వేలూరి సత్యనారాయణ

వేలూరి సత్యనారాయణ (1898-1943)

పరిచయం మార్చు

వేలూరి సత్యనారాయణ గారు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కాపురస్తులు. స్వతంత్ర సమరయోధులుగాను, రచయితగాను వారు ప్రముఖులు. వారిని గురించి 1943 లో ఆంధ్రపత్రిక మే నెల 21 వ తారీఖునాడు శ్రీ దిగవల్లి వేంకట శివరావు గారు వ్రాసి యున్నారు. వీరి జనన వృత్తాంతము తెలియదు, ఇంటిపేరు వేలూరి అయినందున వేలూరి శివరామ శాస్త్రి గారికి బంధుత్వముయుండవచ్చు కానీ అట్టి సూచనలు వారి సమకాలీకులైన వారి మిత్రులు అభిలాషులు ఎవ్వరూ చేసియుండలేదు. 1943 లో వారి 45 వ ఏట విజయవాడ లోని పటమటలంక లోని ఆరోగ్యాశ్రమంలో పరమదించారు. 1925 లో వీరు రచించిన ప్రముఖమైన "బౌధ్ధ మహా యుగము" అను పుస్తకము విజ్ఞాన చంద్రికామండలి వారు ప్రచురించారు.[1]

విధ్యాభ్యాసం మార్చు

వీరు విజయనగరం మహారాజా కాలేజీలో బి.ఎ (చరిత్ర) లో పట్టభద్రులైలో ఎం.ఎ చదువుతుండగా గాంధీ మహాత్ముని పిలుపుపై విద్యాభ్యాసము విడిచి స్వతంత్రసమరయోధనలో ప్రవేశించారు

స్వతంత్ర పోరాటములో కృషి మార్చు

1922 లో సహాయనిరాకరణోద్యమములో వీరు డాక్టరు బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం గారు, శ్రీ ముష్టి లక్ష్మీనారాయణ గారు, వారి తమ్మలు ముష్టి సుబ్రహ్మణ్యం గా, శ్రీ అడవి బాపిరాజు గార్లతో కలసి కాంగ్రెస్సు ప్రచారణ చేసి 1 సంవత్సరం జైలు శిక్ష అనుభవించారు. వేలూరి సత్యనారాయణ గారికి ఖారాగార వాసంలో అతి భారమైన, ఖటినమైన విధులు ఇవ్వబడినవి అందులో నూనెగానుగ త్రిప్పుటవకటి. ఆప్పటిలో స్వతంత్రయోధులను ఎ అని బి అని వర్గీకరణలు చేయటం మొదలవ లేదు. తరువాతి కాలంలో అట్లా వర్గీకరించి ఎ క్లాసు ఖైదీలకు తేలిక పాటి విధులను విధించేవారు. ఆనాటి చెరసాల అనుభావలను సత్యనారాయణగారు వారి మిత్రులకు చేప్పేవారు. 1923 మొదలూ కొంతకాలం బెజవాడలో ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్సు కార్యదర్శిగా నున్నారు

దేశయాత్ర మార్చు

సత్యనారాయణగారు కాలినడకన దేశయాత్ర చేసి ఒక గొప్ప చరిత్ర సృష్టించారు. ఉత్తరహిందూస్తానములో కాలినడకన ఆరావళీ కొండలు, అజంతా ఎల్లోరా మొదలగు ప్రాంతములకు వారి మిత్రులతో కాలినడకన ప్రకృతినైపుణ్యమును దర్శించి పర్యటన చేసి వచ్చారు.

న్యాయవాది వృత్తి మార్చు

1925 లో సత్యనారాయణ గారు బి.ఎల్ పరీక్షపట్టభద్రులై కొన్నిరోజులు బెజవాడలోను ఆ తదుపరి భీమవరంలోన్యాయవాదిగా ప్రవేశించినా దేశ సేవ, భాషాసేవ మానలేదు.

సాహిత్య కృషి మార్చు

1923 లో ఆంధ్రరాష్ట్ర కార్యద్శగా నున్నప్పుడు కృష్ణా పత్రికలో కొన్ని వ్యాసాలు రచించి ప్రపంచములోని వివిధదేశములలో జరిగిన స్వాతంత్ర్యోద్యమముల చరిత్ర గురించి వ్రాశారు.ఫ్రెంచివిప్లవ చరిత్రను గురించి వ్రాశారు కానీ అయ్యదేవర కాళేశ్వరరావు గారు రచించిన ఫ్రెంచివిప్లవం ముందుగా ప్రచురితమైనందువల్ల సత్యనారాయణగారు రచించిన ఫ్రెంచి విప్లనమను పుస్తకమును అచ్చు వేయలేదు. సత్యనారాయణ గారి రచనలు విశేషమైనవి కొన్ని బెజవాడలోని విజ్ఞాన చంద్రికామండలి వారు ప్రచురించినవి (1) బౌధ్ధ మహాయుగము (2) ఫాహియాన్ భారత దేశ యాత్ర. 1924 లో భారతి పత్రిక కార్తీక మాసం సంచికలో వెలువడిన వారి వ్యాసం 'ఉండవల్లి జీర్ణగుహలు'చాల గొప్ప వ్యాసము. సత్యనారాయణగారి రచనలలో దేశాభిమానం ఉట్టిపడుతూ ఆ రోజులలో ఆంగ్ల ప్రభుత్వమువారు చేసే అన్యాయపు పరిపాలను త్రీవముగా ఖండించివ వారిలో ఒకరు. మనదేశమునకు అవమానకరముగానుండే ఆంగ్లచరిత్రకారుల అబధ్ధపు రచనలను బయటికి తీయటములో గొప్పకృషిచేసిన దిగవల్లి వేంకట శివరావుగారంతటి వారే ఆ విషయములో సత్యనారాయణగారు అందెవేసిన చేయి అనిీనూ, దేశ చరిత్ర రసవత్తంగా వ్రాయటంలో సత్యనారాయణ గారు అపూర్వమైన మార్గంచూపించారని చెపుతూ దేశ చరిత్ర వ్రాసే విధనమును బట్టే మన ప్రజలలో దేశాభిమానం కలుగునని గట్టి నమ్మకముగలవారిలో సత్యనారాయణగారు గూడా ఒకరని వ్రాశారు. ఆంధ్ర దేశములో జరిగిన చరిత్ర పరిశోధనలము క్రోడీకరించి బౌధ్ధాంధ్ర చరిత్ర అను పుస్తకము రచించారు కానీ అది అచ్చుకాకుండానే పరమదించారు.

కుటుంబము మార్చు

వారు 1943 లో స్వర్గస్తులైననాటికి వారికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు కలిగి యుండిరి.

మూలాధారములు మార్చు

  1. "కీ||శ|| వేలూరి సత్యనారాయణ గారు" దిగవల్లి వేంకట శివరావు ఆంధ్ర పత్రిక మే 21,1943