కృష్ణవంశీ
పసుపులేటి కృష్ణవంశీ (జ. జూలై 28, 1962) తెలుగు సినిమా దర్శకుడు. రామ్ గోపాల్ వర్మ దగ్గర కొన్ని చిత్రాలకు సహాయకుడిగా పనిచేసాడు. తన తొలి చిత్రం గులాబీతో మంచి పేరు తెచ్చుకున్నాడు. 2000వ సంవత్సరంలో ఆంధ్రా టాకీస్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. నటి రమ్యకృష్ణను పెళ్ళి చేసుకున్నాడు.
కృష్ణవంశీ | |
---|---|
![]() | |
జననం | పసుపులేటి వెంకట బంగారు రాజు 1962 జూలై 28 |
జీవిత భాగస్వామి | రమ్య కృష్ణ (2003–ఇప్పటివరకూ) |
పిల్లలు | రిత్విక్ |
తెలుగు సినిమా పరిశ్రమలో కృష్ణవంశీ సృజనాత్మక దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. తెలుగు సినిమాకు క్రొత్త ఒరవడిని పరిచయం చేసిన రామ్ గోపాల్ వర్మ వద్ద శిష్యరికం చేయక మునుపు, కొన్నాళ్ళపాటు త్రిపురనేని వరప్రసాద్ అనే దర్శకుడి దగ్గర సహాయకుడిగా ఉన్నాడు. వర్మ వద్ద చేరిన తరువాత కొన్నాళ్ళకు అనగనగా ఒక రోజు చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం లభించినా బడ్జెట్ పరిధి దాటిపోతుండడంతో అతడిని ఆ బాధ్యత నుండి తప్పించడం జరిగింది. కానీ ఆయన ప్రతిభను గమనించిన వర్మ కార్పొరేషన్ బ్యానర్లోనే గులాబి అనే చిత్రంతో మరో అవకాశం వచ్చింది. వర్మ శిష్యులు వర్మ పద్ధతిలోనే చిత్రాలు తీస్తారన్న అపప్రధను చెరిపేసినవాడు కృష్ణవంశీ. కేవలం గులాబీ చిత్రంలోని పాటల చిత్రీకరణ చూసి, అతనికి అక్కినేని నాగార్జున రెండవ చిత్రానికి అవకాశం ఇచ్చాడు . ఆ సినిమా పేరు నిన్నే పెళ్ళాడుతా. తరువాత స్వయంగా సినీ నిర్మాణం చేపట్టి 'ఆంధ్రా టాకీస్' సంస్థను ప్రారంభించాడు. నక్సల్ సమస్యను అద్భుతమైన భావోద్వేగాలతో రంగరించి చిత్రీకరంచిన సింధూరం అనే సినిమా విమర్శకుల ప్రశంసలు పొందినా, ఆర్థికంగా క్రుంగదీసింది. ఆ సినిమా కోసం చేసిన అప్పులను తీర్చడానికి సముద్రం లాంటి సినిమాలను తీసినట్టు స్వయంగా అతనే ఇంటర్వ్యూలలో చెప్పాడు.
చిత్రాలు మార్చు
సంవత్సరం | చిత్రం | నటీనటులు | విశేషాలు |
---|---|---|---|
1995 | గులాబి | జె. డి. చక్రవర్తి, మహేశ్వరి, బ్రహ్మాజీ | |
1996 | నిన్నే పెళ్ళాడుతా | అక్కినేని నాగార్జున, టబు | నంది ఉత్తమ దర్శకులు పురస్కారం, దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు పురస్కారం |
1997 | సింధూరం | రవితేజ, సంఘవి, బ్రహ్మాజీ | దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు పురస్కారం |
1998 | చంద్రలేఖ | అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, ఇషా కొప్పికర్ | |
1998 | అంతఃపురం | సాయి కుమార్, సౌందర్య, ప్రకాష్ రాజ్, జగపతి బాబు | దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు పురస్కారం |
1999 | సముద్రం | జగపతి బాబు, సాక్షి శివానంద్ | |
2001 | మురారి | ఘట్టమనేని మహేశ్ బాబు, సొనాలి బింద్రే | |
2002 | శక్తి | సంజయ్ కపూర్, కరిష్మా కపూర్, నానా పటేకర్, షారుఖ్ ఖాన్ | హిందీ చిత్రం |
2002 | ఖడ్గం | శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, రవితేజ, సొనాలి బింద్రే, కిమ్ శర్మ, సంగీత | నంది ఉత్తమ దర్శకులు పురస్కారం, దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు పురస్కారం |
2004 | శ్రీఆంజనేయం | నితిన్, ఛార్మీ, అర్జున్ సర్జా | |
2005 | చక్రం | ప్రభాస్, ఆసిన్, ఛార్మీ | నంది ఉత్తమ దర్శకులు పురస్కారం |
2005 | డేంజర్ | అల్లరి నరేష్, సాయిరాం శంకర్, అభిషేక్, స్వాతి, షిరీన్ | |
2006 | రాఖీ | జూనియర్ ఎన్.టి.ఆర్., ఇలియానా, చార్మి | |
2007 | చందమామ | నవదీప్, శివబాలాజీ, కాజల్ అగర్వాల్, సింధు మీనన్ | నంది ఉత్తమ దర్శకులు పురస్కారం |
2009 | శశిరేఖా పరిణయం | తరుణ్ కుమార్, జెనీలియా | |
2009 | మహాత్మ | శ్రీకాంత్, భావన | |
2011 | మొగుడు | తొట్టెంపూడి గోపీచంద్, తాప్సీ, శ్రద్దా దాస్ | |
2014 | పైసా | నానీ, కేథరీన్ థెరీసా, సిద్ధికా శర్మ | |
2014 | గోవిందుడు అందరివాడేలే | రాం చరణ్ తేజ, శ్రీకాంత్, కాజల్ అగర్వాల్, కమలినీ ముఖర్జీ | |
2017 | నక్షత్రం (సినిమా) | సందీప్ కిషన్, రెజీనా , సాయి ధరమ్ తేజ్ , ప్రగ్యా జైస్వాల్, ప్రకాష్ రాజ్ | |
2023 | రంగమర్తాండ | ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక |