శాలీ క్రిస్టెన్ రైడ్ ( 1951 మే 26   - 2012 జూలై 23) అమెరికన్ వ్యోమగామి, భౌతిక శాస్త్రవేత్త. లాస్ ఏంజిల్స్‌లో జన్మించిన ఆమె 1978 లో నాసాలో చేరి 1983 లో అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి అమెరికన్ మహిళగా అవతరించింది. యుఎస్ఎస్ఆర్ కాస్మోనాట్లైన వాలెంతినా తెరిష్కోవా (1963), స్వెత్లానా సావిట్స్కయా (1982) తరువాత అంతరిక్షంలోకి వెళ్ళిన మూడవ మహిళ, రైడ్. ఆమె 32 ఏళ్ళ వయసులో అంతరిక్షం లోకి వెళ్ళింది. అంతరిక్షంలోకి వెళ్ళిన అతి పిన్న వయస్కులైన అమెరికన్ వ్యోమగామి, రైడ్. [1] ఆర్బిటర్ ఛాలెంజర్‌లో రెండుసార్లు ఎగిరిన తరువాత, ఆమె 1987 లో నాసా నుండి తప్పుకుంది.

శాలీ రైడ్
శాలీ క్రిస్టిన్ రైడ్, 1984 లో
జననం
శాలీ క్రిస్టిన్ రైడ్

(1951-05-26)1951 మే 26
కాలిఫోర్నియా.
మరణం2012 జూలై 23(2012-07-23) (వయసు 61)
లా జోలా, కాలిఫోర్నియా
మరణ కారణంపాంక్రియాటిక్ క్యాన్సరు
జాతీయతఅమెరికన్
విద్య
  • BS Physics / BA English – Stanford University
  • MS Physics – Stanford University
  • Ph.D. Physics – Stanford University
వృత్తిPhysicist
జీవిత భాగస్వామిస్టీవెన్ హాలీ
(m. 1982–1987; divorced)
భాగస్వామిట్యామ్ ఓ'షానెస్సీ
(1985–2012; శాలీ మరణం)
తల్లిదండ్రులు
  • Dale Burdell Ride
  • Carol Joyce (née Anderson)
బంధువులుకరేన్ "బేర్" రైడ్ (చెల్లెలు)
స్థితిDeceased
అంతరిక్ష జీవితం
NASA astronaut
అంతరిక్షంలో గడిపిన కాలం
14d 07h 46m
ఎంపిక1978 NASA Group
అంతరిక్ష నౌకలుSTS-7, STS-41-G
అంతరిక్ష నౌకల చిత్రాలు
పదవీవిరమణAugust 15, 1987

రైడ్ రెండు సంవత్సరాలు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం యొక్క ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అండ్ ఆర్మ్స్ కంట్రోల్ లో పనిచేసింది. తరువాత కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, శాన్ డియాగోలో భౌతికశాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేసింది. ప్రధానంగా నాన్ లీనియర్ ఆప్టిక్స్, థామ్సన్ స్కాటరింగ్ పై ఆమె పరిశోధన చేసింది. ఛాలెంజర్, కొలంబియా అంతరిక్ష నౌక విపత్తులను పరిశోధించిన కమిటీలలో ఆమె పనిచేసింది. ఈ రెండింటి లోనూ పాల్గొన్న ఏకైక వ్యక్తి, ఆమె. [2] [3] ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో 2012 జూలై 23 న రైడ్ మరణించింది.

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

డేల్ బర్డెల్ రైడ్, కరోల్ జాయిస్ రైడ్ ల తొలి సంతానమైన శాలీ రైడ్ లాస్ ఏంజిల్స్‌లో జన్మించింది. ఆమెకు ఒక తోబుట్టువు, కరెన్ "బేర్" రైడ్, ప్రెస్బైటేరియన్ మంత్రి. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రెస్బిటేరియన్ చర్చిలో పెద్దలు. నార్వేజియన్ సంతతికి చెందిన రైడ్ తల్లి, మహిళల సంస్కరణ కేంద్రంలో స్వచ్ఛంద సలహాదారుగా పనిచేసింది. [4] ఆమె తండ్రి శాంటా మోనికా కాలేజీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్. [2]

