వెల్లూర్ జిల్లా

తమిళనాడు లోని జిల్లా
(వెల్లూరు జిల్లా నుండి దారిమార్పు చెందింది)

వెల్లూర్ జిల్లా (తమిళం) తమిళనాడు రాష్ట్రం లోని జిల్లాలలో ఇది ఒకటి. జిల్లా పరిపాలనా కార్యాలయం వెల్లూర్, 2011 నాటికి, జిల్లాలో ప్రతి 1,000 మంది పురుషులకు 1,007 స్త్రీల లింగ నిష్పత్తితో 16,14,242 జనాభా ఉంది. 2017లో మానవాభివృద్ధి సూచిక ప్రకారం తమిళనాడులోని జిల్లాల జాబితాలో వెల్లూర్ జిల్లా పదకొండవ స్థానంలో ఉంది,[2][3] భారత ప్రభుత్వం ఇటీవల వేలూర్ నగరాన్ని తన ప్రతిష్టాత్మక స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో 26 ఇతర నగరాలతో పాటు చేర్చింది.[4]

Vellore district
district
Dry riverbed of Palar River at Arcot
Dry riverbed of Palar River at Arcot
Nickname: 
Fort city
Location in Tamil Nadu, India
Location in Tamil Nadu, India
Country India
రాష్ట్రంతమిళనాడు
జిల్లాVellore
Established1996
ప్రధాన కార్యాలయంVellore
BoroughsVellore, Katpadi, Vaniyambadi, Ambur, Arakkonam, Arcot, Gudiyatham, Tirupattur and Walajah
Government
 • Collector & District MagistrateR Nanthagopal IAS
విస్తీర్ణం
 • district6,077 కి.మీ2 (2,346 చ. మై)
జనాభా
 (2011)[1]
 • district39,28,106
 • జనసాంద్రత650/కి.మీ2 (1,700/చ. మై.)
 • Metro
13,07,998
భాషలు
 • అధికారTamil
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
631xxx,632xxx,635601 to 635958
టెలిఫోన్ కోడ్0416
Vehicle registrationTN-23,TN-73,TN-83
Coastline0 కిలోమీటర్లు (0 మై.)
Largest cityVellore
లింగ నిష్పత్తిM-50.06%/F-49.94% /
అక్షరాస్యత79.65%
Legislature typeelected
Legislature Strength12
Lok Sabha constituencyVellore, Arakkonam and Thiruvannamalai
Precipitation917 మిల్లీమీటర్లు (36.1 అం.)
Avg. summer temperature39.5 °C (103.1 °F)
Avg. winter temperature15.6 °C (60.1 °F)

చరిత్ర

మార్చు

వెల్లూర్ జిల్లాకు చెందిన పురుషులు బ్రిటిష్ ఇండియా ఆర్మీలో పోరాడి ప్రపంచ యుద్ధాల్లో తమ ప్రాణాలను అర్పించారు. ఇది 1920లో వెలిసిన వెల్లూర్‌లోని లాంగ్ బజార్‌లోని క్లాక్ టవర్‌లో నమోదు చేయబడింది, ఇక్కడ ఒక శాసనం "వెల్లూర్ - ఈ గ్రామం నుండి 277 మంది పురుషులు 1914-18లో జరిగిన మహా యుద్ధానికి వెళ్లారు, వారిలో 14 మంది తమ ప్రాణాలను విడిచిపెట్టారు".[5] ఉత్తర ఆర్కాట్ అంబేద్కర్ జిల్లా 1996లో వెల్లూర్ జిల్లాగా మార్చబడింది. 2019 ఆగస్టు 15న జిల్లాను వేలూర్, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాలుగా విభజించారు.[6][7]

జనాభా గణాంకాలు

మార్చు
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±% p.a.
19019,67,845—    
191110,57,841+0.89%
192110,88,264+0.28%
193112,28,535+1.22%
194114,40,228+1.60%
195116,76,438+1.53%
196118,17,967+0.81%
197122,31,448+2.07%
198126,28,526+1.65%
199130,26,432+1.42%
200134,77,317+1.40%
201139,36,331+1.25%
2011 (త్రివిభజన తర్వాత)16,14,242−100.00%
ఆధారం:[8]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, వెల్లూర్ జిల్లాలో 16,14,242 జనాభా ఉంది, ప్రతి 1,000 మంది పురుషులకు 1,007 స్త్రీల లింగ నిష్పత్తితో ఉంది.ఇది జాతీయ సగటు 929 కంటే చాలా ఎక్కువ.

