ఏలగిరి, తమిళనాడులో 2019 లో ఏర్పాటు చేసిన తిరుపత్తూరు జిల్లా లోని కొండ విడిది (హిల్ స్టేషన్) స్థలం. వాణియంబాడి- తిరుపత్తూరు రోడ్డుకు దగ్గరలో ఉంది. ఇది 30 చ. కిలో మీటర్ల విస్తీర్ణంతో సముద్ర మట్టం నుండి 1110.6 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ కొండలు పచ్చని లోయలు, పూల తోటలు, పండ్ల తోటలతో నిండి ఉంటాయి. బెంగుళూరు నుండి సొంత వాహనములో ప్రయాణము చేయాలనుకుంటే ఉదయం 4 గంటలకి బయలుదేరునట్లు ప్లాన్ చేసుకుంటే ఉదయం 9 గంటలకల్లా క్రిష్ణగిరి మీదుగా ఇక్కడికి చేరుకోవచ్చును. ఇక్కడ ఎన్నో ఆహ్లాదపరిచే రిసార్ట్లు, బోటింగ్, షూటింగ్ లాంటి వినోద క్రీడలు ఉన్నాయి. జలపాతాలను కూడా సందర్శించి సాయంత్రం 4 గంటలకు తిరుగు ప్రయాణం కావచ్చు. తిరుపతి నుండి బెంగుళూరు రైలు మార్గాన ప్రయాణించువారు ఈ ఏలగిరి కొండలను దూరం నుంచి గమనించవచ్చు.

ఏలగిరి
ఏలగిరి కొండలు
కొండ విడిది ప్రాంతం
ఏలగిరిలోని ఒక చెరువు
ఏలగిరిలోని ఒక చెరువు
Location in TamilNadu, India
Location in TamilNadu, India
ఏలగిరి
తమిళనాడు, భారతదేశంలోని ప్రాంతం
Coordinates: 12°34′41″N 78°38′27″E / 12.578104°N 78.640737°E / 12.578104; 78.640737
దేశం భారతదేశం
రాష్ట్రంతమిళనాడు
జిల్లాతిరుపత్తూరు
Elevation
1,110.6 మీ (3,643.7 అ.)
Demonymఏలగిరివాసులు
భాషలు
 • ఆధికారిక భాషతమిళం
Time zoneUTC+05:30 (భారత ప్రామాణిక కాలమానం)

చరిత్ర

మార్చు

ఈ ఏలగిరి లేదా ఎలాగిరి అనేది వాణీయంబాడి, జోలర్పెట్టాయ్ అనే రెండు పట్టణాల మధ్య ఉంది. ఈ కొండ విడిది బ్రిటిషు వారి కాలం నుండి ప్రసిద్ధి.

ఈ ఏలగిరి మొత్తము ఒకప్పుడు ఏలగిరి జమీందారుల గుప్పెట్లో ఉండేది. ౧౯౫౦ (1950) వ సంవత్సరంలో ప్రభుత్వం తన ఆధీనం లోకి తీసుకుంది. రెడ్డియూర్ అనే గ్రామంలో ఇప్పటికీ జమీందారుల నివాసాలు ఉన్నాయి. [1]

డాన్ బాస్కోకు చెందిన ఫ్రాన్సిస్ గుజౌ, కొండ గిరిజనుల అభ్యున్నతి కోసం పనిచేశారు. ఏలగిరి ప్రజలకు విద్యకి వారి అభ్యున్నతికి ఆయనే ప్రధాన కారణం.

స్థలం, అవలోకనం

మార్చు

ఏలగిరి కొండవిడిది  తమిళనాడులోని ఇతర హిల్ స్టేషన్లైన ఊటీ, కొడైకెనాల్ అంతలా అభివృద్ధి చెందలేదు. అయితే, పారాగ్లైడింగ్, రాక్ క్లైంబింగ్ వంటి సాహస క్రీడలను ప్రోత్సహించడం ద్వారా జిల్లా యంత్రాంగం, ఏలగిరి కొండలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోంది. [2]

భారతదేశంలో పర్వతారోహకకులకు ఏలగిరి ప్రసిద్ధి చెందినదని చెప్పవచ్చును. ఈ కొండ విడిది సముద్ర మట్టానికి సుమారుగా 1410.6 మీటర్ల ఎత్తులో ఉంది. ఏలగిరిలో ౧౪ (14) చిన్న గ్రామాలు, ఇంకా వేరు వేరు కొండలపై అనేక దేవాలయాలు ఉన్నాయి. ఏలగిరిలో ఎత్తైన కొండ స్వామిమలై. ఇది సుమారుగా 4,338 అడుగుల ఎత్తు ఉంది. కొండలు ఎక్కే సాహాసికులకి స్వామిమల అద్బుత వీక్షణ కూడా కనువిందు చేస్తుంది. కొండ దట్టమైన అభయారణ్యాలతో, అనేక ట్రెక్కింగ్ అనుభవాలను అందిస్తుంది. మంగళం అనే చిన్న గ్రామం ఈ కొండ పాదం వద్ద ఉంది. జావాది హిల్స్, పలామతి హిల్స్ వంటి చిన్న కొండలపై కూడా ట్రెక్కింగ్ అవకాశాలు ఉన్నాయి.

