శివకృష్ణ దేవాలయం (సింగపూర్)
శివకృష్ణ దేవాలయం, సింగపూరులోని హిందూ దేవాలయం. ఈ దేవాలయంలో విష్ణువు, శివుడు ప్రధాన దేవుళ్ళు కాగా ఇతర దేవతలు కూడా కొలువై ఉన్నారు.[1]
శివకృష్ణ దేవాలయం (సింగపూర్) | |
---|---|
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 1°26′23.58″N 103°46′46.59″E / 1.4398833°N 103.7796083°E |
దేశం | సింగపూర్ |
ప్రదేశం | 31 మార్సిలింగ్ రైజ్, సింగపూర్ 739127 |
సంస్కృతి | |
దైవం | శివుడు, శ్రీకృష్ణుడు |
వాస్తుశైలి | |
నిర్మాణ శైలులు | ద్రవీడియన్ శైలీ |
చరిత్ర, నిర్వహణ | |
నిర్మించిన తేదీ | 1962 |
సృష్టికర్త | కుంజుకృష్ణన్ |
వెబ్సైట్ | వెబ్సైటు |
చరిత్ర
మార్చు1962లో కుంజుకృష్ణన్ అనే ప్రవాస భారతీయుడు సెంబావాంగ్ రోడ్లోని ఒక ప్రదేశంలో దేవతలను ప్రతిష్ఠింపజేసి, పూజలు చేసేవాడు. కొంతమంది టాక్సీ డ్రైవర్లు విశ్రాంతి కోసం ఆ ప్రాంతంలో గుమిగూడేవారు. కుంజుకృష్ణన్ మరణానంతరం, వేలాయుతం అనే వ్యక్తి ఆ ప్రాంతంలో మరికొంతమంది దేవతలను ప్రతిష్ఠింపజేవాడు. కొంతకాలం తరువాత దేవాలయానికి "శ్రీ శివ-కృష్ణ దేవాలయం" అని పేరు పెట్టారు.
1982లో, మార్సిలింగ్ రైజ్ వద్ద ఉన్న ప్రస్తుత ప్రదేశానికి దేవాలయం మార్చబడింది. ఇక్కడి భూమి వైశాల్యం దాదాపు 25000 చదరపు అడుగులు. 1982 నుండి 1987 వరకు వివిధ కమిటీలు దేవాలయ సంరక్షణను చేపట్టాయి.
1987లో కొత్త కమిటీ దేవాలయ బాధ్యతలు స్వీకరించిన వెంటనే శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించింది. 1987 డిసెంబరు 9న "దేవాలయ శంకుస్థాపన" కార్యక్రమం జరిగింది, ఆ తర్వాత దేవాలయ నిర్మాణం జరిగింది. 1996 సెప్టెంబరు 1న దేవాలయ మొదటి సంప్రోక్షణ కార్యక్రమం జరిగింది. 2008 మార్చి 23న[2] దేవాలయ రెండవ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది.
దేవాలయ దేవతలు
మార్చుదేవాలయంలో ఈ కింది దేవతామూర్తులు ఉన్నారు.[1]
- వినాయకుడు
- శివ-కృష్ణ (ప్రధాన దైవం)
- మురుగన్
- దుర్గ, శ్రీలక్ష్మి, సరస్వతి
- రాముడు, సీత, లక్ష్మణుడు
- ఆంజనేయడు
- అయ్యప్ప
- మరియమ్మ
- పెరియాచి
- ఇడుంబర్
- నాగమ్మ
- దక్షిణామూర్తి
- విశ్వనాథడు, విశాలాక్షి
- నందీశ్వరుడు
- కరుప్పరడు
- మునీశ్వరుడు
- మదురై వీరనుడు
- బైరవుడు
- చండికేశ్వరుడు
- నవగ్రహాలు
సామాజిక కార్యకలాపాలు
మార్చుఇక్కడ సామాజిక, విద్యా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతాయి. పూజలు, హోమాలు జరుగుతాయి.[3]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Archived copy". Archived from the original on 2012-04-18. Retrieved 2022-05-16.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Archived copy". Archived from the original on 2012-04-18. Retrieved 2022-05-16.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Archived copy". Archived from the original on 2012-04-18. Retrieved 2022-05-16.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)