మొత్తం జనాభాలో 432,550 మంది ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు, వీరిలో 2,22,460 మంది పురుషులు, 2,10,090 మంది స్త్రీలు ఉన్నారు. జనాభాలో షెడ్యూల్డ్ కులాలు, వారు 21.85% ఉండగా, షెడ్యూల్డ్ తెగలు వారు 1.85% ఉన్నారు. జిల్లా సగటు అక్షరాస్యత 70.47% ఉంది. ఇది జాతీయ సగటు 72.99% ఎక్కువ ఉంది.

జిల్లాలో 9,29,281 గృహాలు ఉన్నాయి. మొత్తం జనాభాలో 1,53,211 సాగుదారులు, 2,54,999 ప్రధాన వ్యవసాయ కార్మికులు, గృహ పరిశ్రమలలో 1,06,906, మంది, 8,45,069 మంది ఇతర కార్మికులు, 3,29,145 మంది ఉపాంత కార్మికులు, 2,16,956 ఉపాంత వ్యవసాయ కార్మికులు, 29,509 మంది ఉపాంత కార్యకర్తలు ఉన్నారు.

పర్యాటకరంగం

మార్చు

జిల్లా ప్రధానకేంద్రమైన వేలూర్ నగరంలో చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న వాటిలో వేలూర్ కోట ఒకటి. బ్రిటిష్ ప్రభుత్వకాలంలో వేలూరుకోట అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. బ్రిటిష్ ప్రభుత్వపాలనా కాలంలో టిప్పు సుల్తాన్ కుటుంబం, శ్రీలంక చివరి రాజైన విక్రమరాజ సింహలను ఈ కోటలో రాజకీయఖైదీలుగా బంధించారు. ఈ కోటలో ఒక చర్చి, ఒక మసీదు, ఒక హిందూ ఆలయం ఉన్నాయి. 1806లో ఈ కోట నుండి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలైంది.దానిని వెల్లూరు తిరుగుబాటు అంటారు విజయనగర చక్రవర్తి శ్రీరంగరాజా సకుటుంబంగా హత్యచేయబడడానికి ఈ కోట సాక్ష్యంగా నిలబడింది.[9]

మలైకొడి అనే ఊరిలో పచ్చని గిరుల వరుసల పాదాల వద్ద శ్రీపురం అనే మహాలక్ష్మీ స్వర్ణ దేవాలయం ఉంది. ఈ ఆలయం వేలూర్ నగరానికి దక్షిణసరిహద్దులో తిరుమలైకొడి అనే ఊరిలో ఉంది. ఈ ఆలయం కళాత్మకంగా తయారు చేయబడిన బంగారు రేకుల తొడుగుతో చేయబడింది.[10]

వేలూరి కోటలో జలకంఠేశ్వరాలయం (వెల్లూరు) ఉంది. ఈ ఆలయం ఆకాలంనాటి శిల్పుల ప్రతిభకు అద్దంపట్టే శిల్పాలు అనేకం ఉన్నాయి. ఈ జిల్లాలో రత్నగిరి మురుగన్ ఆలయం , వాలాజాబాద్ ధన్వంతరి ఆలయం ఉన్నాయి. డి.పి పాళయంలో విజయ ఆంజనేయస్వామి ఆలయం, పొన్నై నవగ్రహ కోట్టై ఆలయం , ఉన్నాయి. వేలూరు కోటలోపల అసంప్షన్ కేథడ్రల్, 150 సంవత్సరాల పురాతనమైన సెయింట్ జాన్స్ చర్చి ఉన్నాయి. నగరానికి కేంద్రస్థానంలో పెద్ద మసీదు, భారతదేశంలోనే అతిపెద్ద అరబిక్ కాలేజి ఉన్నాయి. వాణియంబాడి - తిరుపత్తూరు రహదారి మార్గంలో పర్యాటక కేంద్రం వేసవి విడిది ఏలగిరి (హిల్ స్టేషన్) ఉంది.[11] ఏలగిరి కొండలు సముద్రమట్టానికి 1,410.6 మీటర్ల ఎత్తులో 30 2 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. మిగిలిన వేసవి విడుదలలాగా కలుషితం కాకుండా, ఏలగిరి సహజసౌందర్యం చెదరకుండా ఉండడం విశేషం. వర్షాకాలంలో మాత్రమే నీరు ఉండే జలగంపారి జలపాతం ఏలగిరిలోనే ఉంది. వేలూరుకు 25 కిలోమీటర్ల దూరంలో జవ్వాదు కొండల పాదాల వద్ద అమిర్తి నదీ సమీపంలో అమిర్తి అరణ్యం, జూలాజికల్ ఉద్యానవనం ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు

