వుచ్చిడి మెహన్ రెడ్డి

వుచ్చిడి మెహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1983లో సిరిసిల్ల నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా,[1] రెండుసార్లు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఛైర్మన్‌గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ చైర్మన్‌గా వివిధ హోదాల్లో పనిచేసి ప్రస్తుతం కరీంనగర్ జిల్లా సీనియర్‌ సిటిజన్స్‌ ఫోరం గౌరవాధ్యక్షుడిగా ఉన్నాడు.[2]

వుచ్చిడి మెహన్ రెడ్డి
వుచ్చిడి మెహన్ రెడ్డి


ఎమ్మెల్యే
పదవీ కాలం
1983 – 1985
ముందు చెన్నమనేని రాజేశ్వరరావు
తరువాత చెన్నమనేని రాజేశ్వరరావు
నియోజకవర్గం సిరిసిల్ల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 8 జులై 1947
అల్మాస్‌పూర్ గ్రామం, ఎల్లారెడ్డిపేట్ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు వెంకట నర్సింహా రెడ్డి, భూదేవి
జీవిత భాగస్వామి భాగ్యలక్ష్మి
సంతానం ముగ్గురు కుమార్తెలు (పద్మ, రాణి, పజ్జురి పావని రెడ్డి), ఒక కుమారుడు (దేవేందర్ రెడ్డి)
నివాసం కరీంనగర్
వృత్తి రాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యం

మార్చు

వుచ్చిడి మోహన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట్ మండలం, అల్మాస్‌పూర్ గ్రామంలో వుచ్చిడి వెంకట నర్సింహా రెడ్డి, భూదేవి దంపతులకు మూడు సంతానంగా 1947 జూలై 8న జన్మించాడు. ఆయన ఒకటో తరగతి నుండి 5 వరకు అల్మాస్‌పూర్ గ్రామంలో, 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఎల్లారెడ్డిపేట్ లో పూర్తి చేసి, ముస్తాబాద్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివాడు.

రాజకీయ జీవితం

మార్చు

వుచ్చిడి మోహన్‌రెడ్డి 1965 నుండి 1966 వరకు ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేసి ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చి 1969లో ఉమ్మడిగా ఉన్న అల్మాస్‌పూర్ & రాజన్నపేట్ గ్రామా సర్పంచ్‌గా ఎన్నికై 11 సంవత్సరాల పాటు సర్పంచ్‌గా పనిచేశాడు. ఆయన 1980లో తిరిగి సర్పంచ్‌గా ఎన్నికై వేములవాడ సమితి వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనాడు. మెహన్ రెడ్డి 1981లో సహకారరంగంలోని ఏడీబీలో డైరెక్టర్‌గా పనిచేశాడు.

మెహన్ రెడ్డి 1981 నుండి 1984 వరకు సిరిసిల్ల కో - ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్‌గా పనిచేసి, 1983లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఐ పార్టీ అభ్యర్థి చెన్నమనేని రాజేశ్వరరావు పై 7699 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన తరువాత టీడీపీలో చేరి ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ చైర్మన్‌గా, 1984 - 1989 & 1992 - 1994 రెండు పర్యాయాలు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఛైర్మన్‌గా పనిచేశాడు. వుచ్చిడి మోహన్‌రెడ్డి 1984 నుంచి ఇప్పటివరకు 38 ఏళ్లుగా అల్మాస్‌పూర్ సహకార సంఘం చైర్మన్‌గా ఉంటూ 2005 నుండి 2013 వరకు కరీంనగర్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ (కేడీసీసీబీ) డైరెక్టర్‌గా, 2013 నుండి 2020 వరకు వైస్‌చైర్మన్‌గా పనిచేసి 2020 నుండి ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ డైరక్టర్‌గా ఉన్నాడు.[3]

మూలాలు

మార్చు
  1. Mana Telangana (9 November 2018). "సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో గులాబీ హాట్రిక్". Archived from the original on 12 April 2022. Retrieved 12 April 2022.
  2. Namasthe Telangana (16 August 2021). "రెపరెపలాడిన త్రివర్ణ పతాకం". Archived from the original on 12 April 2022. Retrieved 12 April 2022.
  3. Sakshi (10 February 2020). "దిగ్గజ నాయకులను అందించిన సహకార ఎన్నికలు". Archived from the original on 12 April 2022. Retrieved 12 April 2022.