ప్రధాన మెనూను తెరువు

బలిరెడ్డి పృథ్వీరాజ్

సినీ నటుడు
(బలిరెడ్డి పృధ్వీరాజ్ నుండి దారిమార్పు చెందింది)

బలిరెడ్డి పృధ్వీరాజ్ ఒక తెలుగు సినీ నటుడు.[1][2] ఎక్కువగా హాస్యపాత్రలు, కొన్ని ప్రతినాయక పాత్రలు పోషించాడు. ఇప్పటివరకు దాదాపు 75 చిత్రాలకు పైగా నటించాడు.[3] 1993లో ఇ. వి. వి సత్యనారాయణ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో మొదటి సారిగా నటించాడు. కృష్ణవంశీ ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనే డైలాగుతో హాస్యనటుడిగా మంచి ప్రాచుర్యం పొందాడు. గోపీచంద్ హీరోగా వచ్చిన లౌక్యం సినిమాలో బాయిలింగ్ స్టార్ బబ్లూ పాత్ర కూడా ఇతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది.

బలిరెడ్డి పృధ్వీరాజ్
Balireddy prudhviraj.jpg
బలిరెడ్డి పృధ్వీరాజ్
జననంబలిరెడ్డి పృధ్వీరాజ్
తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి జిల్లా
ఇతర పేర్లుపృధ్వీరాజ్
30 ఇయర్స్ ఇండస్ట్రీ
చదువుఎం. ఏ
విద్యాసంస్థలుఆంధ్ర విశ్వవిద్యాలయం
వృత్తిసినిమా నటుడు
తల్లిదండ్రులు
  • బలిరెడ్డి సుబ్బారావు (తండ్రి)

నేపథ్యంసవరించు

పృథ్వీరాజ్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లి గూడెం. తండ్రి బలిరెడ్డి సుబ్బారావు వృత్తి రీత్యా రైల్వేలో పార్సిల్ మాస్టర్. ప్రవృత్తి రీత్యా నటుడు. ఆయన మోహన్ బాబు, సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి లాంటి వారితో కలిసి సుమారు 60 సినిమాల్లో నటించాడు. పృథ్వీ చిన్నప్పుడు క్రికెట్ బాగా ఆడేవాడు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ఇల్లు వీళ్ల వీధిలోనే ఉండేది. సినిమాలమీద మక్కువతో పృథ్వీ తండ్రి చెన్నైలోనే స్థిరపడ్డాడు. కానీ పృథ్వీ తల్లి ఇక్కడే ఉండిపోయి తాను చిన్న ఉద్యోగం చేసి ఆ సంపాదనతో అతన్ని చదివించింది. డిగ్రీ పూర్తయిన తర్వాత ఆటగాళ్ళకు కేటాయించిన కోటాలో అతనికి ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎం. ఏ ఎకనామిక్సులో సీటు వచ్చింది.[4] అక్కడ ఉన్నప్పుడే సముద్ర తీరం వెంబడి కొన్ని సినిమా చిత్రీకరణలు చూసి వాటి మీద ఆసక్తి మొదలైంది. ఒకసారి కాలేజీలో సాంస్కృతిక సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాన్నతో నటుడు ప్రభాకర్ రెడ్డితో ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకుని ఆయన్ని అతిథిగా తీసుకువచ్చాడు. ఆయన పృథ్వీ రూపు రేఖల్ని చూసి పీజీ పూర్తయిన తర్వాత సినిమాల కోసం చెన్నై రమ్మన్నాడు.

పృథ్వీరాజ్ కు ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. అబ్బాయి టెక్ మహీంద్రాలో పనిచేస్తున్నాడు.

కెరీర్సవరించు

1992 లో ప్రభాకర్‌రెడ్డి సలహా మేరకు పీజీ పూర్తి కాగానే చెన్నై వచ్చేశాడు.[5] మొదట్లో ఆయన ఓ హోటల్లో రిసెప్షన్ మేనేజరుగా ఉద్యోగం ఇప్పించాడు. కానీ అందులో ఉన్నంతకాలం సినిమా అవకాశాలు ఏవీ రావడం లేదని సినిమా దర్శకుల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం వస్తుందని సిటీ కేబుల్లో చేరాడు. ఒకరోజు ఈ. వి. వి సత్యనారాయణ తన సినిమాకు నటులకోసం అన్వేషిస్తున్నారని తెలుసుకుని ఆయన్ను కలుసుకున్నాడు. అందులో ఒక బ్యాంకు మేనేజరు పాత్రకు అతను సరిపోతాడని భావించి దానికి ఎంపిక చేశాడు. అలా ఆ ఒక్కటీ అడక్కు చిత్రంలో రావు గోపాలరావు మేనల్లుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో రావుగోపాలరావు తో కలిసి నలభై రోజుల పాటు ఉన్నాడు.