మార్చు

రెండు జాతీయ రహదారులు - ఎన్ఎచ్ 4 (ముంబై - చెన్నై), ఎన్ఎచ్ 46 (కృష్ణగిరి - రాణిపేట్) - 2010లో జాతీయ రహదారులను పునర్నిర్మించడానికి ముందు జిల్లాలోని కొన్ని ప్రాంతాలను దేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానించేవి. గతంలో ఉన్న ఎన్ఎచ్ 4 ఎన్ఎచ్ ఎన్ఎచ్ 46 ఇప్పుడు ఎన్ఎచ్ 48గా పేరు మార్చబడ్డాయి. ఈ రహదారులు ముఖ్యంగా బెంగళూరు కోయంబత్తూరు నుండి చెన్నైకి వెళ్లే వాహనాలకు ముఖ్యమైన అనుసంధాన రహదారులు. ఈ జాతీయ రహహారులు జిల్లాలో 226 కిమీ (140 మైళ్ళు) వరకు నడుస్తాయి. ప్రస్తుతం ఉన్న ఇతర ముఖ్యమైన రహదారి మార్గాలు 629 కిమీ (391 మైళ్ళు) రాష్ట్ర రహదారులు, 1,947 కిమీ (1,210 మైళ్ళు) జిల్లా రహదారులు. వెల్లూరు జిల్లాలోని రైల్వే నెట్‌వర్క్ దక్షిణ రైల్వే పరిధిలోకి వస్తుంది, వెల్లూరు కాట్పాడి జంక్షన్, వెల్లూరు కంటోన్మెంట్ జంక్షన్, గుడియాతం ప్రధాన రైల్వే జంక్షన్‌లుగా ఏర్పడతాయి. ప్రయాణీకుల కోసం అనేక చిన్న రైల్వే స్టేషన్లు, లోకల్ రైలు స్టాప్‌లు ఉన్నాయి.

చిత్ర మాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. "2011 Census of India" (Excel). Indian government. 16 April 2011.
  2. "State Planning Commission". www.spc.tn.gov.in. Archived from the original on 2019-12-01. Retrieved 2019-11-20.
  3. TAMIL NADU HUMAN DEVELOPMENT REPORT 2017 -Status of Human Development TAMIL NADU HUMAN DEVELOPMENT REPORT 2017 Archived 2021-08-19 at the Wayback Machine
  4. Staff Reporter (2016-09-20). "Varanasi, Madurai on latest list of Smart Cities". The Hindu. ISSN 0971-751X. Retrieved 2016-09-29.
  5. "Historical Importance of Vellore District". Vellore – The Fort City. Government of Tamil Nadu. Archived from the original on 20 ఆగస్టు 2010. Retrieved 19 August 2015.
  6. Census of India, 1991: District census handbook. A. Village & town directory ; B. Village & townwise primary census abstract : Chengalpattu M.G.R. Controller of Publications. 1994.
  7. http://lsi.gov.in:8081/jspui/bitstream/123456789/6734/1/52965_1991_NOR.pdf [bare URL PDF]
  8. Decadal Variation In Population Since 1901
  9. "Vellore sepoys rebelled". The Hindu. 6 August 2006. Archived from the original on 2006-12-02. Retrieved 2013-07-07.
  10. "Golden Temple at Vellore". The Hindu. August 2007. Archived from the original on 2007-11-03. Retrieved 2014-03-13.
  11. "Miles to go for Yelagiri Hills as a tourist spot". The Hindu. May 25, 2008. Archived from the original on 2008-05-27. Retrieved 2009-04-07.

వెలుపలి లింకులు

మార్చు