వేములవాడ మండలం

తెలంగాణ, రాజన్న సిరిసిల్ల జిల్లా లోని మండలం


వేములవాడ మండలం, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మండలం. వేములవాడ మండల ప్రధాన కార్యాలయం వేములవాడ పట్టణం. సముద్ర మట్టానికి 361 మీటర్ల ఎత్తులో ఉంది..పునర్య్వస్థీకరణలో భాగంగా వేములవాడ మండలాన్ని,కొత్తగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల రెవెన్యూ డివిజను పరిధిలోకి చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది.[1] ప్రస్తుతం ఈ మండలం వేములవాడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 8  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.వేములవాడ మండలం కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం, వేములవాడ శాసనసభ నియోజకవర్గం పరిధిలో భాగం.

వేములవాడ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°27′58″N 78°52′07″E / 18.466199°N 78.868601°E / 18.466199; 78.868601
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా
మండల కేంద్రం వేములవాడ
గ్రామాలు 8
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా
 - మొత్తం 50,158
 - పురుషులు 25,019
 - స్త్రీలు 25,139
పిన్‌కోడ్ 505302

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 84 చ.కి.మీ. కాగా, జనాభా 50,158. జనాభాలో పురుషులు 25,019 కాగా, స్త్రీల సంఖ్య 25,139. మండలంలో 12,383 గృహాలున్నాయి.[2]

మండలం లోని గ్రామాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. వేములవాడ
  2. సత్రాజుపల్లి
  3. తిప్పాపురం
  4. మారుపాక
  5. చంద్రగిరి
  6. తెట్టకుంట
  7. నాంపల్లి
  8. సంకేపల్లి

మండలానికి సమీప పట్టణాలు

మార్చు

సమీపం లోని పర్యాటక ప్రదేశాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "రాజన్న సిరిసిల్ల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  2. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

ఇవికూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు