శివ పుత్రుడు
శివ పుత్రుడు, 2004 ఏప్రిల్ 2న విడుదలైన తెలుగు అనువాద సినిమా.[1] బాలా రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రమ్, సూర్య, సంగీత, లైలా ప్రధాన పాత్రల్లో నటించగా, ఇళయరాజా సంగీతం అందించాడు. దీనికి బాలసుబ్రమణియం సినిమాటోగ్రఫీ, సాహిత్యం వనమాలి, నృత్యం బృంద, సురేష్ ఉర్స్ ఎడిటింగ్, స్టన్ శివ పోరాటాలు, ఎసి పిళ్ళై ఆర్ట్ డైరెక్షన్ విభాగాల్లో పనిచేశారు.[2] డి.జయకాంతన్ రాసిన నాంధవనాతిల్ ఒరు అండీ కథ ఆధారంగా ఇది రూపొందింది.[3]
శివ పుత్రుడు | |
---|---|
దర్శకత్వం | బాలా |
స్క్రీన్ ప్లే | బాలా |
దీనిపై ఆధారితం | డి.జయకాంతన్ రాసిన నాంధవనాతిల్ ఒరు అండీ కథ |
నిర్మాత | బి. సుబ్రహ్మణ్యం, వై. రూపేష్ |
తారాగణం | విక్రమ్ సూర్య సంగీత లైలా |
ఛాయాగ్రహణం | బాలసుబ్రమణియం |
కూర్పు | సురేష్ అర్స్ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | లక్ష్మీ గణపతి ఫిలింస్ |
విడుదల తేదీ | 2 ఏప్రిల్ 2004 |
సినిమా నిడివి | 158 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
దీనికి మూలమైన తమిళ సినిమా పితామగన్ 2003 అక్టోబరు 24న విడుదలైంది. ఇందులో విక్రమ్ నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ చిత్ర అవార్డు వచ్చింది. ఈ చిత్రం కన్నడలో అనాథారు (2007) గా రీమేక్ చేయబడింది. దీనిని బి 4 యు మూవీస్ సంస్థ ఇదే టైటిల్‌తో 2020లో హిందీలో అనువాదంచేసి విడుదల చేసింది.
నటవర్గం
మార్చు- విక్రమ్ (చితన్)
- సూర్య (శక్తి)
- సంగీత (మంజు)
- లైలా (గోమతి)
- మహదేవన్ (శేఖర్ వసుదేవన్, గంగ ప్రొడ్యూసర్)
- కరుణాస్ (కరువాయన్)
- మనోబాల (శక్తి మామ)
- రాజేంద్రన్ (జైలు వార్డెన్)
- గంజ కురుప్పు (గంజ కడుకి)
- రాంజీ (వాసు)
- టిపి గజేంద్రన్ (దర్శకుడు)
- సౌందర్
- ము. రామస్వామి
- స్టన్ శివ (పోలీస్ ఇన్సిపెక్టర్, అతిథి పాత్ర)
- సిమ్రాన్ (అతిథి పాత్ర)[4]
పాటలు
మార్చుUntitled | |
---|---|
ఈ సినిమాలోని పాటలను ఇళయరాజా స్వరపరిచాడు. సాహిత్యం వనమాలి రాశారు. "ఎవరిది ఎవరిది" పాట పంతురలి రాగంలో సెట్ చేయబడింది.[5]
ఈ చిత్రంలో అన్ని పాటలు రాసినవారు:
సం. | పాట | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "అదిగో అవినీతి" | విజయ్ యేసుదాస్, కోరస్ | 04:38 |
2. | "ప్రియతమా నిన్నే" (ఓల్డ్ సాంగ్స్ మెలోడి) | మురళి, లలితా సాగరి, కోరస్ | 06:39 |
3. | "చిరుగాలి వీచెనె" | ఆర్.పి. పట్నాయక్, సునీత ఉపద్రష్ట | 06:10 |
4. | "చిరుగాలి వీచెనె" (సోలో) | ఆర్.పి. పట్నాయక్ | 06:10 |
5. | "ఎవరిది ఎవరిది" | విజయ్ యేసుదాస్ | 01:58 |
6. | "ఒకటే జననం" | విజయ్ యేసుదాస్ | 04:41 |
మొత్తం నిడివి: | 30:16 |
అవార్డులు
మార్చుజాతీయ చలనచిత్ర అవార్డులు 2003
దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు
- ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ చిత్ర అవార్డు (తమిళం)
- ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు అవార్డు - బాలా
- ఫిలింఫేర్ ఉత్తమ నటుడు - విక్రమ్
- ఫిలింఫేర్ ఉత్తమ నటి - లైలా
- ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటుడి అవార్డు - సూర్య
- ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటి అవార్డు - సంగీత
తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు
సినీమా అవార్డులు
మూలాలు
మార్చు- ↑ "Siva Putrudu". idlebrain.com.
- ↑ S. R. Ashok Kumar (24 October 2003). "Variety fare for Deepavali". The Hindu. Archived from the original on 10 November 2003.
- ↑ "If I didn't come to movies, I would have died – Director Bala". 11 October 2012.
- ↑ "Suriya: Tamil stars play themselves on screen". The Times of India. 13 August 2013. Retrieved 22 January 2017.
- ↑ Mani, Charulatha (2011-09-30). "A Raga's Journey — Poignant Pantuvarali". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2018-12-16.
- ↑ "Telugu CineMaa Awards 2003". Idlebrain.com. Archived from the original on 25 May 2015. Retrieved 14 January 2015.