ఏలగిరి కొండలు వందలాది పాములకు ఆవాసం.

వాతావరణం

మార్చు

వర్షాకాలంలో ఏలగిరి వాతావరణం చల్లగా ఉంటుంది. రోజువారీ వాతావరణం సాధారణంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. శీతాకాలంలో, వేసవి కంటే చాలా తక్కువ వర్షపాతం ఉంటుంది. ఇది కొంచెం వేడి వాతావరణం కలిగి ఉంటుందని చెప్పవచ్చు.

శీతోష్ణస్థితి డేటా - యెలగిరి
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 25.2
(77.4)
28.0
(82.4)
30.2
(86.4)
31.1
(88.0)
32.6
(90.7)
30.8
(87.4)
28.4
(83.1)
28.4
(83.1)
28.3
(82.9)
27.0
(80.6)
25.5
(77.9)
24.4
(75.9)
28.3
(83.0)
సగటు అల్ప °C (°F) 14.0
(57.2)
15.0
(59.0)
17.1
(62.8)
19.9
(67.8)
20.6
(69.1)
20.9
(69.6)
19.7
(67.5)
19.5
(67.1)
19.0
(66.2)
18.4
(65.1)
16.4
(61.5)
14.6
(58.3)
17.9
(64.3)
సగటు అవపాతం mm (inches) 8
(0.3)
7
(0.3)
11
(0.4)
38
(1.5)
79
(3.1)
61
(2.4)
106
(4.2)
132
(5.2)
150
(5.9)
193
(7.6)
104
(4.1)
66
(2.6)
955
(37.6)
Source: [3]

ప్రజలు

మార్చు

ఇక్కడ మానవ ఆవాసాలు 200 నుండి 400 సంవత్సరాల మునుపు ఆరంభం అయ్యింది. ఇక్కడి వారు కొండ ప్రజలు వెల్లాల గౌండ్లు లేదా 'మలై యాలీ', అంటే పర్వతాలలో నివసించే ప్రజలను సూచిస్తుంది. ఇక్కడి ప్రజలను  "కరలార్" అని కూడా పిలుస్తారు, అంటే 'మేఘాలను శాసించేవారు'. మలై యాలీ ప్రజలు మైదానాల నుండి వచ్చామని చెప్పుకుంటారు. వారు కాంచీపురం జిల్లాకు చెందినవారు. పదిహేడవ శతాబ్దంలో టిప్పు సుల్తాన్ సైన్యాన్ని విడిచి పెట్టి వచ్చిన వెల్లాల గౌండర్ (రైతుల బృందం) లు యలగిరి పీఠభూమిని వారి నివాసంగా మార్చుకున్నారు. ఇరులార్ అనే మరో స్థానిక గిరిజన జాతి కూడా ఇక్కడ ఉంది.

ఇక్కడి ప్రజలలో అధికులు హిందువులు. వారు సాధారణంగా శివుడిని 'నాచియప్పన్' పేరిట, పార్వతిని 'నాచియమ్మ' పేరిట పూజిస్తారు. 1960 లలో సుబ్రమణ్యస్వామి ఆలయం నిర్మించారు. క్రైస్తవ మిషనరీలు ఇటీవల మరిన్ని చర్చిలు స్థాపించారు. ఈ ప్రాంతంలో మసీదులు కూడా ఉన్నాయి.

విద్య

మార్చు

విద్యాసంస్థలు : ఏలగిరి చుట్టుపక్కల ఉన్న వివిధ చిన్న చిన్న గ్రామాలలో ప్రభుత్వ పాఠశాల, సెయింట్ చార్లెస్ పాఠశాల ఉన్నాయి. పీస్ గార్డెన్ మెట్రిక్యులేషన్ స్కూల్, ఎబెనెజర్ మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ స్కూల్ (రెసిడెన్షియల్), సామరిటన్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే మూడు రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా ఉన్నాయి. డాన్ బాస్కో ఇటీవల స్థానిక సమాజ ప్రయోజనాల కోసం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీని ప్రారంభించింది.

ఫ్రాన్సిస్ గుజౌ అబ్బాయిల కోసం ఒక బోర్డింగ్ ను ప్రారంభించాడు. 170 మంది విద్యార్థులతో డాన్ బాస్కో బోర్డింగ్ హౌస్ ను స్థాపించాడు. ఇది ఫ్రాన్సిస్ యొక్క మొదటి సంస్థ. కొండలపై గుజౌ. తన చుట్టూ ఉన్న పిల్లలను సేకరించి వారికి మంచి విద్యను అందించాలని ఆయన భావించారు. 1వ తరగతి నుండి 12 వరకు ఉన్న బాలురు ఇక్కడే ఉండి సెయింట్ చార్లెస్ స్కూల్లో పాఠశాలకు హాజరవుతున్నారు.

