వేనేపల్లి చందర్ రావు

వేనేపల్లి చందర్‌రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కోదాడ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

వేనేపల్లి చందర్ రావు
వేనేపల్లి చందర్ రావు


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1985 - 1999
2009 - 2014
నియోజకవర్గం కోదాడ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1941
కోదాడ, సూర్యాపేట జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
టీఆర్ఎస్‌
తల్లిదండ్రులు గోపాల్ రావు
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

వేనేపల్లి చందర్‌రావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1985 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు. అయన ఆ తర్వాత 1989, 1994 ఎన్నికల్లోనూ వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించాడు. చందర్‌రావు 2004లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.ఉత్తమకుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయి తిరిగి 2009లో నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత 2014లో టీఆర్ఎస్‌లో చేరాడు.[2]

వేనేపల్లి చందర్ రావు 2023 అక్టోబర్ 22న రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[3][4]

మూలాలు

మార్చు
  1. CEO Telangana (2009). "Chander Rao Venepalli" (PDF). Archived from the original (PDF) on 4 June 2022. Retrieved 4 June 2022.
  2. The News Minute (2 October 2018). "Ahead of polls, dissent in TRS: 6 leaders unhappy with the list of candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.
  3. Eenadu (23 October 2023). "భారాసకు మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు రాజీనామా". Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.
  4. Eenadu (29 October 2023). "నాడు ప్రత్యర్థులు.. నేడు మిత్రులు". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.