ఉయ్యూరు
ఉయ్యూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం.521 165., యస్.టీ.డీ.కోడ్ = 08676.
ఉయ్యూరు | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా జిల్లా |
మండలం | ఉయ్యూరు |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2001) | |
- మొత్తం | 46,490 |
- పురుషుల సంఖ్య | 22,116 |
- స్త్రీల సంఖ్య | 21,153 |
- గృహాల సంఖ్య | 10,323 |
పిన్ కోడ్ | 521 165 |
ఎస్.టి.డి కోడ్ | 08676 |
ఉయ్యూరు | |
— మండలం — | |
కృష్ణా జిల్లా పటములో ఉయ్యూరు మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో ఉయ్యూరు స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°22′0″N 80°51′0″E / 16.36667°N 80.85000°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
మండల కేంద్రం | వుయ్యూరు |
గ్రామాలు | 9 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 73,767 |
- పురుషులు | 37,295 |
- స్త్రీలు | 36,472 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 75.12% |
- పురుషులు | 79.45% |
- స్త్రీలు | 70.70% |
పిన్కోడ్ | 521165 |
విషయ సూచిక
- 1 గ్రామ చరిత్ర
- 2 గ్రామం పేరు వెనుక చరిత్ర
- 3 గ్రామ భౌగోళికం
- 4 గ్రామానికి రవాణా సౌకర్యాలు
- 5 గ్రామములోని విద్యాసౌకర్యాలు
- 6 గ్రామములోని మౌలిక సదుపాయాలు
- 7 గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం
- 8 గ్రామ పంచాయతీ
- 9 గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు
- 10 గ్రామములోని ప్రధాన పంటలు
- 11 గ్రామములోని ప్రధాన వృత్తులు
- 12 గ్రామ ప్రముఖులు
- 13 గ్రామ విశేషాలు
- 14 ఉయ్యూరు నియోజకవర్గం
- 15 గ్రామాలు
- 16 గణాంకాలు
- 17 జనాభా
- 18 వనరులు
- 19 వెలుపలి లింకులు
గ్రామ చరిత్రసవరించు
గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు
గ్రామ భౌగోళికంసవరించు
[1] సముద్రమట్టానికి 11 మీటర్ల ఎత్తు
సమీప గ్రామాలుసవరించు
గుడివాడ, విజయవాడ, తెనాలి, మంగళగిరి
సమీప మండలాలుసవరించు
తోట్లవల్లూరు, కంకిపాడు, పమిడిముక్కల, పెదపారుపూడి
గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు
వుయ్యూరు, మానికొండ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 29 కి.మీ
గ్రామములోని విద్యాసౌకర్యాలుసవరించు
కళాశాలలుసవరించు
ఎ.జీ.ఎస్.జీ.ఎస్.డిగ్రీ కళాశాలసవరించు
ఎ.జీ.ఎస్.జీ.ఎస్.జూనియర్ కళాశాలసవరించు
- ఈ కళాశాల విద్యార్థిని ఎస్.కె.బాజీబీ, ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో రెండు బంగారు, ఒక రజతపతకాన్నీ గెలుచుకొని, జాతీయస్థాయి పోటీలలో పాల్గొనుటకు అర్హత సాధించింది. [6]
- ఈ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుచున్న రెజ్లింగ్ క్రీడాకారిణి వెంకటలక్ష్మి, ఇటీవల విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో తన ప్రతిభ ప్రదర్శించి, స్వర్ణ పతకం సాధించడమేగాక, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనది. త్వరలో పంజాబు రాష్ట్రంలో నిర్వహించు జాతీయ పోటీలలో ఈమె పాల్గొంటుంది. [7]
పాఠశాలలుసవరించు
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలసవరించు
ఇటీవల కర్నూలు జిల్లాలోని నందికొట్కూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-14 స్కూల్ గేంస్ కబడ్డీ పోటీలలో, ఈ పాఠశాల విద్యార్థి వల్లూరి చింతయ్య, కృష్ణా జిల్లా జట్టులో పాల్గొని, తన ప్రతిభ ప్రదర్శించి, జాతీయజట్టులో పాల్గొనడానికి అర్హత సంపాదించాడు. 2016,నవంబరులో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో ఈ విద్యార్థి పాల్గొంటాడు. [12]
