శశిరేఖా పరిణయం (2009 సినిమా)

శశిరేఖ పరిణయం 2009 లో కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] ఇందులో తరుణ్, జెనీలియా ప్రధాన పాత్రలు పోషించారు.

శశిరేఖా పరిణయం
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం కృష్ణ వంశీ
నిర్మాణం సుంకర మధుమురళి
కథ కృష్ణ వంశీ
చిత్రానువాదం కృష్ణ వంశీ
తారాగణం తరుణ్,
జెనీలియా,
అహుతి ప్రసాద్,
పరుచూరి గోపాలకృష్ణ,
బలిరెడ్డి పృధ్వీరాజ్,
వంశీ పైడితల్లి
సంభాషణలు నాగరాజు
ఛాయాగ్రహణం సామల భాస్కర్
కూర్పు శంకర్
నిర్మాణ సంస్థ కార్తికేయ క్రియేషన్స్
విడుదల తేదీ 1 జనవరి 2009
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కాకినాడలో చదువుకుంటున్న అమలాపురం అమ్మాయి శశిరేఖ (జెనీలియా) ని ఆమె పిన్ని బాబాయ్ ఓ అర్ధరాత్రి నిద్రలేపి అమలాపురం ప్రయాణం చేస్తారు. ఇంటిముందు ఉన్నా పందిరి చూసి ఎవరిదో పెళ్ళి అనుకున్నశశిరేఖ జరుగుతున్నది తన పెళ్ళే అని తెలుసుకుని షాక్ అవుతుంది. పెళ్ళి వద్దని ఇంట్లో వాళ్ళని ఒప్పించలేక ఇంటినుంచి పారిపోతుంది. ప్రయాణంలో ఆమెకి ఆనంద్ (తరుణ్) అనే అబ్బాయి పరిచయం అవుతాడు. హైదరాబాద్ పారిపోదామనుకున్న శశిరేఖ తన నగలు పోగొట్టుకోవడంతో విజయవాడలో ఆగాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో ఆనంద్ తో ఆమె పరిచయం ప్రేమగా మారుతుంది. ఆనంద్ మరెవరో కాదు, శశిరేఖ తప్పించుకున్న పెళ్ళి వరుడు అభిమన్యు అని శశిరేఖకి తెలియడం, వాళ్ళిద్దరి పెళ్ళి జరగడంతో కథ ముగుస్తుంది.

తారాగణం

మార్చు
  • ఆనంద్/ అభిమన్యు గా తరుణ్
  • శశిరేఖ అలియాస్ బుజ్జమ్మ గా జెనీలియా
  • అభిషేక్
  • ఆహుతి ప్రసాద్
  • సుబ్బరాజు
  • పరుచూరి గోపాలకృష్ణ
  • గీతా సింగ్

పాటలు

మార్చు

ఈ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకత్వం వహించగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి, అనంత శ్రీరాం పాటలు రాశారు. విద్యాసాగర్ ఈ సినిమాలు ఏదో ఏదో, బుజ్జమ్మా బుజ్జమ్మా పాటలు స్వరపరిచాడు.[2]

సం.పాటగాయకులుపాట నిడివి
1."ఇలా ఎంతసేపు"రాహుల్ నంబియార్5:09
2."గుండెల్లో గోలీసోడా"జై4:44
3."ఓ బుజ్జమ్మా"రంజిత్4:46
4."ఏదో ఏదో"సైంధవి2:57
5."బెజవాడ"నవీన్, రీటా5:23
6."ఏదో ఏదో 2"సైంధవి3:14
7."నిన్నే నిన్నే"కె. ఎస్. చిత్ర4:28

మూలాలు

మార్చు
  1. జి. వి, రమణ. "శశిరేఖా పరిణయం సినిమా సమీక్ష". idlebrain.com. ఐడిల్ బ్రెయిన్. Archived from the original on 15 అక్టోబరు 2017. Retrieved 19 October 2017.
  2. "Sasirekha Parinayam Songs - Telugu Movie Songs - Raaga.com". Raaga.com.