శుభప్రదం
కె. విశ్వనాథ్ దర్శకత్వంలో 2010లో వచ్చిన సినిమా శుభప్రదం. అల్లరి నరేష్, మంజరి ఫడ్నిస్ నటించారు.[1]
శుభప్రదం (2010 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె. విశ్వనాథ్ |
---|---|
నిర్మాణం | హరి గోపాలకృష్ణ పీలా నీల తిలక్ |
కథ | కె. విశ్వనాథ్ |
చిత్రానువాదం | కె. విశ్వనాథ్ |
తారాగణం | అల్లరి నరేష్ మంజరి ఫడ్నిస్ అనంత్ |
సంగీతం | మణిశర్మ |
ఛాయాగ్రహణం | వేణుగోపాల్ మడత్తిల్ |
విడుదల తేదీ | 2010 జూలై 16 |
భాష | తెలుగు |
కథ
మార్చుఇందూ ( మంజరి ఫడ్నిస్ ) సంగీతమంటే ఇష్టం. ఆమె తల్లి మలయాళీ, తండ్రి ( వైజాగ్ ప్రసాద్ ) తెలుగు. ఆమెకు ఇద్దరు బాబాయిలు ( అశోక్ కుమార్, గుండు సుదర్శన్ ). వీరి భార్యలు చెన్నై, కోల్‌కతాలకు చెందినవారు. ఆ విధంగా భారతదేశం మొత్తం ఆ కుటుంబంలో ఉంది. ఆమె తెలుగు, మలయాళం, బెంగాలీ, తమిళ భాషలు బాగా మాట్లాడగలదు. అనుకోకుండా ఆమె చక్రీ ( అల్లరి నరేష్ ) ని చూస్తుంది. అతడు మంచి గాయకుడు. కానీ ప్రొఫెషనల్ గాయకుడు కాదు. చక్రి ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతణ్ణి ప్రేమిస్తుంది. కానీ చక్రిది ఒక విచిత్రమైన వృత్తి. అది సినిమా సగంలో బయట పడుతుంది. అది, ఓ కొండ పైన ఉన్న గుడికి వెళ్ళే వృద్ధులను, వికలాంగులను వీపుపై ఎక్కించుకుని మోసుకు వెళ్ళడం.
ఇందూ తన జీవితాన్ని మార్చే సంఘటనలో ఒక ధనవంతుడి ( శరత్ బాబు ) కంటబడుతుంది. కథలోని ప్రధాన మలుపు అక్కడ కనిపిస్తుంది. ఆ ధనవంతుడు ఎవరు - అతనికి సింధు అనే మనవరాలు ఉంది. ఆమె అచ్చు ఇందు లాగానే ఉండేది. సింధు యాసిడ్ దాడిలో మరణిస్తుంది. అందువల్ల ఇందులో తన మనవరాలిని రూపాన్ని చూసు కుంటున్నాడు. తరువాత ఏమి జరుగుతుందనేది మిగతా సినిమా.
నటవర్గం
మార్చు- చక్రీగా అల్లారి నరేష్ [2]
- ఇందూ / సింధుగా మంజారి ఫడ్నిస్
- సింధు తాతగా శరత్ బాబు
- ఇందూ తండ్రిగా వైజాగ్ ప్రసాద్
- గిరి బాబు
- రఘు బాబు
- రల్లాపల్లి
- జెన్నీ
- అశోక్ కుమార్
- గుండు సుదర్శన్
- వమ్సీ చాగంటి
- దేవదాస్ కనకళ
- రమాప్రభ
పాటలు
మార్చుశుభప్రదం యొక్క ఆడియో 2010 జూన్ 20 న విడుదలైంది. నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కె రోశయ్య సిడిలను ఆవిష్కరించి ఎస్పీ బాలసుబ్రమణ్యానికి అందజేశాడు.[3] ఈ చిత్రంలో మణి శర్మ సంగీతం అందించాడు.[4]
క్రమసంఖ్య | పేరు | గాయనీ గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "తప్పట్లోయ్ తాళాలోయ్" | కె.ఎస్.చిత్ర | 4:14 | ||||||
2. | "మౌనమే చెబుతోంది" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ప్రణవి | 5:00 | ||||||
3. | "ఏలేలో ఏలేలో" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, శంకర్ మహదేవన్ | 5:57 | ||||||
4. | "నీ చూపే కడదాకా" | కార్తిక్, సునీత | 4:58 | ||||||
5. | "బైలేలే బైలేలే పల్లకి" | మల్లికార్జున్, విజయలక్ష్మి, మాళవిక | 4:14 | ||||||
6. | "ఓరిమి చాలమ్మా ఓ భూమాతా" | రీటా త్యాగరాజన్ | 5:16 | ||||||
7. | "అంబ పరాకు దేవీ పరాకు" | డి.ఎస్.వి. శాస్త్రి | 2:23 | ||||||
32:02 |
విడుదల
మార్చుఈ చిత్రం మంచి విజయాన్ని సాధించలేకపోయింది.[5]