BICS ఇన్ఫోటెక్, 350 మంది విద్యార్థులతో శిక్షణ అర్హులతో ఉంది. ఈ పని నిరుపేద యువతకు ఉపాధితో ఉన్నత విద్యను అందించాలనే జియుజౌ కలని నిజం చేస్తుంది. మిస్టర్ మారియా లియో ఫ్రాన్సిస్, Fr. మరియా అరోకియా రాజ్, Fr. ఇదే విధమైన ఆలోచనతో ఉన్న తడ్డియస్ Fr. గుజౌ తరువాత BICS యొక్క ఈ గొప్ప కల నిజమైంది.2013 లో, BICS కి సాధారణ కళాశాల నడుపుటకు అనుమతి లభించింది, డాన్ బాస్కో కళాశాల కొండలపై మంచి విద్యను అందిస్తోందని చెప్పవచ్చు.

2013 లో, BICS కి సాధారణ కళాశాల నడుపుటకు అనుమతి లభించింది, డాన్ బాస్కో కళాశాల కొండలపై మంచి విద్యను అందిస్తోందని చెప్పవచ్చు.

ఏలగిరి వేసవి ఉత్సవాలు

మార్చు

మే చివరలో జరుపుకునే ప్రసిద్ధ యలగిరి వేసవి ఉత్సవాన్ని తమిళనాడు పర్యాటక అభివృద్ధి బోర్డు నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం వివిధ విభాగాల స్టాల్స్, ఫ్లవర్స్ షో, బోట్ హౌస్ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ రకాల కుక్కల జాతులతో డాగ్ షో నిర్వహిస్తారు. ఈ వార్షిక ఉత్సవంలో రాష్ట్రం, దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు పాల్గొంటారు.

ఆసక్తి కలిగించే ప్రదేశాలు

మార్చు
 
ఏలగిరి వద్ద సాహసికులు కొండలు పైకి ఎక్కడం

ప్రకృతి వనం: 2008లో ఒక పార్కు స్థాపించారు. ఇందులో అక్వేరియం, గులాబీ తోట. ఓ కృత్రిమ జలపాతం, సంగీత ఫౌంటెన్‌లు ఉన్నాయి.

పుంగనూర్ లేక్ పార్క్: ఇది ఏలగిరి కొండలలో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రదేశం. ఇది ఓ పార్కుపక్కనే ఉండే 25 అడుగుల లోతు ఉన్న ఒక కృత్రిమ సరస్సు.

జలగంపరై జలపాతాలు: తిరుపత్తూరు నుండి 14 కి.మీ. దూరంలో కొండకు అవతలి వైపు కొద్ది దూరంలో జలగంపరై జలపాతం ఉంది. అత్తారు నది యలగిరి కొండల గుండా చిన్న శబ్ధాలు చేస్తూ ప్రవహిస్తూ, ఒకచోట కిందికి దూకి, అత్యంత ఆకర్షణీయమైన జలపాతాన్ని ఏర్పరుస్తుంది. ఏలగిరి నుండి దిగువకు 5 కి.మీ. - ఒక గంట నడక దూరంలో - ఉంటుంది. ఏలగిరి నుండి జలపాతం వరకు నేరుగా మార్గం ఉన్నప్పటికీ, ఇది ఎక్కువగా మూసివేసి ఉంటుంది. కాబట్టి కొండ దిగువకి వెళ్ళి , మైదానాల గుండా, ఆపై మరొక వైపు కొండ ఎక్కాలి. ఇది ఒక గంట ప్రయాణం అని చెప్పవచ్చు.

స్వామిమల కొండలు: కొండలు కింద దృఢం గాను, ఎత్తైన శిఖరాలతో కేకు ఆకారంలో ఉంటాయి. స్వామి మల కొండల వద్ద ట్రెక్కింగ్ ఒక ఆకర్షణ. ఈ ట్రెక్‌లో శిఖరాగ్రానికి చేరుకున్నాక, అక్కడి నుండి లోయ మొత్తం కనిపిస్తుంది.

టెలిస్కోప్ అబ్జర్వేటరీ: యలగిరి కొండకు సమీపంలో ఉన్న టెలిస్కోప్ అబ్జర్వేటరీ కూడా సందర్శకులను ఆకర్షిస్తుంది. దాన్ని మూసివేసారు.

శ్రీ సత్య ఆశ్రమం:[4] పౌర్ణమి, అమావాస్య రోజులలో మాత్రమే తెరుస్తారు.


చిత్ర మాలిక

మార్చు


మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-03. Retrieved 2020-04-25.
  2. "Yelagiri hills, for paragliding". The Hindu. 20 August 2008. Retrieved 19 January 2019.
  3. "Climate: Yelagiri". climate-data.org.
  4. "Yelagiri Mahashakti".
"https://te.wikipedia.org/w/index.php?title=ఏలగిరి&oldid=3866104" నుండి వెలికితీశారు