శివాంగి కృష్ణకుమార్
శివాంగి కృష్ణకుమార్ (జననం 2000 మే 25) భారతీయ సినిమా నటి, నేపథ్య గాయని.[1] ఆమె టెలివిజన్ వ్యాఖ్యాత కూడా.[2] 2019లో, ఆమె స్టార్ విజయ్‌లో ప్రసారమైన సూపర్ సింగర్ 7 పాటల పోటీలో పాల్గొంది. 2020లో, ఆమె కామెడీ వంట షో అయిన కుకు విత్ కోమాలిలో పాల్గొంది. దీంతో ఆమె ప్రజాదరణ పొందింది.[3] ఆమె కలైమామణి విజేతలైన కె కృష్ణకుమార్, బిన్ని కృష్ణకుమార్ ల కుమార్తె.[4] ఆమె డాన్ (2022), నాయి శేఖర్ రిటర్న్స్ (2022), కాసేతన్ కడవులాడా (2023) వంటి చిత్రాలలో నటించింది.[5]
శివాంగి కృష్ణకుమార్ | |
---|---|
జననం | త్రివేండ్రం, కేరళ, భారతదేశం | 2000 మే 25
విద్య | ఎం.ఒ.పి. వైష్ణవ్ కాలేజ్ ఫర్ ఉమెన్, చెన్నై |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2019–ప్రస్తుతం |
తల్లిదండ్రులు | కె కృష్ణకుమార్, బిన్ని కృష్ణకుమార్ |
ఆమె 2009లో తమిళ చిత్రం పసంగలో "అన్బాలే అజగాగుం" పాటతో గాయనిగా అరంగేట్రం చేసింది.[6][7][8] ఆమె సినీ పరిశ్రమలో డాన్ చిత్రంలో సహాయక పాత్రతో నటిగా అడుగుపెట్టింది.[9][10] ఆ తర్వాత ఆమె నాయి శేఖర్ రిటర్న్స్ చిత్రంలో నటుడు వడివేలు సరసన సహాయ పాత్రలో నటించింది.[11][12][13]
తెలుగు చిత్రం అల్లంత దూరాన (2023)లో రెక్కలు తొడిగి.. పాటను ఆమె ఆలపించింది. అలాగే 2021లో ధరన్ కుమార్ కంపోజ్ చేసిన అస్కు మారో.. అనే పాటను ఆమె పాడగా సోనీ మ్యూజిక్ విడుదలచేసింది.
బాల్యం, విద్యాభ్యాసం
మార్చుకేరళలోని త్రివేండ్రంలో 2000 మే 25న శివాంగి జన్మించింది. ఆమె తండ్రి కృష్ణకుమార్ తమిళ గాయకుడు, సంగీత విద్వాంసుడు. కాగా ఆమె తల్లి బిన్ని కృష్ణకుమార్ మలయాళీ నేపథ్య గాయని. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ కలైమామణి అవార్డు గ్రహీతలు. ఆమెకు వినాయక్ సుందర్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. శివాంగి పుట్టిన తర్వాత వారు తమిళనాడులోని చెన్నైకి మకాం మర్చారు. ఆమె చెన్నైలోని విరుగంబాక్కంలోని చిన్మయ విద్యాలయంలో పాఠశాల విద్యను అభ్యసించింది. తర్వాత ఆమె ఎం.ఒ.పి. వైష్ణవ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుంచి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది.[14].కాలేజీ రోజుల్లోనే ఆమె సంగీత రంగంలోకి అడుగుపెట్టింది.[15]
కెరీర్
మార్చు2019లో, శివాంగి కృష్ణకుమార్ స్టార్ విజయ్‌లో ప్రసారమైన భారతీయ తమిళ భాష రియాలిటీ టెలివిజన్ షో సూపర్ సింగర్ 7లో పోటీదారుగా ఉంది.[16][17]
ఆమె తర్వాత స్టార్ విజయ్‌లో ప్రసారమైన కుకు విత్ కోమాలి అనే కామెడీ వంట షోని హోస్ట్ చేసింది.[18] ఈ షో ఆమెకు మంచి గుర్తింపుతో పాటు పలు ప్రశంసలు కురిపించింది. అంతేకాకుండా ఆమె బ్లాక్‌షీప్ డిజిటల్ అవార్డ్స్ ద్వారా ది ఎంటర్‌టైనింగ్ స్టార్ ఫిమేల్, బిహైండ్‌వుడ్స్ గోల్డ్ ఐకాన్స్ ద్వారా రియాలిటీ టెలివిజన్‌లో మోస్ట్ పాపులర్ ఫిమేల్ పురస్కారాలు అందుకుంది. ఆమె విజయ్ టెలివిజన్ అవార్డ్స్‌లో ట్రెండింగ్ పెయిర్ ఆఫ్ ది ఇయర్ (అశ్విన్ కుమార్ లక్ష్మీకాంతన్‌తో పాటు) అవార్డును కూడా గెలుచుకుంది.[19]
