వేలూరి సీతాలక్ష్మి

డా. వేలూరి (వెలమకన్ని) సీతాలక్ష్మి చెన్నైలో జన్మించి , బాపట్లలో పెరిగారు. ఈమె విశాఖ జిల్లా అనకాపల్లిలో 32 సంవత్సరాలకు పైగా తెలుగు అధ్యాపకురాలిగా, రీడరుగా పనిచేసి, ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్నారు. ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తంగారి పర్యవేక్షణలో అనంతామాత్యునిపై ఆమె రచించిన “భోజరాజీయ కావ్యానుశీలనం” అనే అంశం పై గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలో ఉత్తమ పరిశోధనాగ్రంధంగా ఆచార్య తూమాటి దోణప్ప బంగారు పతకం పొందింది. భమిడిపాటి రామగోపాలం (భరాగో) గారితో కలిసి తెలుగు చిత్రగీతాలపై ఆమె రచించిన “మరో నూటపదహార్లు” అనే పుస్తకం వ్రాశారు. ప్రఖ్యాత గాయని పద్మవిభూషణ్ శ్రీమతి పి. సుశీలపై “వెండివెన్నెల జాబిలి” అనే శీర్షికతో వ్రాసిన వ్యాసం భరాగో, ఇతరులు రూపొందించిన ఒక అభినందన సంచికలో భాగంగా వెలువడింది. ఇవికాక వీరు అనేక పుస్తక సమీక్షలు, సాహిత్య ప్రసంగాలు చేశారు.

ప్రస్తుతం ఆమె ఆంధ్ర పద్యకవితా సదస్సు విశాఖజిల్లా శాఖకు ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. ఆమె అభిరుచులు -రసరమ్య గీతాల, రసాలూరే పద్యాల శ్రవణం, పఠనం[1]

మూలాలు

మార్చు
  1. "poddu.net/2010/%E0%B0%AA%E0%B1%81%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AA%E0%B0%97%E0%B0%82%E0%B0%A7%E0%B0%BF/". {{cite journal}}: Cite journal requires |journal= (help)