వెంకటాపురం మండలం
వెంకటాపురం మండలం, తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లాకు చెందిన మండలం.[1] 2018 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం ములుగు జిల్లాను ఏర్పాటు చేసింది. మరో 8 మండలాలతో పాటు వెంకటాపురం మండలాన్ని కూడా కొత్త జిల్లాలోకి చేర్చారు.[2] ఇది సమీప పట్టణమైన మణుగూరు నుండి 71 కి. మీ. దూరంలో ఉంది. 2016 పునర్వ్యవస్థీకరణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేరిన ఈ మండలం, 2019 లో చేసిన మరో పునర్వ్యవస్థీకరణలో ములుగు జిల్లాలో భాగమైంది.[3][4] ప్రస్తుతం ఈ మండలం ములుగు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది భద్రాచలం, ములుగు డివిజనులో ఉండేది. ఈ మండలంలో 72 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 27 నిర్జన గ్రామాలు. ఈ మండల ప్రధాన పరిపాలనా కేంద్రం, వెంకటాపురం.
వెంకటాపురం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో ములుగు జిల్లా, వెంకటాపురం స్థానాలు | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | ములుగు జిల్లా |
మండల కేంద్రం | వెంకటాపురం |
గ్రామాలు | 45 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 589 km² (227.4 sq mi) |
జనాభా | |
- మొత్తం | 31,765 |
- పురుషులు | 15,384 |
- స్త్రీలు | 16,381 |
పిన్కోడ్ | {{{pincode}}} |
చరిత్ర
మార్చుదీనిని నూగూరు వెంకటాపురం అని కూడా పిలుస్తారు. గతంలో వెంకటాపురం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా నూగూరు తహసీల్ లేదా తాలూకాలో ఉండేది.[5]
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 31,765 - పురుషులు 15,384 - స్త్రీలు 16,381
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 589 చ.కి.మీ. కాగా, జనాభా 31,765. జనాభాలో పురుషులు 15,384 కాగా, స్త్రీల సంఖ్య 16,381. మండలంలో 8,798 గృహాలున్నాయి.[6]
ఖమ్మం జిల్లా నుండి జయశంకర్ జిల్లాలో విలీనం
మార్చుగతంలో వెంకటాపురం మండలం, ఖమ్మం జిల్లా, భద్రాచలం రెవెన్యూ డివిజను పరిధిలో ఉండేది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా తెలంగాణా ప్రభుత్వం 2016 లో నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కొత్తగా ఏర్పాటైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు రెవెన్యూ డివిజను పరిధిలో వెంకటాపురం మండలాన్ని 72 గ్రామాలుతో చేర్చుతూ ది.1.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[7]
జయశంకర జిల్లా నుండి ములుగు జిల్లాలో విలీనం
మార్చుతిరిగి ఈ మండలం జయశంకర్ జిల్లాలోని ములుగు రెవెన్యూ డివిజన్ను విడదీసి, మొత్తం 9 మండలాలతో 2019 ఫిబ్రవరి 16న కొత్తగా ఏర్పడిన ములుగు జిల్లా, ములుగు రెవెన్యూ డివిజను పరిధిలో చేరింది.[3]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- వాడగూడెం (జి)
- కొండాపురం (జెడ్)
- వాడగూడెం (జెడ్)
- కే.కొండాపురం (జెడ్)
- సుడిబాక (జి)
- సూరవీడు (జెడ్)
- మరికల (జెడ్)
- వెంకటాపురం (జి)
- వెంకటాపురం (జెడ్)
- సూరవీడు (జి)
- పాలెం (జి)
- ఉప్పేడు వీరపురం (జెడ్)
- ఎధిర (జి)
- ఉప్పేడు (జెడ్)
- బండగూడెం (జి)
- కోయబెస్తగూడెం (జి)
- ఒంటిచింతలగూడెం (జి)
- బర్లగూడెం (జెడ్)
- పాలెం (జెడ్)
- చిర్తపల్లి (జెడ్)
- వీరభద్రారం (జెడ్)
- రామవరం (జెడ్)
- బర్లగూడెం (జి)
- రామవరం (జి)
- అంకన్నగూడెం (జెడ్)
- చినగంగారం (జి)
- పూజారిగూడెం (జెడ్)
- మహితాపురం (జెడ్)
- మొర్రం వానిగూడెం (జి)
- ఇప్పగూడెం (జెడ్)
- పామునూరు
- అలుబాక (జెడ్)
- రాచపల్లి (జి)
- అలుబాక (జి)
- జెల్ల (జి)
- మల్లపురం (జి)
- ఇప్పాపురం (జి)
- దొలి (జి)
- నూగూరు (జెడ్)
- కలిపాక (జి)
- తడపల (జి)
- నూగూరు (జి)
- బోదపురం (జి)
- చలమల (జి)
- చిర్తపల్లి (జి)
గమనిక:నిర్జన గ్రామాలు 27 పరిగణనలోకి తీసుకొనబడలేదు
చూడదగ్గ ప్రదేశాలు
మార్చుఈ మండలంలోని కోయస్ అనే చిన్న గ్రామమైన మంగవాయిగూడెంలో ఒంటిమామిడి లొద్ది జలపాతం ఉంది.
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 17 Feb 2019. Retrieved 17 Feb 2019.
- ↑ 3.0 3.1 "ములుగు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ https://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/MULUGU.PDF
- ↑ Rao, K. V. Narayana (1972-01-01). Telangana: a study in the regional committees in India (in ఇంగ్లీష్). Minerva Associates.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-26. Retrieved 2019-02-21.