శ్రియా రెడ్డి
శ్రియా రెడ్డి (జననం 28 నవంబరు 1983) దక్షిణభారత నటి. ఆమె ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించారు. యాంకర్, విజెగా పనిచేశారు. శ్రియా తండ్రి మాజీ క్రికెట్ క్రీడాకారుడు భరత్ రెడ్డి. సినిమాల్లో నటి కాకముందు ఎస్.ఎస్.మ్యూజిక్ అనే చానల్లో వీడియో జాకీగా పనిచేసేవారు శ్రియా. 2002లో సమురాయ్ అనే తమిళ సినిమాతో తెరంగేట్రం చేశారు ఆమె. ఆ తరువాత తమిళ్, తెలుగు, మలయాళం భాషల్లో అన్నీ కలిపి డజనుకు పైగా సినిమాల్లో నటించారు. ఆమె నటించిన బ్లాక్, తిమిరు, కాంచీవరం వంటి సినిమాల్లోని ఆమె నటన ప్రసిద్ధి చెందటమే కాక, విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి.
శ్రీయా రెడ్డి | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయుడు |
విద్యాసంస్థ | ఇతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్ |
వృత్తి | నటి, మోడల్, వీజె |
క్రియాశీల సంవత్సరాలు | 2002–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | విక్రమ్ కృష్ణ (m. 2008) |
పిల్లలు | 1 |
తల్లిదండ్రులు |
|
బంధువులు | విశాల్ కృష్ణ (బావ) జి. కె. రెడ్డి (మామ) |
తెలుగు సినిమాలు
మార్చు2003లో అప్పుడప్పుడు
2006లో అమ్మ చెప్పింది
నటించిన చిత్రాలు
మార్చుఆమె విక్రం సరసన నటించిన "సామురాయ్" అనే తమిళ చిత్రం అమె మొదటి సినిమా.ఆ తరువాత ఆమె అప్పుడప్పుడు అనే తెలుగు చిత్రంలో నటించింది. తరువాత "బ్లాక్" అనే మలయాళ చిత్రంలో నటించింది.
2002 సామురాయ్ -తమిళం
2003 అప్పుడప్పుడు -తెలుగు
2004 బ్లాక్ - మలయాళం
2004 19 రెవల్యుషన్స్ -మలయాళం
2005 భరత్ చంద్రన్ ఐ.పి.ఎస్.- మలయాళం
2006 అమ్మ చెప్పింది -తెలుగు
2006 ఒరాల్ - మలయాళం
2006 తిమిరు -తమిళం
2006 వెయిల్ -తమిళం
2007 పల్లికూడం -తమిళం
2008 కాంచివరం -తమిళం
2016 సిల సమయంగలిల్-తమిళం
2017 అండవ కానుమ్ - తమిళం
2022 సుడల్: ది వొర్టెక్స్
2023 సలార్ పార్ట్ 1