వి.ఆర్.కె.ఎం. ఉన్నత పాఠశాలసవరించు
ఫ్లోరా ఇంగ్లీషు మీడియం పాఠశాలసవరించు
గ్రామములోని మౌలిక సదుపాయాలుసవరించు
చలనచిత్ర ప్రదర్శన శాలలుసవరించు
- దీపక్
- సాయిమహల్
- శ్రీనివాస్
- శాంతి
వంట గ్యాస్ సరఫరా దారులుసవరించు
- అరుణ్ గ్యాస్ ఏజెన్సీ (హెచ్.పి)
- శ్రీ మహాలక్ష్మీ గ్యాస్ ఏజెన్సీ (హెచ్.పి)
- శివకృష్ణ గ్యాస్ ఏజెన్సీ (హెచ్.పి)
- రత్నా గ్యాస్ ఏజెన్సీ (హెచ్.పి)
- ఉషాకిరణ్ గ్యాస్ ఏజెన్సీ (భారత్)
బ్యాంకులుసవరించు
భారతీయ స్టేట్ బ్యాంక్:- ఈ బ్యాంక్ శాఖ 2016,సెప్టెంబరు-28న 46వ వార్షికోత్సవం జరుపుకొనుచున్నది. [11]
గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యంసవరించు
గ్రామ పంచాయతీసవరించు
- శ్రీ అన్నే బాబూరావుగారు 1980-85 లో ఈ గ్రామ పంచాయతీ సర్పంచిగా పనిచేశారు. ఆ తరువాత ఉయ్యూరు నియోజకవర్గ శాసనసభ్యునిగా పోటీచేసి 1985,1994, 1999లలో మూడుసార్లు గెలుపొందారు. గ్రామీణప్రాంతాలలో మంచిపట్టు, అభిమానం ఉన్న ఆయన శాసనసభ్యునిగా ఉంటూనే 2001 లో నిర్యాణం చెందారు.[2]
- శ్రీ వై.వీ.బీ.రాజేంద్రప్రసాద్ గారు 1995-2001 లో ఉయ్యూరు గ్రామ సర్పంచిగా, 2001-06 లో జడ్.పీ.టీ.సీ. సభ్యునిగా పనిచేశారు. 2006, 2007 లలో ఎం.పీ.టీ.సీ. సభ్యునిగా 2007లో ఎం.ఎల్.సీగా ఎన్నికైనారు. పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్ఠతకు రాష్ట్ర స్థాయిలో కృషిచేసిన ఈయన, రాష్ట్ర సర్పంచుల సంఘం గౌరవాధ్యక్షులుగా, రాష్ట్ర ఎం.పీ.టీ.సీ సభ్యుల సంఘం అధ్యక్షులుగా పేరు తెచ్చుకున్నారు.[2]
- మేజరు పంచాయతీగా ఉయ్యూరును ఎంతోకాలముగా మున్సిపాలీటీగా మార్చాలని చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వము నుండి 2011 సం.న ఆమోదము లభించింది.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములుసవరించు
- శ్రీ జగదాంబ సమేత సోమేశ్వరాలయం:-ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం, 2017,ఫిబ్రవరి-10వ తేదీ శుక్రవారం, మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా వైభవంగా నిర్వహించారు. రాత్రికి స్వామివారి రథోత్సవం కన్నులపండువగా సాగినది. [13]
- శ్రీ విజయదుర్గాభవాని ఆలయం;- ఈ ఆలయం స్థానిక తోట్లవల్లూరు రహదారిపై ఉన్నది.
- శ్రీ లక్ష్మీనాంచారమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక తిరుణాళ్ళను, 2015,మార్చి-5వ తేదీ (ఫాల్గుణ పౌర్ణమి) గురు వారం నాడు ఘనంగా నిర్వహించారు. భక్తజనం ఉదయాన్నే ఆలయానికి తరలివచ్చారు. వివిధ ప్రాంతాలనుండి వచ్చిన భక్తులు, మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం అమ్మవారి నూతన వస్త్రాలు, పసుపు,కుంకుమల ఊరేగింపు సాగినది. రాత్రి అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. [3]
- శ్రీ సువర్చలా సమేత ఆంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి ఉత్సవాలు, ఐదురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [4]
- శ్రీ అంకమ్మ తల్లి ఆలయం:- ఉయ్యూరులోని కాటూరు రహదారి సమీపంలో గల ఈ ఆలయంలో, జంపాన కుటుంబీకుల ఆధ్వర్యంలో అమ్మవారి జాతరను, ప్రతి సంవత్సరం, వైశాఖమాసంలో ఐదురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [5]
- శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం.
- శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం.
- దయోరా మసీదు.
