వేంకటేశ్వరస్వామి దేవాలయం (ఇంగ్లాండు)
వేంకటేశ్వరస్వామి దేవాలయం, ఇంగ్లాండ్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్‌లోని టివిడేల్‌లో ఉన్న హిందూ దేవాలయం. బర్మింగ్‌హామ్ నగరానికి వాయువ్యంగా టిప్టన్, ఓల్డ్‌బరీ శివారు ప్రాంతాల మధ్య ఉన్న ఈ దేవాలయం ఐరోపాలోని అతిపెద్ద హిందూ దేవాలయాలలో ఒకటి. వైష్ణవ సంప్రదాయంలో హిందూ దేవుడు విష్ణువు రూపానికి అంకితం చేయబడిన ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి వేంకటేశ్వర దేవాలయం స్ఫూర్తితో ఏర్పాటుచేయబడింది. 2006, ఆగస్టులో ఇది తెరవబడింది.[1]
నిర్మాణం
మార్చు1980లో, ఒక మందిరంలో అలంకరించబడిన చెక్క మండపంలో వేంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్టించబడింది. నెలవారీ పూజలు నిర్వహించబడ్డాయి. 1984 అక్టోబరులో నిధుల సేకరణకు, దేవాలయ నిర్మాణానికి అనువైన భూమిని పరిశీలించడానికి పదిహేను మంది సభ్యుల నిర్వహణ కమిటీని ఎన్నుకోబడింది. 1984 నవంబరులో శ్రీ వెంకటేశ్వర బాలాజీ దేవాలయం పేరుతో ఒక కొత్త స్వచ్ఛంద సంస్థ స్థాపించబడింది. 1988లో డాక్టర్ నారాయణరావు నేతృత్వంలో మొదటి బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు ఎన్నికయ్యారు.
1995లో, బ్లాక్ కంట్రీలో నిరుపయోగంగా ఉన్న భూమిని కొనుగోలు చేశారు. 1998లో ప్రధాన దేవాలయానికి శంకుస్థాపన జరిగింది. 1999 నుండి వివిధ దేవతల ప్రతిష్ఠాపన జరిగింది. 2000లో ప్రధాన దేవాలయ హాలులో తాత్కాలిక మందిరం నిర్మించబడింది. 2000లో మురుగ (సుబ్రమణ్య స్వామి) విగ్రహం ప్రతిష్ఠించబడింది, ఆ తర్వాత 2003లో నవగ్రహాలయం నిర్మించబడింది. 2006లో దేవాలయం పూర్తిస్థాయిలో ప్రారంభమయింది. 2010లో శివుని కుంబాభిషేకం జరిగింది. 2011లో బాబా మందిరంలో బాబాను ప్రతిష్టించారు.[2]
ఇతర దేవతలు
మార్చుప్రధాన దేవాలయ సముదాయంలో వేంకటేశ్వరుడి భార్య పద్మావతి (అలమేలు) విగ్రహాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ హనుమంతుడు, శివుడు, కార్తికేయ, గణేష్, అయ్యప్ప, నవగ్రహాల విగ్రహాలు కూడా ఉన్నాయి.[3]
సేవలు
మార్చుదేవాలయం ఆధ్వర్యంలో బాలాజీ స్కూల్ ఫర్ కల్చర్ & ఎడ్యుకేషన్ అనే సంస్థ నిర్వహించబడుతోంది. ఈ సంస్థ ద్వారా పిల్లలకు ఆధ్యాత్మిక, సాంస్కృతికలను పరిచయం చేస్తారు. వేదాలు (హిందూ గ్రంథాలు), సంగీతం మొదలైన వాటిపై శిక్షణ తరగతులు కూడా ఉంటాయి. దేవాలయంలో పెద్ద కమ్యూనిటీ హాల్ కూడా ఉంది.[4] గేట్‌హౌస్, గాంధీ శాంతి కేంద్రం ఉన్నాయి. అన్నదాన సేవలను నిర్వహిస్తుంది, విరాళాల ద్వారా సందర్శకులకు ఉచిత భోజనాన్ని అందిస్తుంది.
మూలాలు
మార్చు- ↑ "Tirupati-style temple opened near Birmingham". Retrieved 2022-05-14.
- ↑ "Shri Venkateswara (Balaji) Temple of UK". www.venkateswara.org.uk. Archived from the original on 2022-05-14. Retrieved 2022-05-14.
- ↑ "Temple Plans Expansion". Archived from the original on 2020-09-27. Retrieved 2022-05-14.
- ↑ "Temple Plans Expansion". Archived from the original on 2020-09-27. Retrieved 2022-05-14.