రైడ్ పోర్టోలా జూనియర్ హై (ఇప్పుడు పోర్టోలా మిడిల్ స్కూల్ ) స్కూలులోను, తరువాత బర్మింగ్‌హామ్ హైస్కూల్‌ లోనూ చదివింది. లాస్ ఏంజిల్స్‌లోని ప్రైవేట్ వెస్ట్‌లేక్ స్కూల్ ఫర్ గర్ల్స్ నుండి స్కాలర్‌షిప్పుతో పట్టభద్రురాలైంది. [2] సైన్స్ పట్ల ఆసక్తి గల రైడ్, జాతీయ స్థాయిలో టెన్నిస్ క్రీడాకారిణి కూడా. రైడ్ మూడు సెమిస్టర్ల కోసం స్వార్త్‌మోర్ కాలేజీలో చదివి, లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ కోర్సు చదివింది. ఆపై స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో జూనియర్‌గా ప్రవేశించింది. ఇంగ్లీషు, భౌతిక శాస్త్రాల్లో బ్యాచిలర్ డిగ్రీ పొందింది. స్టాన్ఫోర్డ్‌లో 1975 లో మాస్టర్స్ డిగ్రీ పొందింది. ఇంటర్స్టెల్లార్ మాధ్యమంతో ఎక్స్-కిరణాల పరస్పర చర్యపై పరిశోధన చేస్తూ1978 లో భౌతికశాస్త్రంలో పిహెచ్డి సంపాదించింది. [5] ఆస్ట్రోఫిజిక్స్, ఫ్రీ ఎలక్ట్రాన్ లేజర్స్ ఆమె అధ్యయన క్షేత్రాలు. [6]

నాసాలో

మార్చు

1978 లో నాసా వ్యోమగామి గ్రూప్ 8 లో భాగంగా రైడ్‌ను వ్యోమగామిగా ఎంపిక చేశారు. మహిళలను ఎంపిక చేసిన మొట్టమొదటి తరగతి అది. స్టాన్ఫోర్డ్ విద్యార్థుల పత్రికలో ఒక ప్రకటన చూసిన ఆమె దరఖాస్తు చేసుకుంది. మొత్తం 8000 దరఖాస్తులు రాగా ఎంపికైన 35 మందిలో ఆమె ఒకరు. [7] 1979 లో శిక్షణ పొందిన తరువాత, మిషన్ స్పెషలిస్ట్‌గా పనిచేయడానికి అర్హత సాధించిన ఆమె రెండవ, మూడవ అంతరిక్ష నౌక విమానాలకు గ్రౌండ్-బేస్డ్ క్యాప్సూల్ కమ్యూనికేటరు (క్యాప్‌కామ్) గా పనిచేసింది. స్పేస్ షటిల్ యొక్క " కెనడార్మ్ " రోబోట్ ఆర్మ్‌ను అభివృద్ధి చేయడంలో ఆమె సహాయపడింది. [8] [9]

ఆమె మహిళ కావడంతో మీడియా దృష్టి ఆమెపై పడింది. ఆమె మొట్టమొదటి అంతరిక్ష ప్రయాణానికి ముందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆమెను, "ఫ్లైట్ మీ పునరుత్పత్తి అవయవాలను ప్రభావితం చేస్తుందా?", "ఉద్యోగంలో ఏదైనా పొరపాటు జరిగితే మీరు ఏడుస్తారా?" వంటి ప్రశ్నలు అడిగారు. ఆమె మాత్రం, వాటిని పట్టించుకోలేదు. మిషన్ యొక్క చారిత్రక ప్రాముఖ్యత ఉన్నప్పటికీ, రైడ్ తనను తాను ఒక వ్యోమగామిగానే పరిగణించింది. [8]

తొలి అంతరిక్ష యాత్ర

మార్చు
1983 జూన్ 18 న స్పేస్ షటిల్ ఛాలెంజర్‌లో ఆమె అంతరిక్షం లోకి వెళ్ళింది. అంతరిక్షంలో ప్రయాణించిన మొట్టమొదటి అమెరికన్ మహిళగా అవతరించింది. రెండు కమ్యూనికేషన్ ఉపగ్రహాలను, మొదటి షటిల్ ప్యాలెట్ ఉపగ్రహాన్నీ (SPAS-1) మోహరించడం, కార్గో బేలో ప్రయోగాలు చేయడం, TDRS ఉపగ్రహాన్ని పరీక్షించడం ఈ మిషన్ యొక్క ఉద్దేశం. SPAS-1 ను విజయవంతంగా మోహరించి, ప్రయోగాలు చేయించి, తరువాత వెనక్కి తీసుకుకొని తిరిగి భూమికి తీసుకువచ్చారు. 

SPAS-1 ని అంతరిక్షంలో ప్రతిక్షేపించడానికి, తిరిగి వెనక్కి తీసుకోవడానికీ రోబోటిక్ చేతిని ఆపరేట్ చేయడం రైడ్ పనిలో భాగం. [10]

రెండవ యాత్ర

మార్చు

ఆమె రెండవ అంతరిక్ష యాత్ర 1984 లో ఛాలెంజర్ లోనే జరిగింది. ఆమె మొత్తం 343 గంటలకు పైగా అంతరిక్షంలో గడిపింది.

