వేములవాడ పురపాలకసంఘం
వేములవాడ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] వేములవాడ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం లోని వేములవాడ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
వేములవాడ పురపాలకసంఘం | |
— పురపాలకసంఘం — | |
అక్షాంశరేఖాంశాలు: 18°30′04″N 78°51′39″E / 18.5009779°N 78.8609122°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రాజన్న సిరిసిల్ల జిల్లా |
మండలం | వేములవాడ |
ప్రభుత్వం | |
- చైర్పర్సన్ | |
- వైస్ చైర్పర్సన్ | |
వైశాల్యము | |
- మొత్తం | 16.00 km² (6.2 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 31,941 |
- పురుషుల సంఖ్య | 15,905 |
- స్త్రీల సంఖ్య | 16,036 |
- గృహాల సంఖ్య | 9,025 |
పిన్ కోడ్ - 505302 | |
Area code(s) | టెలిఫోన్ కోడ్ - 08723 |
వెబ్సైటు: అధికార వెబ్ సైట్ |
చరిత్ర
మార్చుమేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న వేములవాడ 2011, సెస్టెంబరు 3న పురపాలక సంఘంగా ఏర్పడింది.
భౌగోళికం
మార్చువేములవాడ 16.00 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 18°28′05″N 78°52′01″E / 18.468°N 78.867°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 150 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం సిరిసిల్ల నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 31941 మంది కాగా, అందులో 15905 మంది పురుషులు, 16036 మంది మహిళలు ఉన్నారు. 9025 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 10 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.
పౌర పరిపాలన
మార్చుపురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 28 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[3] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
వార్డు కౌన్సిలర్లు
మార్చు- సంగ హన్మవ్వ
- రెండుమిద్దెల జయ
- నిమ్మశెట్టి విజయ్
- మారం కుమార్
- జడల లక్ష్మి
- నీలం కళ్యాణి
- జోగిని శంకర్
- కందుల శ్రీలత
- రామతీర్తపు మాధవి
- సిరిగిరి రామ్‌చందర్
- యాచమనేని శ్రీనివాసరావు
- రామతీర్తపు కృష్ణవేణి
- గడ్డమీదీ లావణ్య
- బింగి మహేష్
- తిరుమల్ రెడ్డి కవిత
- కొండ శ్రీలత
- చింతపంటి దివ్య
- కొండ పావని
- కుమ్మరి శిరీష
- రెగ్యుల సంతోష్
- నరళ శేఖర్
- ఇప్పపుల అజయ్
- మధు రాజేందర్ శర్మ
- అన్నారం ఉమారాణి
- గుదురు లక్ష్మి
- ముప్పిడి సునంద
- గోలి మహేష్
- ప్రతాప హిమబిందు
మూలాలు
మార్చు- ↑ "Vemulawada Municipality". vemulavadamunicipality.telangana.gov.in. Retrieved 5 May 2021.
- ↑ Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 5 May 2021.
- ↑ admin (2020-05-20). "Vemulawada Municipality Councillors list 2020". Telangana data. Retrieved 2021-05-22.