చెన్నమనేని రాజేశ్వరరావు

చెన్నమనేని రాజేశ్వరరావు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సీనియర్ రాజకీయ నాయకులు, సిరిసిల్ల మాజీ శాసనసభ్యుడు. రాజేశ్వరరావు ఆరు సార్లు శాసనసభ్యులుగా గెలిశారు. 1957లో మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఐదు సార్లు, మెట్‌పల్లి నుంచి ఓ సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన స్వస్థలం కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం మారుపాక గ్రామం. రాజేశ్వరరావు రాజకీయ జీవితం సీపీఐ పార్టీతో ప్రారంభమైంది.[1]

చెన్నమనేని రాజేశ్వరరావు

మాజీ శాసనసభ్యుడు
నియోజకవర్గము సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1923-08-31) 1923 ఆగస్టు 31 (వయస్సు: 97  సంవత్సరాలు)
మారుపాక , కరీంనగర్ జిల్లా
మరణం మే 9 2016
హైదరాబాదు
రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టి
తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి లలితాదేవి
సంతానము ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు
మతం హిందూ

జీవిత విశేషాలుసవరించు

కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులలో ఒకరైన చెన్నమనేని రాజేశ్వరరావు ఆగస్టు 31, 1923న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ, ఎల్.ఎల్.బి.పట్టా పొందినారు. విద్యార్థి దశలోనే జాతీయోద్యమంలోనూ, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ పాల్గొన్నారు. ఆగస్టు 15, 1947న హైదరాబాదులో జాతీయజెండాను ఎగురవేశారు. హైదరాబాదు రాజ్య విమోచన అనంతరం కమ్యూనిస్టు పార్టిలో చేరి కమ్యూనిస్టు, పీడీఎఫ్ తరఫున 5 సార్లు శాసనసభకు ఎన్నికైనారు. సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా సేవలందించారు. 1999లో టీడీపీలో చేరారు.తెలుగుదేశం పార్టీలో చేరి 2004లో శాసనసభ్యులుగా గెలుపొందినారు. 2009లో ప్రత్యక్షరాజకీయాల నుంచి వైదొలగి ఆయన కుమారుడు చెన్నమనేని రమేష్‌ కు టికెట్ ఇప్పించి గెలిపించారు.

వ్యక్తిగత జీవితంసవరించు

ఈయన సోదరుడు చెన్నమనేని విద్యాసాగర్ రావు భారతీయ జనతా పార్టికి చెందిన ప్రముఖుడు, కేంద్ర మంత్రిగా పనిచేశారు, ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నరుగా యున్నారు. మరో సోదరుడు చెన్నమనేని హన్మంతరావు జాతీయస్థాయిలో పేరుపొందిన ఆర్థికవేత్త. రాజేశ్వరరావు కుమారుడు చెన్నమెనేని రమేష్ ప్రస్తుత వేములవాడ నియోజకవర్గం శానససభ్యులుగా ఉన్నారు. [2] రాజేశ్వరరావు చిన్న కుమారుడు చెన్నమనేని వికాస్ వైద్యరంగంలో రేడియాలజిస్ట్‌గా పేరుపొందారు.

మరణంసవరించు

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం మే 9 2016 తెల్లవారు జామున 3 గంటలకు సోమాజీగూడ యశోదా ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.[3]

మూలాలుసవరించు

  1. చెన్నమనేని రాజేశ్వరరావు కన్నుమూత[permanent dead link]
  2. "సాయుధ పోరాటయోధుడు, మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు కన్నుమూత". Archived from the original on 2016-05-10. Retrieved 2016-05-09.
  3. మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని కన్నుమూత

ఇతర లింకులుసవరించు