లైలా ఒక భారతీయ సినిమా నటి. ఈమె హిందీ, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషా చిత్రాలలో నటించింది[1].

లైలా
జననం (1980-10-24) 1980 అక్టోబరు 24 (వయసు 43)
వృత్తిభారతీయ చలనచిత్ర నటి
క్రియాశీలక సంవత్సరాలు1996 - 2006
2022 - ప్రస్తుతం
మతంక్రైస్తవ మతం
భార్య / భర్తమెహదీన్
పిల్లలు2

2022 మార్చి25న ఈ టీవీలో ప్రసారమైన ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోలో రోజా, ఆమనిలతో పాటు జడ్జ్ గా లైలా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది.[2]

సినిమా రంగం

మార్చు

ముంబయిలో నివసిస్తున్న లైలా మాడల్ వృత్తిని హాబీగా చేపట్టింది. ఈమె బాలీవుడ్ డైరెక్టర్ మెహమూద్ కంటిలో పడి దుష్మన్ దునియాకా చిత్రంలో తొలి అవకాశం చేజిక్కించుకుంది. తరువాత తెలుగు సినిమా దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి ఈమెను ఎగిరే పావురమా చిత్రంలో పరిచయం చేశాడు. ఆ తర్వాత ఈమె అనేక సినిమాలలో నటించింది. ఈమెకు 2001, 2003 సంవత్సరాలలో వరుసగా ఉత్తమ తమిళనటిగా ఫిలిం పేర్ అవార్డులు లభించాయి.

వ్యక్తిగత జీవితం

మార్చు

ఈమె గోవాకు చెందిన క్యాథలిక్ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. ఈమె ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడేవారు. ఈమె 1980 అక్టోబర్ 24న జన్మించింది. ఈమె 2006లో ఇరానీ వ్యాపారవేత్త మెహదిన్‌ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఫిల్మోగ్రఫీ

మార్చు
సంవత్సరం సినిమా పేరు పాత్ర భాష వివరాలు
1996 దుష్మన్ దునియాకా లత హిందీ
1997 ఎగిరే పావురమా తెలుగు
ఉగాది తెలుగు
పెళ్ళి చేసుకుందాం[3] లైలా తెలుగు
కెలొనా ఉర్దూ
ఈత ఒరు స్నేహగత హేమ మలయాళం
1998 ఖైదీగారు తెలుగు
పవిత్రప్రేమ డా.శకుంతలా దేవి తెలుగు
శుభలేఖలు తెలుగు
లవ్ స్టోరీ 1999 మీనా తెలుగు
1999 కలంగర్ ఆండాళ్ తమిళం
ముదల్వన్ శుభ తమిళం
నా హృదయంలో నిదురించే చెలీ తెలుగు
రోజావనం రోజా తమిళం
2000 పార్తెన్ రసితెన్ సారిక తమిళం
నువ్వే కావాలి తెలుగు అతిథి పాత్ర
దేవర మగ కన్నడ
2001 దీన చిత్ర తమిళం
దిల్ ఆశ తమిళం
అల్లి తంద వానం Divya తమిళం
నందా కల్యాణి తమిళం ఉత్తమ తమిళనటిగా ఫిలిం ఫేర్ అవార్డ్
కామరసు వాసంతి తమిళం
మూసా ఖాన్ ఉర్దూ
2002 ఉన్నై నినైతు నిర్మల తమిళం
మౌనం పెసియదె తమిళం
2003 త్రీ రోజెస్ నందూ తమిళం
పితామగన్ మంజూ తమిళం ఉత్తమ తమిళనటిగా ఫిలిం ఫేర్ అవార్డ్
ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్రప్రభుత్వ అవార్డ్
ITFA ఉత్తమ నటి అవార్డ్
వార్ అండ్ లవ్ సెరీనా మలయాళం
స్వప్నకూడు మలయాళం అతిథి పాత్ర
2004 గంభీరం విజయలక్ష్మి తమిళం
జయసూర్య బేబి తమిళం
రామకృష్ణ లక్ష్మీ విశ్వనాథ్ కన్నడ
మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి శైలజ తెలుగు
2005 ఉల్లమ్‌ కెట్కుమాయి పూజ తమిళం
కందనాళ్ మూదల్ రమ్య తమిళం
ఇన్సాన్ ఇందూ హిందీ
2006 పరమ శివన్ మలర్ తమిళం
తందెగె తక్క మగ పంచరంగి కన్నడ
తిరుపతి తమిళం అతిథి పాత్ర
మహాసముద్రం దేవి మలయాళం

మూలాలు

మార్చు
  1. ఎస్., సత్యబాబు (19 February 2012). "మాఘమాసం ఎప్పుడొస్తుందో! నిన్ను చూసి ఎన్నినాళ్లో..." సాక్షి ఫన్‌డే. Retrieved 19 March 2017.[permanent dead link]
  2. Namasthe Telangana (13 November 2022). "గ్రాండ్‌ రీఎంట్రీ.. పండుగ చేసుకుంటున్న పాతతరం అభిమానులు". Archived from the original on 13 November 2022. Retrieved 13 November 2022.
  3. తెలుగు ఫిల్మ్ నగర్, సినిమా (9 October 2019). "మ్యూజిక‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ 'పెళ్లి చేసుకుందాం'కు 22 ఏళ్ళు". www.thetelugufilmnagar.com. Prabhu. Archived from the original on 14 June 2020. Retrieved 15 June 2020.

బయటిలింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=లైలా_(నటి)&oldid=3723042" నుండి వెలికితీశారు