వేములవాడ భీమకవి (సినిమా)

1976 సినిమా

వేములవాడ భీమకవి, 1976 లో వచ్చిన జీవితచరిత్ర చిత్రం. ఎన్‌టి రామారావు తన రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మించాడు డి. యోగానంద్ దర్శకత్వం వహించాడు. ఇందులో ఎన్.టి.రామారావు, నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలలో నటించగా, పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం అందించాడు.[1][2]

వేములవాడ భీమకవి
(1976 తెలుగు సినిమా)
Vemulawada Bheemakavi film poster.jpg
దర్శకత్వం డి.యోగానంద్
నిర్మాణం నందమూరి తారక రామారావు
కథ నందమూరి తారక రామారావు
చిత్రానువాదం నందమూరి తారక రామారావు
తారాగణం నందమూరి బాలకృష్ణ,
నందమూరి తారక రామారావు
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
ఛాయాగ్రహణం జె. సత్యనారాయణ
కూర్పు జి.డి. జోషి
నిర్మాణ సంస్థ రామకృష్ణ ఆర్ట్స్
విడుదల తేదీ 1976 జనవరి 8 (1976-01-08)
భాష తెలుగు

కథసవరించు

ఈ కథ 9 వ శతాబ్దపు ప్రసిద్ధ తెలుగు కవి వేములవాడ భీమకవి జీవితం ఆధారంగా రూపొందించబడింది. మూఢనమ్మకాలతో సమాజం చెడిపోయిన చోట, మతం పేరిట నేరాల స్థాయి పెరిగిపోయినపుడు, భక్తిని కాపాడటానికి సమాజాన్ని సంస్కరించడానికి గొప్ప వ్యక్తులు పుడతారు. వారిలో ఒకరు వేములవాడ భీమకవి. మాచమ్మ బాల వితంతువు. పిలల్ల కోసం ఆమె వృద్ధ భర్త ఆమెను పెళ్ళి చేసుకుంటాడు. కాని ఆ కోరిక నెరవేరక ముందే చనిపోతాడు. మాచమ్మ తన సోదరుడి ఇంట్లో బానిసలా నివసిస్తుంది. మాచమ్మ ఒకసారి వేములవాడలోని భీమేశ్వర ఆలయానికి వెళ్లి అమాయకంగా తన భర్త కోరిక తీర్చమని ప్రార్థిస్తుంది. భీమేశ్వరుడు ఆమె అమాయక కోరిక పట్ల సంతోషించి, ఆమె ఒక అబ్బాయికి జన్మనిస్తుందని వరమిస్తాడు. మాచమ్మ గర్భవతి అయినప్పుడు, సమాజం ఆమెను ఛీత్కరిస్తుంది. ఆమె భీమకవికి జన్మనిస్తుంది. సమాజం భీమకవిని తరిమివేస్తుంది. అతను ఎటువంటి విద్యనూ పొందలేకపోతాడు. అతను తన, తోటి బహిష్కృతుల వెతలను గమనిస్తాడు. మనుషులంతా సమానమేనని వీధుల్లో చర్చలు మొదలుపెడతాడు. ప్రజలు అతన్ని చట్టవిరుద్ధమైన కుర్రవాడిగా జమకడతారు.

ఒకసారి అతను కాళిపూజ వద్దకు వెళ్లగా అతన్ని బయటకు గెంటేస్తారు. భీమ తన తండ్రి గురించి చెప్పమని తల్లిని అడగ్గా, ఆమె వెళ్లి భీమేశ్వరుడినే అడగమని సమాధానం ఇస్తుంది. భీమ ఆలయానికి వెళ్లి నిజం చెప్పకపోతే అక్కడే ఆత్మహత్య చేసుకుంటానని అంటాడు. శివుడు ప్రత్యక్షమై, అతను తన తల్లికి దేవుడు ఇచ్చిన బహుమతి అని చెప్తాడు. అతని వాక్కు నిజమవుతుందని అతనికి ఒక వరం ఇస్తాడు. బీమా కర్మ మైదానానికి వచ్చి, ఒక పద్యం పఠించి, అన్నం సున్న మవుతుందని, అప్పం కప్పగా మారుతుందని అంటాడు. అతను అన్నట్లే జరుగుతుంది. కవులు పూజారులు అందరూ అతని కాళ్ళ మీద పడతారు. మాచమ్మ ఒక గొప్ప మహిళ అని అంగీకరిస్తారు. అతడిని వారి సమాజం లోకి స్వీకరిస్తారు.

భీమకవి అనేక రాజ్యాలను సందర్శించి అద్భుతాలు చేస్తాడు. ఒక రాజ్యంలో, రాజు తన కుమారుడు కళింగ గంగుకు పట్టాభిషేకం చేసే ముందు మరణిస్తాడు. రాజ్యంలో అశాంతిని సృష్టించే నేరపూరిత అంశాలు చాలా ఉన్నాయి. ప్రజలు తిరుగుబాటు చేసి కళింగ గంగును హత్య చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ సమయంలో, భీమకవి రాజు ఆస్థానంలోకి ప్రవేశిస్తాడు. అయితే రాజు అతన్ని తరువాత రమ్మని అడుగుతాడు. భీమకవి కోపంగా ఉండి 32 రోజుల్లో తన రాజ్యాన్ని కోల్పోతాడని శపిస్తాడు. అది జరుగుతుంది. కొంత సమయం తరువాత, భీమకవి కళింగ గంగును వీధుల్లో చూస్తాడు. అతని పట్ల సానుభూతి చూపించి వచ్చే పౌర్ణమి నాటికి తన రాజ్యాన్ని తిరిగి పొందుతాడని భరోసా ఇస్తాడు. అది ఎలా జరుగుతుందనేది మిగిలిన కథ  

నటీ నటులుసవరించు

సాంకేతిక సిబ్బందిసవరించు

పాటలుసవరించు

  1. జగదీశా పాహి పరమేశా
  2. అనుకుంటున్నాను నేనూ అనుకుంటున్నాను
  3. సైరా మగాడా ...
  4. రాజు వేడలే సభకు....
  5. లేరా లేరా తేలుగు బిడ్డ....
  6. ఈసాన నేను నీదాన ...
  7. చిలకల కొలికినిరా నీచేతిలో చిక్కాను రా...
  8. చందమామ నీతొటి ....

మూలాలుసవరించు

  1. "Heading-2". Nth Wall. Archived from the original on 2015-02-02. Retrieved 2020-08-29.
  2. "Heading-3". Tollywood Times. Archived from the original on 2018-10-27. Retrieved 2020-08-29.