వేముల ఎల్లయ్య
వేముల ఎల్లయ్య | |
---|---|
జననం | లింగాల ఘనపురం,జనగామ, వరంగల్ జిల్లా | 1973 జూలై 6
నివాస ప్రాంతం | నల్లగొండ |
వృత్తి | కవి, నవలారచయిత |
తండ్రి | వేముల బుచ్చయ్య |
తల్లి | చంద్రమ్మ |
జననం
మార్చువేముల ఎల్లయ్య, వరంగల్ జిల్లాలోని జనగామ తాలూకా లింగాల ఘనపురంలో, 1973 జూలై 06లో జన్మించాడు. నల్గొండ జిల్లాలో స్థిరపడ్డారు. వేముల ఎల్లయ్య అతి సాధారణ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు నిరక్ష్యరాస్యులు. చిన్నప్పటినుండి చదువు మీద మమకారంతో కష్టపడి చదివి ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యంలో పరిశోధన చేస్తున్నారు.
సాహిత్య పరిచయం
మార్చువేముల ఎల్లయ్య దళితవాద తెలుగు సాహిత్యంలో దృవతార. "వేముల ఎల్లయ్య రాసిన కక్క నవల ప్రత్యేకమైనది. మాదిగల వాడుక భాషను నవలలో సమర్ధంగా వినియోగిస్తూ, వారి సాంస్కృతిక, సామాజిక జీవన విధానాన్ని రచయిత చిత్రించారు. ఈ నవలలో కులవృత్తి చుట్టూ తిరుగుతూ, దళిత జీవితాన్ని చిత్రిస్తుంది." మరో దళితవాద చైతన్యాన్ని, స్పృహను కలిగించే నవల "సిద్ధి". "ఈ నవల దళితవాద సామాజిక సాంస్కృతిక జీవితాన్ని ప్రతిబింబిస్తుంది." వేముల ఎల్లయ్య తమ సాహిత్యంలో మాదిగ జాతిపై జరుగుతున్నటువంటి అన్యాయాలు, అవమానాలను, హీనత్వంతో అమానుషంగా చూడబడుతున్న స్థితిని, మాదిగ సంస్కృతి, ఆచార వ్యవహరాలను తన కక్క నవలలో అతిసులభమైన తెలంగాణ భాషలో సాధారణ ప్రజలకు కూడా అర్థం అయ్యేవిధంగా వివరించాడు. ఎల్లయ్య దండోరా ఉద్యమంలో కీలకంగా పనిచేస్తూ మరొకవైపు తనదైన శైలిలో విమర్శనాత్మకమైన
నవల, కవిత్వం, కవితలు, సాహిత్యం, కథలు, వ్రాస్తు, తెలుగు సాహిత్యం, దళిత సాహిత్యం లలో చర్చ పెడుతూ దళితుల సాహిత్యం, మాదిగల సాహిత్యంలో తమదైన శైలిలో వ్రాయాలని చాలా మందికి స్ఫూర్తినిస్తూ తెలుగు సాహిత్య రంగంలో ముందుంటున్నారు. అంతేకాక ఇతను తిరుగుబాటు సాహిత్యాన్ని కూడా బయటకు తీసుకరావడంలోను కీలక పాత్ర పోషించారు. దానితో పాటు మాదిగ జీవితాన్ని అవపొసన పట్టిన ఎల్లయ్య మాదిగ జాతి యొక్క భాష, సంస్కృతి, చరిత్రలపై నితంతరం కృషి చేస్తున్నారు. సాహిత్య సభలు, సాహిత్య సమీక్షలు, సాహిత్య పత్రికలతో మాదిగ సమాజాన్ని తనదైన శైలిలో చైతన్య పరుస్తున్నాడు. ఈ రోజు కక్క నవల ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన యునివర్సిటీలో పరిశోధన పత్రంగా గుర్తించబడింది. మాదిగ జాతి యొక్క ఔన్యత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాడు. చెప్పులు కుట్టిన చేతులే చరిత్రను తిరగరాయ బడతాయనడానికి వేముల ఎల్లయ్య నిదర్శనం.