వ్యక్తిగతం

మార్చు

న వ్యక్తిగత జీవితం గురించి రైడ్ చాలా గోప్యంగా ఉండేది. 1982 లో, ఆమె తోటి నాసా వ్యోమగామి స్టీవ్ హాలీని వివాహం చేసుకుంది. వారు 1987 లో విడాకులు తీసుకున్నారు. [11]

రైడ్ మరణం తరువాత, శాన్ డియాగో స్టేట్ యూనివర్శిటీలో మనస్తత్వశాస్త్రం ప్రొఫెసర్ ఎమెరిటా అయిన టామ్ ఓ షాగ్నెస్సీ ఆమెకు 27 సంవత్సరాలుగా భాగస్వామి అని తేలింది, ఇద్దరూ టెన్నిస్ ఆటగాళ్ళుగా ఉన్నప్పుడు కలుసుకున్నారు. [12] ఓ షాగ్నెస్సీ సైన్స్ రచయిత్రి. వీళ్ళిద్దరూ కలిసి శాలీ రైడ్ సైన్స్ అనే సంస్థను స్థాపించారు. [13] [14] దానిలో ఓ'షౌగ్నెస్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగాను, శాలీ రైడ్ సైన్స్ బోర్డు చైర్‌గానూ పనిచేశారు. వారు కలిసి ఆరు పిల్లల సైన్స్ పుస్తకాలు రాశారు. [15] వారి సంబంధాన్ని సంస్థ వెల్లడించింది. దాన్ని ఆమె సోదరి ధ్రువీకరించింది. తన అనారోగ్యం, చికిత్సలతో సహా తన వ్యక్తిగత జీవితాన్ని శాలీ గోప్యంగా ఉంచుకునేదని ఆమె చెప్పింది. [16] [17] శాలీ రైడ్ మొట్టమొదటి ఎల్‌జిబిటి వ్యోమగామి. [18] [19]

మూలాలు

మార్చు
  1. "10 fascinating things about Astronaut Sally Ride you must know". news.biharprabha.com. May 26, 2015. Archived from the original on 2015-05-26. Retrieved May 26, 2015.
  2. 2.0 2.1 2.2 Grady, Denise (July 23, 2012). "Obituary: American Woman Who Shattered Space Ceiling". The New York Times. Archived from the original on July 26, 2012. Retrieved July 27, 2012.
  3. See Rogers Commission Report and Columbia Accident Investigation Board
  4. https://www.nbcnews.com/science/science-news/why-sally-ride-waited-until-her-death-tell-world-she-f908942
  5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ride1 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  6. Knapp, Alex (July 23, 2012). "Sally Ride, First American Woman In Space, Dead At 61". Forbes. Business Source Elite.
  7. "Dr. Sally Ride". NASA.
  8. 8.0 8.1 "A Ride in Space – NASA, Sally Ride".
  9. "Sally Ride (1951-2012)".
  10. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ride12 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  11. Garcia, Guy D.; Thigpen, David E. (June 8, 1987). "People: June 8, 1987". Time. Archived from the original on July 27, 2012. Retrieved July 27, 2012.
  12. "Sally Ride, First American Woman In Space, Revealed To Have Female Partner Of 27 Years". The Huffington Post. July 23, 2012. Archived from the original on July 27, 2012. Retrieved July 27, 2012.
  13. Grady, Denise (July 23, 2012). "Sally Ride, Trailblazing Astronaut, Dies at 61". The New York Times. Archived from the original on July 27, 2012. Retrieved July 27, 2012.
  14. Tam O'Shaughnessy biography on the Sally Ride Science website Archived ఆగస్టు 19, 2016 at the Wayback Machine. Retrieved December 11, 2016.
  15. Mission: Planet Earth is two books, making the total five.
  16. Abdill, Rich (July 23, 2012). "Sally Ride Revealed to Be Gay: Her Sister, on Ride's Life, Death, and Desires for Privacy". The New Times Broward-Palm Beach. Archived from the original on 2012-07-28. Retrieved July 27, 2012.
  17. Adams Sheets, Connor (July 23, 2012). "Tam O'Shaughnessy: About Sally Ride's Partner Of 27 Years". The International Business Times. Archived from the original on July 26, 2012. Retrieved July 27, 2012.
  18. Garofoli, Joe (July 25, 2012). "Sally Ride never hid, was 'just private'". San Francisco Chronicle: SFGate. Archived from the original on October 14, 2012. Retrieved October 29, 2012.
  19. "Ernie Banks Was the First Black Player to Sign with the Chicago Cubs". Chicago, Illinois: North Star News. August 13, 2013. Archived from the original on February 3, 2015. Retrieved November 29, 2014.
"https://te.wikipedia.org/w/index.php?title=శాలీ_రైడ్&oldid=3858401" నుండి వెలికితీశారు