వేట (సినిమా)

1986 సినిమా

వేట 1986 లో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో[1] విడుదలైన చిత్రం. ఇందులో చిరంజీవి, జయప్రద, సుమలత ముఖ్య పాత్రలు పోషించారు.[2] చిరంజీవి కథానాయకుడిగా విజయవంతమైన ఖైదీ అనే సినిమాను నిర్మించిన సంయుక్త మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమాకు 1844 లో అలెగ్జాండ్రి డ్యూమాస్ రచించిన ద కౌంట్ ఆఫ్ మాంటే క్రిస్టో (The count of Monte Cristo) అనే నవల ఆధారం. ఈ చిత్రానికి రచన పరుచూరి బ్రదర్స్. సంగీతం కె. చక్రవర్తి. వి. ఎస్. ఆర్ స్వామి ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించగా వెల్లై స్వామి ఎడిటింగ్ చూసుకున్నాడు.

వేట
Veta film poster.jpg
దర్శకత్వంఎ. కోదండరామిరెడ్డి
కథా రచయితపరుచూరి బ్రదర్స్
నిర్మాతధనంజయ రెడ్డి
తారాగణంచిరంజీవి
జయప్రద
ఛాయాగ్రహణంవి. ఎస్. ఆర్. స్వామి
కూర్పువెల్లైస్వామి
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
సంయుక్త మూవీస్
విడుదల తేదీ
1986 మే 28 (1986-05-28)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథసవరించు

1930 వ దశకంలో ప్రతాప్ ఒక ఓడలో పని చేస్తుంటాడు. అతను ఉన్నత వర్గానికి చెందిన సరోజతో ప్రేమలో పడతాడు. అతను పనిచేసే ఓడలో చౌడప్ప అనేవ్యక్తి కెప్టెన్ కావాలనే దురుద్దేశంతో ఓడ కెప్టెన్ ను విషాహారం ఇచ్చి చంపేస్తాడు. ఓడ కెప్టెన్ ప్రతాప్ ని పిలిచి అతన్ని కెప్టెన్ గా ఉండమని చెప్పి మరణిస్తాడు. జరిగిన విషయం తెలుసుకున్న ప్రతాప్ చౌడప్పను, అతనికి సహకరించిన వ్యక్తిని చట్టానికి అప్పగిస్తాడు. కానీ తాను పెళ్ళిచేసుకోబోయే సరోజను ప్రేమించాడనే కక్షతో జయరాం అనే జమీందారు కెప్టెన్ హత్యను ప్రతాప్ మీదకు తోసి అతన్ని అండమాన్ జైలుకు పంపించి వేస్తాడు. ప్రతాప్ కి ఆ జైల్లో తనలాగే శిక్షననుభవిస్తున్న మహేంద్రభూపతితో పరిచయం ఏర్పడుతుంది. ఆయన కూడా జయరాం చేతిలో మోసపోయి ఉంటాడు. మహేంద్రభూపతి చనిపోతూ ప్రతాప్ కు ఒక దట్టమైన అడవిలో తాను దాచిన సిరిసంపదలుండే చోటు చెప్పి మరణిస్తాడు. భూపతి స్థానంలో ప్రతాప్ మరణించిన వాడిగా ఒక గోనెసంచిలో చేరి ఆ జైలు నుంచి తప్పించుకుంటాడు.

తారాగణంసవరించు

మూలాలుసవరించు

  1. Cavallaro, Dani (2010-07-08). Anime and the Art of Adaptation: Eight Famous Works from Page to Screen (in ఇంగ్లీష్). McFarland. ISBN 9780786462032.
  2. "వేట 1986 ఫోటోలు | Veta (Old) Tollywood Movie Photos, Pictures, Wallpapers - Filmibeat Telugu". telugu.filmibeat.com. Retrieved 2018-01-22.[permanent dead link]
  3. "Veta(1986), Telugu Movie Songs - Listen Online - CineRadham.com". www.cineradham.com. Retrieved 2018-01-22.[permanent dead link]

ఇతర లింకులుసవరించు