వంగిపురం హరికిషన్

(వి. హరికిషన్ నుండి దారిమార్పు చెందింది)

వంగిపురం హరికిషన్ (1963, మే 30 - 2020, మే 23) ఆంధ్రప్రదేశ్ కు చెందిన మిమిక్రీ కళాకారుడు.[1] ఒక గంటలో 100మంది గొంతులను అనుకరించి ‘శత కంఠ ధ్వన్యనుకరణ ధురీణ’ బిరుదును పొందాడు.[2]

వంగిపురం హరికిషన్

జీవిత విశేషాలు

మార్చు

1963, మే 30న ఏలూరులో రంగమణి, వి.ఎల్.ఎన్.చార్యులు దంపతులకు జన్మించాడు.

మిమిక్రి

మార్చు

అతను 8 సంవత్సరాల వయసులోనే తమ గురువుల కంఠాల్నీ, బంధువులు కంఠాల్నీ అనుకరించడం ప్రారంభించి మెల్లగా సమాజంలోని ప్రముఖుల, క్రికెట్ కళాకారుల, రాజకీయ నాయకుల, సినీ తారల, కవుల, గాయకుల గొంతును అనుసరించడం నేర్చుకున్నాడు. అంతేకాక పశుపక్ష్యాదుల శబ్దాలు, యంత్రాలు చేసే శబ్దాలు, సంగీత వాద్య పరికరాల శబ్దాలను పలికించడం నేర్చుకున్నాడు.[3]తన మొట్టమొదటి మిమిక్రీ ప్రదర్శన 1971 మే 12న విజయవాడలో తాను చదువుతున్న పాఠశాలలోనే జరిగింది. దేశ విదేశాల్లో 10 వేలకు పైగా మిమిక్రీ ప్రదర్శనలు ఇచ్చాడు. టీవీ కార్యక్రమాల్లో , సీరియల్స్, సినిమాల్లో నటించాడు. హైదరాబాద్‌లోని ఆల్‌ సెయింట్‌ హైస్కూల్‌లో 12 ఏళ్ళపాటు మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ ఉపాధ్యాయుడిగా, తరువాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లో మిమిక్రీ లెక్చరర్‌గా పనిచేశాడు.[4]

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ 2020, మే 23న మరణించాడు.[5]

మూలాలు

మార్చు
  1. "మిమిక్రీ హరికిషన్‌కు ఆకృతి సుహృతి". Archived from the original on 2022-10-07. Retrieved 2018-06-05.
  2. ఈనాడు, సినిమా (23 May 2020). "ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ కన్నుమూత". m.eenadu.net. Archived from the original on 23 మే 2020. Retrieved 23 May 2020.
  3. "Hari Kishan-Mimicry,Hyderabad | eventaa". eventaa.com. Retrieved 2018-06-05.
  4. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (23 May 2020). "ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్‌ హరికిషన్‌ కన్నుమూత". www.andhrajyothy.com. Archived from the original on 23 మే 2020. Retrieved 23 May 2020.
  5. నమస్తే తెలంగాణ, సినిమా (23 May 2020). "మిమిక్రీ ఆర్టిస్ట్ హ‌రికిష‌న్ క‌న్నుమూత‌". www.ntnews.com. Archived from the original on 23 మే 2020. Retrieved 23 May 2020.

ఇతర లింకులు

మార్చు