ఆ ఒక్కటీ అడక్కు సినిమా తర్వాత వెంటనే ఏమీ అవకాశాలు రాలేదు. చిన్న చిన్న పాత్రలు వచ్చినా అవి కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు. కొన్ని రోజులు సినిమాలకు తనకి సరిపడవని ఇంటికి వెళ్ళి ఆశ చావక మళ్ళీ చెన్నైకి వచ్చేసేవాడు. అదే సమయంలో తన తల్లి చనిపోవడంతో కొన్నాళ్ళు కుంగిపోయాడు. అప్పుడే కృష్ణవంశీ సింధూరం అనే సినిమా చేస్తున్నాడని తెలిసి అందులో ఓ నక్సలైటు పాత్ర సంపాదించాడు. తర్వాత చంద్రలేఖ, ఇడియట్, సముద్రం లాంటి సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రలు లభించాయి. ఖడ్గం సినిమాలో కృష్ణవంశీ సృష్టించిన థర్టీ ఇయర్స్.. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనే డైలాగుతో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తడంతో ఇతడికి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఏర్పడింది.[6] తర్వాత వచ్చిన పోకిరి, ఢీ, రెడీ, కిక్, దూకుడు, గబ్బర్ సింగ్ లాంటి సినిమాల్లో మంచి పేరున్న పాత్రలు లభించడంతో అతనికి స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు లభించింది. లౌక్యం సినిమాలో ఆయన పోషించిన బాయిలింగ్ స్టార్ బబ్లూ పాత్ర కూడా అతనికి మంచి పేరు తెచ్చింది.[7]

మధ్యలో మూడేళ్ళు సినిమా అవకాశాలు తక్కువగా ఉన్నపుడు బాపు దర్శకత్వంలో ఈటీవీలో ప్రసారమైన సీరియల్లో ఏడేళ్ళపాటు ఇంద్రుడు, దుర్యోధనుడు లాంటి అనేక పాత్రల్లో నటించాడు.

నటించిన చిత్రాల పాక్షిక జాబితాసవరించు

మూలాలుసవరించు

  1. బెహరా, శరత్ కుమార్. "బతుకు పాఠాలన్నీ... ఆ నలభై రోజుల్లోనే!". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. మూలం నుండి 12 December 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 12 December 2016.
  2. "'థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ..' నిలబెట్టింది". sakshi.com. సాక్షి. Retrieved 12 December 2016.
  3. "సినీ పరిశ్రమకు రాజమండ్రి బెస్ట్". sakshi.com. సాక్షి. Retrieved 12 December 2016.
  4. శ్రావణ్. "ఇప్పటికి స్థిరపడ్డాను – '30 ఇయర్స్' పృథ్వీరాజ్". telugu360.com. telugu360.com. Retrieved 12 December 2016.
  5. రవి. "Prudhviraj (30 years industry) Exclusive Interview". businessoftollywood.com. businessoftollywood.com. Retrieved 12 December 2016.
  6. హేమంత్, కుమార్. "Prudhvi Raj gets rave reviews for his role in Loukyam". timesofindia.indiatimes.com. టైమ్స్ ఆఫ్ ఇండియా. Retrieved 12 December 2016.
  7. "బాయిలింగ్ స్టార్ ఇరగదీశాడు". sakshi.com. సాక్షి. Retrieved 12 December 2016.
  8. The Hindu, Reviews (7 November 2014). "Joru: Slapstick merry go round". Sangeetha Devi Dundoo. మూలం నుండి 9 July 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 20 June 2019. Cite news requires |newspaper= (help)
  9. "Kevvu Keka Movie Review, Rating". gulte.com. Retrieved 16 July 2019. Cite web requires |website= (help)

బయటి లంకెలుసవరించు