శభాష్ మిథు
శభాష్ మిథు స్పోర్ట్స్ డ్రామాగా నిర్మించిన హిందీ సినిమా. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ జీవిత కథ ఆధారంగా వయాకామ్ 18 స్టూడియోస్, కాళోస్కీయం మీడియా బ్యానర్‌లపై నిర్మించిన ఈ సినిమాకు శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 20న విడుదల చేసి[1] సినిమాను జూలై 15న విడుదల చేయనున్నారు.[2]
శభాష్ మిథు | |
---|---|
దర్శకత్వం | శ్రీజిత్ ముఖర్జీ |
రచన | ప్రియా అవెన్ |
తారాగణం | తాప్సీ |
ఛాయాగ్రహణం | శీర్ష రే |
కూర్పు | ఏ. శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | అమిత్ త్రివేది |
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 15 జూలై 2022 |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
కథ
మార్చుమిథాలీ రాజ్ మహిళల జాతీయ క్రికెట్ జట్టు మాజీ టెస్ట్, వన్డే కెప్టెన్. ఆమె 2017 మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో భారతదేశ క్రికెట్ జట్టును ఫైనల్స్‌కు తీసుకెళ్ళింది. మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం మహిళా క్రికెట్ ప్రపంచంలో మిథాలీ జీవిత ప్రయాణంలో జరిగిన సంఘటనలను చూపిస్తుంది.
నటీనటులు
మార్చు- మిథాలీ రాజ్‌గా తాప్సీ పన్ను
- ఝులన్ గోస్వామిగా ముంతాజ్ సోర్కార్[3]
- మిథాలీ కోచ్‌గా విజయ్ రాజ్
- బ్రిజేంద్ర కలా
- మిథాలీ తల్లిగా దేవదర్శిని[4]
సంగీతం
మార్చుఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం సమకుర్చాడు. స్వానంద్ కిర్కిరే, కౌసర్ మునీర్, చరణ్, రాఘవ్ ఎం కుమార్ పాటలు రాశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ని సాల్వేజ్ ఆడియో కలెక్టివ్ కంపోజ్ చేసింది.
విడుదల
మార్చుడిసెంబరు 3న మిథాలీ రాజ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ పోస్టర్‌ను విడుదల చేస్తూ, 2022 ఫిబ్రవరి 4న సినిమా విడుదల చేస్తున్నట్టు నిర్మాత ప్రకటించాడు.[5] అదేరోజున రాజ్‌కుమార్ రావు హాస్య చిత్రం బదాయి దోతో విడుదల వల్ల, ఫిబ్రవరి 11కి వాయిదా పడింది.[6] తదనంతరం ఈ చిత్రం విడుదల కాలేదు. 2022 జూలై 15న విడుదల చేయడానికి షెడ్యూల్ చేయబడింది.[7]
మూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (12 June 2022). "తాప్సీ 'శభాష్ మిథు' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. విడుదల ఎప్పుడంటే?". Archived from the original on 12 June 2022. Retrieved 12 June 2022.
- ↑ "మిథాలీ రాజ్ బయో పిక్ జులై 15 న విడుదల". Hindusthan Times. 29 April 2022. Archived from the original on 12 June 2022. Retrieved 12 June 2022.
- ↑ "Mumtaz to play Jhulan Goswami in Taapsee Pannu's 'Shabaash Mithu'". The Times of India. 10 February 2022. Retrieved 9 May 2022.
- ↑ "After The Family Man Season 2, Devadarshini set to wow Hindi audiences again in Shabaash Mithu". OTT Play. 20 June 2022. Retrieved 21 June 2022.
- ↑ "Shabaash Mithu new poster: Taapsee Pannu stuns as Mithali Raj, release date revealed". Firstpost. 3 December 2021. Retrieved 3 December 2021.
- ↑ "Taapsee Pannu starrer 'Shabaash Mithu' to release on February 4, 2022, will clash with Rajkummar-Bhumi's 'Badhaai Do'". The Times of India. 3 December 2021. Retrieved 3 December 2021.
- ↑ "Taapsee Pannu starring Shabaash Mithu releases on the big screen on July 15, 2022". Bollywood Hungama (in ఇంగ్లీష్). Retrieved 29 April 2022.