వేదిక:విజ్ఞానశాస్త్రము/2012 08వ వారం
విద్యుత్తు లేదా విద్యుచ్ఛక్తి (ఆంగ్లం Electricity) అనేది ఎలక్ట్రాన్ ల ప్రవాహం, మరో విధంగా చెప్పాలంటే ఎలక్ట్రాన్‌ల కదలిక. దీనిని ఆంపియర్ అనే యూనిట్స్‌లలో కొలుస్తారు. ఇది ఒక కులోంబ్ చార్జ్ పర్ సెకను.
ఉత్పత్తి
మార్చువిద్యుచ్ఛక్తి సాధారణంగా విద్యుత్-యాంత్రిక జనరేటర్లు ద్వారా తయారుచేస్తారు. ఇవి నీటి ఆవిరి, గాలి, ప్రవహించే నీరు మొదలైన వాటి శక్తి మూలంగా పనిచేస్తాయి. బొగ్గు, సహజ వాయువు మొదలైన ఇంధన వనరులు ప్రకృతి సిద్ధంగా లభిస్తాయి. అణు విచ్ఛేదన ద్వారా వేడిని తద్వారా విద్యుచ్ఛక్తిని రియాక్టర్లులో తయారుచేస్తున్నారు. అతి వేగంగా వీచే గాలిని ఉపయోగించి గాలి మర ద్వారా విద్యుత్తు తయారుచేయవచ్చును. వీటన్నింటికి ముఖ్యమైన పరికరం ట్రాన్స్ ఫార్మర్.
సూర్య వికిరణాన్ని ఫోటోవోల్టాయిక్ ఘటాలను ఉపయోగించి సౌర విద్యుత్తుగా ఉత్పత్తి చేస్తున్నారు.
- విద్యుత్తుతో మన ఇంట్లో ఎన్నో గృహోపకరణాలు పనిచేస్తున్నాయి. వానిలో విద్యుద్దీపాలు, పంఖాలు, హీటర్లు, రిఫ్రిజిరేటర్లు మొదలైనవి. వీనిలో మొట్టమొదటగా మానవులకు ఉపయోగంలోకి వచ్చినది 1870లో కనుగొన్న విద్యుద్దీపాలు. ఇవి నూనె దీపాలను, వాటి వల్ల కలిగే ప్రమాదాలను తొలగించాయి.
- విద్యుత్తు నుండి జనించిన వేడిని వంటకోసం, నీటిని మరియు గాలిని వేడిచేయడం కోసం, అనేక ఇతర రకాలుగా ఉపయోగించుకుంటున్నాము. కొన్ని సమయాలలో గాలిని చల్లగా చేయడానికి దీనిని వేసవికాలంలో వాడుకుంటున్నాము.
- విద్యుత్తు టెలిగ్రాఫ్ వంటి కొన్ని సమాచార సాధనాలలో ఉపయోగిస్తున్నారు.
- విద్యుదయస్కాంత సూత్రాల్ని ఉపయోగించి విద్యుత్ మోటారు కనుగొన్న తరువాత ఎన్నో రకాలుగా దీనిని రైలు, మోటారు వాహనాలు, పంఖాలు, జనరేటర్లు గా ఉపయోగిస్తున్నాము.
- రేడియో, దూరదర్శిని వంటి అన్నో ఎలక్ట్రానిక్ పరికరాలలో కొద్దిగా విద్యుత్తును ఉపయోగిస్తున్నారు.