శ్రీకృష్ణ తులాభారం (1935 సినిమా)
1935 చిత్రం
శ్రీకృష్ణ తులాభారం 1935, ఏప్రిల్ 22న విడుదలైన తెలుగు చలనచిత్రం. సి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కపిలవాయి రామనాధశాస్త్రి, కాంచనమాల, లక్ష్మీరాజ్యం, రేలంగి వెంకట్రామయ్య, ఋష్యేంద్రమణి నటించారు. ఋషేంద్రమణి ఇందులో తొలిసారిగా సత్యభామగా నటించగా రేలంగికి ఇది తొలిచిత్రం. ఈ సినిమాను కలకత్తాలో చిత్రీకరించారు.[1] కాంచనమాల, లక్ష్మీరాజ్యంలకు కుడా ఇది తొలిచిత్రం.
శ్రీకృష్ణ తులాభారం (1935 తెలుగు సినిమా) | |
[[File:|220px]] | |
---|---|
తారాగణం | కపిలవాయి రామనాధశాస్త్రి, కాంచనమాల, లక్ష్మీరాజ్యం, రేలంగి వెంకట్రామయ్య, ఋష్యేంద్రమణి |
నిర్మాణ సంస్థ | మదన్ థియేటర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నటవర్గం
మార్చు- జై సింగ్ (శ్రీకృష్ణుడు)
- కపిలవాయి రామనాధశాస్త్రి (నారద)
- కాంచనమాల (మిత్రవింద)
- కాకినాడ జోగినాథం (వసంతక)
- గుంటూరు సభారంజని (రుక్మిణి)
- లక్ష్మీరాజ్యం (నళిని)
- రేలంగి వెంకట్రామయ్య (విధూషకుడు)[2]
- ఋష్యేంద్రమణి (సత్యభామ)
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: సి.పుల్లయ్య
- నిర్మాత: వై.వి.రావు
- నిర్మాణ సంస్థ: మదన్ థియేటర్స్
- పాటలు, పద్యాలు: చందాల కేశవదాసు, ముత్తరాజు సుబ్బారావు, స్థానం నరసింహారావు
పాటలు
మార్చుఈ సినిమాతో కేశవదాసు సినీ కవిగా ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. ఈ చిత్రంలో భలే మంచి చౌకబేరము,మునివరా తుదికిట్లు నానున్ మోసగింతువా, కొట్టు కొట్టండి బుర్ర పగలు గొట్టండి అనే మూడు పాటలు రాశాడు. వీటిలో భలే మంచి చౌకబేరము పాట బహుళ జనాదరణ పొందింది. ఈ మూడు పాటలను ఆ తరువాత మరో రెండుసార్లు శ్రీకృష్ణ తులాభారం (1955), శ్రీకృష్ణ తులాభారం (1966) నిర్మించినపుడు కూడా వాడుకున్నారు.[3]
మూలాలు
మార్చు- ↑ డైలీహంట్ (ఈనాడు), సినిమా (26 May 2020). "జనానికి ఇవేమీ అక్కర్లేదు". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 9 August 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 August 2019). "హాస్యానికి తొలి పద్మశ్రీ పొందిన రేలంగి". www.andhrajyothy.com. Archived from the original on 9 August 2020. Retrieved 9 August 2020.
- ↑ నవ తెలంగాణ, సోపతి (20 June 2015). "తెలుగు సినిమా వాచస్పతి చందాల కేశవదాసు". NavaTelangana. సిహెచ్. రమేష్‌బాబు. Archived from the original on 9 August 2020. Retrieved 9 August 2020.