వేముల ఎల్లయ్య ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధన విద్యార్థిగా ఉంటూ "గోసంగుల జీవిత చరిత్ర" పైన అధ్యయనం చేస్తున్నారు.[1] [2][3][4][5]
నవలలు ("దళితవాద నవలలు")
మార్చు- కక్క (నవల) : తెలంగాణా ప్రాంతంలో అగ్రవర్ణ భూస్వాములు మాదిగల్ని పెట్టే కష్టాల గురించి వేముల ఎల్లయ్య “కక్క” నవలలో చిత్రించారు. భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలు ఈ నవలలో బాగా కనిపిస్తాయి. ఇది వేముల ఎల్లయ్య యొక్క తొలి నవల. "కక్క తెలుగు సాహిత్యాన్ని తలకిందులు చేసింది", ఇది ఒక ఉత్తమ ప్రామాణిక శైలీకృత నవల.
- సిద్ది (నవల)
కవితా సంకలనాలు ("దళితవాద కవితా సంకలనాలు")
మార్చునాటకం
మార్చు- బహువిధ నాటకం : దీనిని ప్రొఫెసర్ లక్కూరి ఆనంద్ గారిచే కన్నడంలోకి అనువాదచేయబడినది. తిరుగుబాటు కవిత్వం,
- అవిటి కథలు (సంపాదకులు)
- గుంపు సాహిత్యం, ఈలం (ఎల్.టి.టి.) కవితా సంపుటి
- "నిమాష్ " (లక్షింపేట దళితుల ఇమ్మతి కవిత్వం )
- ముల్కి - సాహిత్య పత్రిక సంపాదకులు
"బ్లాక్ లిల్లీ" కవిత్వంను, కక్క నవలలను కాకతీయ యూనివర్సిటీ, ప్రొఫెసర్ డా. కె. పురుషోత్తం ఆంగ్లంలోకి అనువాదం
మూలాలు
మార్చు- ↑ వేముల, ఎల్లయ్య. "Language is infinite". anveshi.org.in. anvesh. Archived from the original on 2019-05-09. Retrieved 2015-01-29.
- ↑ VEMULA, YELLAIAH. "DALIT POET VEMULA YELLAIAH INTERVIEW, PART-1". youtube.com.
- ↑ VEMULA, YELLAIAH,. "DALIT POET VEMULA YELLAIAH, INTERVIEW, PART-2". youtube.com.
{{cite web}}
: CS1 maint: extra punctuation (link) CS1 maint: multiple names: authors list (link) - ↑ Vemula, Yellaiah. STEEL NIBS ARE SPROUTING - NEW DALIT WRITING FROM SOUTH INDIA DOSSIER 2: TELUGU AND KANNADA (2 ed.). Hyderabad: Harper Collins. ISBN 9789350293768.
- ↑ Vemula, Yellaiah. A History of Telugu Dalit Literature. Kalpaz Publications (2008). ISBN 8178356880.
ఇతర లింకులు:
మార్చుhttps://www.logili.com/novels/kakka-siddi-vemula-yellaiah/p-7488847-52592517167-cat.html https://www.wheelers.co.nz/browse/author/8193624-vemula-yellaiah/ Archived 2021-11-06 at the Wayback Machine http://www.anandbooks.com/Mulki-Muslim-Sahitya-Sankalanam Archived 2021-11-06 at the Wayback Machine http://www.teluguvelugu.in/vyasalu.php?news_id=Mjk5OA==&subid=ODA=&menid=OA==&authr_id=NTE=&etitle=t[permanent dead link] https://www.google.com/search?q=%E0%B0%B5%E0%B1%87%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2+%E0%B0%8E%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF&ei=chiGYb7oLbq84-EPvr6xyA8&start=10&sa=N&ved=2ahUKEwi-6bOUhoP0AhU63jgGHT5fDPkQ8tMDegQIARA6&biw=1517&bih=631&dpr=0.9 https://www.dandoranestham.com/2020/11/novel-story-literature-of-madhighajago.html Archived 2021-11-06 at the Wayback Machine https://www.hawakal.com/books/bags/kakka-a-dalit-novel/