శ్రీ కనకచింతయ్య, శ్రీ వీరమ్మ తల్లి ఆలయంసవరించు
జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఉయ్యూరు వీరమ్మ తల్లి వార్షిక తిరుణాళ్ళు ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ ఏకాదశు (భీష్మ ఏకాదశి) నుండి 15 రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లానుండియేగాక, చుట్టుప్రక్కల జిల్లాలనుండి గూడా భక్తులు లక్షలాదిగా తరలివచ్చెదరు. భీష్మ ఏకాదశినాడు రావిచెట్టు కూడలి సమీపంలో ఉన్న మెట్టినింటి ఆలయం నుండి బయలుదేరిన అమ్మవారు, మరుసటిరోజైన దశమినాడు రాత్రికి పుట్టినిల్లైన ఆలయంలోనికి ప్రవేశిస్తుంది. తిరునాళ్ళ చివరిరోజున అర్ధరాత్రి దాటిన తరువాత, అమ్మవారిని ఆలయంలోనుండి వెలుపలికి తీసి, తోట్లవల్లూరు మండలం ఐలూరు వద్ద కృష్ణానదిలో స్నానమాచరింపజేసి, తిరిగి మెట్టినింటి ఆలయానికి తీసుకొని వెళతారు. తిరునాళ్ళ జరిగే పక్షం రోజులూ ఉయ్యూరు పట్టణం ఆధ్యాత్మికత సంతరించుకుంటుంది.
ఠాణాలో పూజలుసవరించు
తిరునాళ్ళ ప్రారంభంరోజున అమ్మవారు మెట్టినింటి నుండి బయలుదేరే మందుగా పోలీస్ శాఖవారు అమ్మవారికి నూతనవస్త్రాలు, పసుపుకుంకుమలు సమర్పించడం ఆనవాయితీ. ఉయ్యూరు పట్టణ పోలీస్ స్టేషనులో పూజా కార్యక్రమాలు నిర్వహించి, స్టేషన్ అధికారి దంపతులు మేళతాళాలతో ఊరేగింపుగా నూతన వస్త్రాలు, పసుపుకుంకుమలను అమ్మవారికి సమర్పించెదరు.
గండదీపాల మొక్కులుసవరించు
అమ్మవారు మాఘ ఏకాదశినాడు మెట్టినింటి ఆలయంనుండి వెలుపలికి వస్తున్న సమయంలో, వివిధ ప్రాంతాలనుండి అక్కడకు చేరుకున్న వేలాదిమంది మహిళలు గండదీపాలతో ఎదురేగి, అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. ఆ సమయంలో వేలాది దీపాలతో ఆ ప్రాంతం మనోహరంగా గోచరిస్తుంది. అనంతరం అమ్మవారికి గ్రామోత్స్వం నిర్వహించెదరు. ఆ సమయంలో వేలాదిమంది మహిళలు, భక్తులు తిరుగుడు గండదీపాలతో మొక్కులు తీర్చుకుంటారు. గండదీపాలతో మొక్కులు తీర్చుకొనే భక్తులు ఉపవాసదీక్షలో ఉంటారు.
ఊయల ఉత్సవంసవరించు
మాఘ శుద్ధ ద్వాదశిరోజు రాత్రి జరిగే ఊయల ఉత్సవం అత్యంత ఘనంగా జరుగుతుంది. ఉయ్యూరు ప్రధాన కూడలిలో కారు స్టాండు వద్దగల ఊయలలో అమ్మవారికి డోలాయమాన కార్యక్రమం నిర్వహించెదరు. ఆ సమయంలో లక్షమందికి పైగా భక్తులు పాగొంటారు. ఊయల ఉత్సవం అనంతరం జంతుబలి, దాన కార్యక్రమం అనంతరం అమ్మవారిని తిరునాళ్ళ ఆలయ ప్రవేశం చేయించెదరు. ఉయ్యూరు గ్రామంలో ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ ఏకాదశి నుంచి బహుళ ఏకాదశి వరకు పదిహేను రోజుల పాటు వీరమ్మ తల్లి తిరునాళ్ళు జరుగు తాయి.
సిడిబండివేడుకసవరించు
తిరునాళ్ళు ప్రారంభమైన 11వ రోజున సిడిబండి కార్యక్రమం మనోహరంగా నిర్వహించెదరు. ఈ ఉత్సవానికి భక్తులు వివిధ ప్రాంతాలనుండి లక్షలలో విచ్చేస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా, పెళ్ళికి సిద్ధంగా ఉన్న ఒక దళిత యువకుడిని సిడిబండి బుట్టలో కూర్చొనబెట్టి, ఆలయప్రాంగణంలో తిప్పే కార్యక్రమన్ని అంతా ఉత్సాహంతో తిలకించెదరు. 15వ రోజు అర్ధరాత్రి దాటిన తరువాత అమ్మవారిని తిరునాళ్ళ ఆలయం నుండి బయటకు తీసుకొని వస్తారు. [9]
గ్రామములోని ప్రధాన పంటలుసవరించు
గ్రామములోని ప్రధాన వృత్తులుసవరించు
గ్రామ ప్రముఖులుసవరించు
గ్రామ విశేషాలుసవరించు
- ప్రసిద్ధి చెందిన కే.సి.పి. చక్కెర కర్మాగారము ఇచటనే గలదు.
