వెంకటాపురం (మోపిదేవి)

భారతదేశంలోని గ్రామం

వెంకటాపురం, మోపిదేవి, కృష్ణా జిల్లా, మోపిదేవి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 130., ఎస్.టి.డి.కోడ్ = 08671.

వెంకటాపురం (మోపిదేవి)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మోపిదేవి
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి తుమ్మా వెంకటలక్ష్మి
జనాభా (2011)
 - మొత్తం 1,347
 - పురుషులు 673
 - స్త్రీలు 674
 - గృహాల సంఖ్య 407
పిన్ కోడ్ 521130
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[1] సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

ఈ గ్రామానికి సమీపంలో చిరువోలులంక ఉత్తరం, మోపిదేవి, పెదకళ్ళేపల్లి, మోపిదేవిలంక, పిట్టలలంక గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలుసవరించు

అవనిగడ్డ, చల్లపల్లి, కోడూరు, ఘంటసాల

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

మోపిదేవి, చల్లపల్లి నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 66 కి.మీ

గ్రామంలోని విద్యాసౌకర్యాలుసవరించు

  1. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
  2. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామంలోని మౌలిక సదుపాయాలుసవరించు

  1. అంగనవాడీ కేంద్రం.
  2. ఉప పశువైద్యశాల.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

రాజనీటి చెరువు - ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, ఈ చెరువులో 2016,మే-16న, 1.6 లక్షల అంచనావ్యయంతో, పూడికతీత కార్యక్రమం ప్రారంభించారు. సారవంతమైన ఈ మట్టిని ఈ గ్రామ రైతులు, తమ ట్రాక్టర్లతో పొలాలకు తరలించుకొనిపోవుచున్నారు. ఈ విధంగా చేయుటవలన, తమ పొలాలకు ఎరువుల ఖర్చు తగ్గుటయేగాక, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరిగి, గ్రామంలో భూగర్భజలాలు అభివృద్ధి చెందగలవని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. [7]

గ్రామ పంచాయతీసవరించు

2013 లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలో శ్రీమతి తుమ్మా వెంకటలక్ష్మి సర్పంచిగా గెలుపొందారు. ఉపసర్పంచగా కొమ్ము మోషే ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

  1. శ్రీ అన్నపూర్ణా సమేత ఓంకారేశ్వర స్వామి వారి ఆలయం:- ఈ అలయంలో, 2014,అక్టోబరు-25, కార్తీకమాసం, విదియ, శనివారం ఉదయం, స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం లక్ష బిల్వపత్రాలతో శతసహస్ర నామాలతో ఘనంగా బిల్వార్చన నిర్వహించారు. [4]
  2. శ్రీ రామాలయం.
  3. శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం.
  4. శ్రీ గంగానమ్మ, శ్రీ బోర్లమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయం, వెంకటాపురం గ్రామ శివారు గ్రామమయిన చిర్లపాలెంలో ఉంది. ఈ ఆలయంలో, 2015,మే-31వ తేదీ ఆదివారంనాడు నిర్వహించిన అమ్మవారి వార్షిక సంబరాలు, అంబరాన్నంటినవి. సుదూరప్రాంతాలనుండి వచ్చిన భక్తులు, గ్రామస్థులు, కుటుంబసమేతంగా వచ్చి, సంబరాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చల్దినైవేద్యాలు సమర్పించారు. అమ్మవారలకు నూతన వస్త్రాలు, పసుపు, కుంకుమలు సమర్పించారు. జూన్-1వ తేదీ సోమవారంనాడు, వనమలమ్మ తల్లిని మేళతాళాలతో పంటపొలాలలోనికి తీసికొనివచ్చి, క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ రోజుతో అమ్మవారి వార్షిక ఉత్సవాలు పరిసమాప్తమైనవి. [5]
  5. గ్రామదేవతలు మద్దిరావమ్మ, మారెమ్మ, మావూళ్ళమ్మ ఆలయం:- గ్రామంలో ఈ గ్రామదేవతల వార్షిక జాతర మహోత్సవాలు, 2016,ఏప్రిల్-30 శనివారం, మారెమ్మ, మావూళ్ళమ్మ ఆలయం:- గ్రామంలో ఈ గ్రామదేవతల వార్షిక జాతర మహోత్సవాలు, 2016,ఏప్రిల్-30 శనివారంనాడు, మే-1 ఆదివారంనాడు వైభవంగా నిర్వహించెదరు. [6]

గ్రామంలోని ప్రధాన పంటలుసవరించు

గ్రామంలోని ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

ఈ గ్రామంలో శ్రీమతి చలసాని వెంకటరత్నమ్మ అను ఒక సేవాతత్పరురాలు ఉన్నారు. వీరు గ్రామంలోని ఉప పశువైద్యశాల భవన నిర్మాణానికి ఐదు సెంట్ల స్థలాన్ని వితరణగా అందించారు. గ్రామంలోని పురాతన శ్రీ ఓంకారేశ్వరస్వామి ఆలయం శిథిలమై కూలిపోవడంతో, దేవాలయ పునర్నిర్మాణానికి, దేవాదాయశాఖవారికి మ్యాచింగు గ్రాంటుగా రు. ఐదు లక్షల రూపాయలు వితరణగా అందించారు. దీనితో దేవాదాయశాఖవారు ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈమె మనుమడు శ్రీ చలసాని రవి, దేవాలయ ట్రస్టు బోర్డు ఛైర్మనుగా పనిచేసారు. ఈమె 88 సంవత్సరాల వయసులో 2014, ఆగస్టు-28న కాలధర్మం చెందినారు. [3]

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1361,ఇందులో పురుషుల సంఖ్య 667, స్త్రీల సంఖ్య 694, గ్రామంలో నివాస గృహాలు 374 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 145 హెక్టారులు.
జనాభా (2011) - మొత్తం 1,347 - పురుషుల సంఖ్య 673 - స్త్రీల సంఖ్య 674 - గృహాల సంఖ్య 407

మూలాలుసవరించు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Mopidevi/Venkatapuram". Archived from the original on 20 మే 2013. Retrieved 26 June 2016. External link in |title= (help)

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013,ఆగస్టు-3; 1వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఆగస్టు-29; 2వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,అక్టోబరు-26; 2వపేజీ. [5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,జూన్-2; 3వపేజీ. [6] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016,మే-1; 2వపేజీ. [7] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016,మే-16; 2వపేజీ.