2020లో, ఆమె కామెడీ వెబ్ సిరీస్ డియర్-యు బ్రదర్-యులో తన నటనను ప్రారంభించింది, ఇది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.[20][21]
2021లో, శివాంగి ధరన్ కుమార్‌తో కలిసి "అస్కు మారో" పాటను పాడింది, ఇందులో ఆమె అతిధి పాత్రలో కూడా కనిపించింది. తర్వాత మే 2021లో, ఆమె మురుంగక్కై చిప్స్ సినిమా కోసం సామ్ విశాల్‌తో కలిసి "తాల్కు లెస్సు వర్కు మోరు" పాడింది. ఆమె ఆ తర్వాత 2021లో ఓనం స్పెషల్‌గా విడుదలైన 'అడిపోలి' పాటను వినీత్ శ్రీనివాస్‌తో కలిసి పాడింది.[22]
నవంబరు 2021లో, మీడియా మేసన్స్ దాని 3వ అసలైన 'నో నో నో నో నో'ను విడుదల చేసింది. ఈ పాటను శివాంగి పాడగా, ర్యాప్ పోర్షన్‌లు కెజె అయ్యనార్ అందించాడు.[23]
పి.ఎస్ అశ్విన్ సంగీత స్వరకల్పనలో శివాంగి "అంధపురా అన్నకిలి దా", సిద్ధు కుమార్ సంగీత స్వరకల్పనలో జి. వి. ప్రకాష్‌తో కలిసి "నీ యెన్ ఉసురు పుల్ల" ఆలపించింది. ఆ తర్వాత ఆమె ఎన్నా సొల్ల పొగరై చిత్రం కోసం "ఉరుట్టు", "నీతానాడ" అనే రెండు పాటలను పాడింది. ఆమె వేలన్ చిత్రం కోసం నటుడు ముగెన్ రావుతో కలిసి "సత్యమా సొల్లురండి" పాటను కూడా పాడింది. ఆమె తమిళం, మలయాళం రెండింటిలోనూ విడుదలైన "సాయా" అనే మెలోడీ పాటను పాడింది.
కుక్కు విత్ కోమాలిలో ప్రజాదరణ పొందిన తర్వాత, ఆమె తమిళ చిత్రం డాన్‌లో నటించింది.[24][25][26][27] ఆమె నటుడు వడివేలుతో కలిసి నాయి శేఖర్ రిటర్న్స్ చిత్రంలో కూడా నటించింది.[28][29] కాసేతన్ కడవులాడా చిత్రంలో ఆమె శివ, ప్రియా ఆనంద్‌లతో కలిసి నటించింది.[30]
2022లో సినమ్ చిత్రంలో "నెంజెల్లం" పాట పాడింది.[31] ఆమె శివాంగి కృష్ణకుమార్ అనే యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతోంది.[32]
మూలాలు
మార్చు- ↑ Happy 22 to Me - Birthday Celebration '22 - Sivaangi Krishnakumar - Tamil Vlogs. Retrieved 8 August 2022 – via YouTube.
- ↑ "Cooku with Comalis 2 fame Sivaangi Krish looks cute as a button in these throwback pictures from her childhood; take a look". The Times of India. Retrieved 9 August 2022.
- ↑ "Sivaangi: Blessed to have gotten the opportunity to work during lockdown". The Times of India. Retrieved 8 August 2022.
- ↑ "'From 65 Kg to...': Sivaangi Krishnakumar Shares her Inspiring Weight Loss Journey". news18.com. Retrieved 2 March 2022.
- ↑ "Sivaangi teams up with Asuran actor Teejay Arunasalam". The Times of India. Retrieved 8 August 2022.
- ↑ "Watch: Sivaangi and Vineeth's Tamil track 'Adipoli' recreates Onam celebrations". thenewsminute.com. Retrieved 22 August 2021.