- కుమారి ధరావతు బాలి:- ఉయ్యూరు లోని 15వ వార్డులో నివసించుచున్న ఒక సాధారణ కుటుంబానికి చెందిన ఈమె, అథ్లెటిక్స్ లో రాణించుచున్నది. ఉత్తమ అథ్లెట్ గా రాణించుటకై ఆరు సంవత్సరాలనుండి డిస్కస్, షాట్ పుట్, హ్యామర్ థ్రో క్రీడలలో నిరంతర సాధన చేస్తోంది. ఇప్పటికే ఈమె పలు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలలో స్వర్ణ, రజత, కాంస్యపతకాలు సాధించి, అంతర్జాతీయ పోటీలలో పాల్గొనుటకు ఎంపిక అయినది. ఇంతవరకు రెండు సార్లు అంతర్జాతీయ పోటీలకు ఎంపికైనా గానీ, ఆర్ధిక ఇబ్బందుల వలన పాల్గొనలేకపోయింది. తాజాగా ఈమె, సెప్టెంబరులో సింగపూరులో నిర్వహించు ఏషియాడ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ -2016 పోటీలలో పాల్గొనుటకు ఎంపికైనది. 8వ తరగతి వరకు చిదివిన ఈమె దూరవిద్యా విధానంలో డిగ్రీ చదువుచున్నది. [10]
ఉయ్యూరు నియోజకవర్గంసవరించు
గ్రామాలుసవరించు
- ఉయ్యూరులో పురుషుల కంటే స్త్రీ జనాభా అధికము. 2011 సం.నకు మొత్తము జనాభా సుమారు 40,650. మొత్తము వార్డులు పది. వార్షిక ఆదాయము సుమారు 2 కోట్లు. ఎమ్.పీ.టీ.సీ స్థానాలు మొత్తము పది ఉన్నాయి.
గణాంకాలుసవరించు
- జనాభా (2001) - మొత్తం 201 - పురుషుల సంఖ్య 98 - స్త్రీల సంఖ్య 103 - గృహాల సంఖ్య 54
- జనాభా (2011) - మొత్తం 43,269 - పురుషుల సంఖ్య 22,116 - స్త్రీల సంఖ్య 21,153 - గృహాల సంఖ్య 10,323
జనాభాసవరించు
- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[3]
క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
---|---|---|---|---|---|
1. | ఆకునూరు | 826 | 3,243 | 1,637 | 1,606 |
2. | బొల్లపాడు | 538 | 1,818 | 920 | 898 |
3. | చిన ఓగిరాల | 828 | 3,179 | 1,608 | 1,571 |
4. | జబర్లపూడి | 56 | 192 | 95 | 97 |
5. | కడవకొల్లు | 373 | 1,432 | 695 | 737 |
6. | కలవపాముల | 993 | 3,663 | 1,794 | 1,869 |
7. | కాటూరు | 1,907 | 7,221 | 3,578 | 3,643 |
8. | ముదునూరు | 1,164 | 4,125 | 2,070 | 2,055 |
9. | పెద ఓగిరాల | 1,038 | 3,676 | 1,816 | 1,860 |
10. | శాయపురం | 225 | 829 | 421 | 408 |
11. | వీరవల్లి మొఖస | 288 | 1,120 | 545 | 575 |
12. | ఉయ్యూరు | 10,323 | 43,269 | 22,116 | 21,153 |
వనరులుసవరించు
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Vuyyuru/Vuyyuru". Retrieved 23 June 2016. Cite web requires
|website=
(help); External link in|title=
(help) - ↑ 2.0 2.1 ఈనాడు కృష్ణా జులై 12, 2013. 8వ పేజీ.
- ↑ 2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు
వెలుపలి లింకులుసవరించు
[3] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2015,మార్చి-6; 1వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015,మే-13; 21వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2015,మే-15; 21వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2015,ఆగస్టు-26; 32వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-3; 33వపేజీ. [8] ఈనాడు అమరావతి/పెనమలూరు; 2016,ఫిబ్రవరి-13; 1వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2016,ఫిబ్రవరి-17; 3వపేజీ. [10] ఈనాడు అమరావతి/పెనమలూరు; 2016,ఏప్రిల్-6; 1వపేజీ. [11] ఈనాడు అమరావతి/పెనమలూరు; 2016,సెప్టెంబరు-28; 2వపేజీ. [12] ఈనాడు అమరావతి/పెనమలూరు; 2016,అక్టోబరు-29; 1వపేజీ. [13] ఈనాడు అమరావతి/పెనమలూరు; 2017,ఫిబ్రవరి-11; 1వపేజీ.