డా. వీరమాచనేని విమలా దేవి (Dr. Viramachaneni Vimla Devi) భారత పార్లమెంటు సభ్యురాలు.[1]

వీరమాచనేని విమలా దేవి
వీరమాచనేని విమల దేవి


పదవీ కాలము
1962 - 1967
ముందు మోతే వేదకుమారి
తరువాత కొమ్మారెడ్డి సుర్యనారాయణ
నియోజకవర్గము ఏలూరు

వ్యక్తిగత వివరాలు

జననం (1928-07-15) 1928 జులై 15 (వయస్సు: 92  సంవత్సరాలు)
వరాహపట్నం, ఆంధ్ర ప్రదేశ్, India
రాజకీయ పార్టీ భారత కమ్యూనిష్టు పార్టీ

ఈమె 1928 లో కృష్ణా జిల్లాలోని వరాహపట్నంలో జన్మించింది. ఈమె తండ్రి కె. పట్టాభిరామయ్య.

ఈమె ఋషి వాలీ పాఠశాల, ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల, స్కాటిష్ చర్చి కళాశాలలలో విద్యాభ్యాసం చేసింది. ఆమె విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాల నుండి వైద్యవిద్యలో పట్టా పొందినది.

ఈమె డా. వి.వి.జి. తిలక్ ను వివాహం చేసుకున్నది. వీరికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి..

ఈమె సాంఘిక సేవలో చురుకుగా పాల్గొని, ఏలూరు మునిసిపాలిటీకి ఉప సభాపతి గాను తర్వాత కౌన్సిలర్ గాను సేవలందించారు.

ఈమె 1962లో ఏలూరు లోకసభ నియోజకవర్గం నుండి 3వ లోకసభకు భారత కమ్యూనిష్టు పార్టీ సభ్యురాలిగా పోటీచేసి గెలుపొందింది.

మూలాలుసవరించు