- ↑ "Sivaangi Krishnakumar to Take Part in Concert With Singer Shri. Mano. Details Inside". news18.com. Retrieved 7 April 2022.
- ↑ "Check Out Latest Malayalam Song Official Lyrical Video - 'Saaya' Sung By Sivaangi Krishnakumar And Mithun Eshwar". The Times of India. Retrieved 27 March 2022.
- ↑ "Cooku With Comali 2 Fame Sivaangi Krish Meets Vijay after Don film success, Shares Picture". news18.com. Retrieved 27 April 2022.
- ↑ "Sivaangi Krishnakumar To Sing For Don, Sivakarthikeyan Keeps His Promise Made On The Reality Show Super Singer". spotboye.com. Retrieved 16 February 2021.
- ↑ "Meet the cast of Vadivelu starrer 'Nai Sekar Returns' featuring blockbuster stars such as Sivaangi Krishnakumar and Redin Kingsley". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-06-09.
- ↑ "RJ Vijay and Sivaangi talk about their experience working in 'Don'". The Times of India. Retrieved 8 August 2022.
- ↑ "Sivaangi off to Mysore with Naai Sekar Returns co-actors Vadivelu, Redin Kisngley and Shivani Narayanan". The Times of India. Retrieved 8 August 2022.
- ↑ "Sivaangi Krishnakumar (Shivangi) Age, College, Biography, Wiki, Images" (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-01-02. Retrieved 2022-01-31.
- ↑ "'Cooku With Comali' Shivaangi was a premature baby - Exclusive video interview". indiaglitz. Retrieved 8 March 2021.
- ↑ "கொளுத்துங்கடா beat-அ".. Anchor-ஆகும் நம்ம சிவாங்கி!!.. அனல் தெறிக்கவிடும் Post!. tamil.behindwoods.com (in తమిళము). Retrieved 8 August 2022.
- ↑ "Shivangi – Super Singer". behindtalkies.com. Retrieved 8 August 2022.
- ↑ Sunder, Gautam (11 February 2021). "Cooku with Comali's Pugazh and Sivaangi: On the show's popularity and their friendship". The Hindu (in ఇంగ్లీష్).
- ↑ "Ashwin and Sivaangi open up about the morphed video thats going viral". indiaglitz.com. Retrieved 8 August 2022.
- ↑ "Sivaangi Lost Her Cool After Being Called As "Cringe" By A Netizen!!". chennaimemes.in. Archived from the original on 6 నవంబరు 2022. Retrieved 8 August 2022.
- ↑ ""It's Official" - Sivaangi Shares An Exciting News With Her Fans!". astroulagam.com.my. Retrieved 8 August 2022.
- ↑ "Adipoli Song: Ashwin Sivaangi's Adipoli Tamil Onam Song Hits The Trend". newsbricks.com. 21 August 2021. Retrieved 22 August 2021.
- ↑ "Desirable women on TV 2020". indiaglitz.com. Retrieved 2021-06-20.
- ↑ "Sivakarthikeyan's 'Don' team celebrate the film's success". The Times of India. Retrieved 9 August 2022.
- ↑ "Sivakarthikeyan keeps up his promise by roping in Shivangi for 'Don'". The Times of India (in ఇంగ్లీష్). 11 February 2021.
- ↑ "Feel lucky to be making my acting debut with Don, says Sivaangi". The Times of India. Retrieved 8 August 2022.
- ↑ Sivangi Speech in Don : பாட சொன்ன எஸ்.ஜே சூர்யா..Bae பாடலை பாடிய சிவாங்கி. tamil.abplive.com (in తమిళము). Retrieved 8 August 2022.
- ↑ "Sivaangi on three years of being in the industry". The Times of India. Retrieved 14 May 2022.
- ↑ "Sivaangi has a fan moment with Thalapathy Vijay". The Times of India. Retrieved 14 May 2022.
- ↑ "'Kasethan Kadavulada' trailer promises a complete comedy entertainer". The Times of India. Retrieved 8 August 2022.
- ↑ "Sinam:Sivaangi breaks records for Sinam once again starring Arun Vijay". moviecrow.com. Retrieved 8 August 2022.
- ↑ "Sivaangi Krishnakumar Turns RJ Sivaangi; Details Inside". news18.com. Retrieved 26 March 2022.