆయనను 2023 సెప్టెంబర్ 27న జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా నియమితుడయ్యాడు.[5] జగదీశ్వర్ గౌడ్ 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో శేరిలింగంపల్లి టికెట్ కోసం పోటీ పాడగా పార్టీ తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి టికెట్ కేటాయించడంతో మనస్థాపం చెందిన ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి అక్టోబర్ 18న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[6][7][8]
2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భాగంగా అక్టోబర్ 27న కాంగ్రెస్ ప్రకటించిన రెండో జాబితాలో ఆయనను శేరిలింగంపల్లి అభ్యర్థిగా ప్రకటించింది.[9][10][11] ఆయన నవంబర్ 03న నామినేషన్ దాఖలు చేశాడు.[12]
మూలాలు
మార్చు- ↑ TV9 Telugu (1 December 2020). "సంక్షేమ సంఘాల మద్దతు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే పునాదిగా జీహెచ్ఎంసీ బరిలోకి పూజిత గౌడ్". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhrajyothy (28 October 2023). "కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
- ↑ "GHMC Election Results Ward wise - 2016" (PDF).
- ↑ Today, Telangana (5 December 2020). "Here's the full list of new GHMC corporators". Telangana Today. Archived from the original on 3 July 2021. Retrieved 3 July 2021.
- ↑ Andhrajyothy (27 September 2023). "జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ నియామకం". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
- ↑ V6 Velugu (18 October 2023). "కాంగ్రెస్‌లో చేరిన కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ దంపతులు". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
{{cite news}}
: zero width space character in|title=
at position 10 (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ Prabha News (17 October 2023). "కాంగ్రెస్ కండువా కప్పుకున్న బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ జగదీశ్వర్ గౌడ్". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
- ↑ Deccan Chronicle (18 October 2023). "BRS Madhapur corporator, wife join Congress". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
- ↑ Eenadu (27 October 2023). "తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
- ↑ Sakshi (27 October 2023). "కాంగ్రెస్ రెండో జాబితా విడుదల". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
- ↑ Andhrajyothy (27 October 2023). "ఆదరించిన కాంగ్రెస్.. కొత్తగా పార్టీలో చేరినోళ్లకు ఎన్ని టికెట్లు వచ్చాయో ఓ లుక్కేయండి..!". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
- ↑ Eenadu (4 November 2023). "శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి స్థిరాస్తులు రూ.118 కోట్లు". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.