శ్రీవారి చంద్రశేఖర్

శాస్త్రవేత్త

శ్రీవారి చంద్రశేఖర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త. ఈయన హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్-ఐఐసీటీ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) శాస్త్రవేత్త. డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ భారత జాతీయ సైన్స్ అకాడమీ (ఐఎన్‌ఎస్‌ఏ) ఫెలోషిప్‌నకు ఎంపికయ్యారు.రెండు దశాబ్దాలుగా ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో చేసిన సేవలకుగాను చంద్రశేఖర్‌ను ఈ ఫెలోషిప్‌నకు ఎంపిక చేశారు.[1] డాక్టర్‌ శ్రీవారి చంద్రశేఖర్‌ 2012-13 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక సిఎన్‌ఆర్‌ రావు జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు[2]

జీవిత విశేషాలుసవరించు

డా.ఎస్.చంద్రశేఖర్ హైదరాబాదులో మార్చి 9 1964లో జన్మిచారు. ఆయన 1982 లో బ్యాచిలర్స్ డిగ్రీని పొందారు. 1985 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డిస్టింక్షన్ లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఆయన హైదరాబాదు లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో డా.ఎ.వి.రామారావు గ్రూపులో చేరి 1991 లో డాక్టరేట్ పూర్తిచేసారు. 1991 తరువాత ఆయన ప్రొఫెసర్ జె.ఆర్.ఫాల్క్ తో కలసి పోస్ట్ డాక్టరేట్ విద్యనభ్యసించారు. ఆయన సింధసిస్ ఆఫ్ డిటెర్న్ పెనోయిడ్ - స్టైపోల్డియొన్ అండ్ రిడక్టివ్ ఆల్కైలేషన్ ఆఫ్ బై స్పైనల్ సల్ఫోన్స్ అనే అంశం పై డాక్టరేట్ పూర్తిచేసారు.[3]

1994 లో చంద్రశేఖర్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో శాస్త్రవేత్తగా చేరారు. ఆ కాలంలో ఆయన కార్బన్-కార్బన్ బంధ నిర్మాణ చర్యలలో కొత్త సంశ్లేషణా పద్ధతులను అభివృద్ధి చేసారు. ఆయన ఆర్గానిక్ కెమిస్ట్రీ రంగంలో పరిశోధనలు నిర్వహిస్తూ కేన్సర్ ను నిరోధించే రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేసే జీవాణువులను కనుగొన్నారు. హైదరాబాద్ లోని బి ఎం బిర్లా సైన్స్ సెంటర్ వారు ప్రతి యేటా యువశాస్త్రవేత్తలను అందుంచే బి.ఎం.బిర్లా సైన్స్ ప్రైజ్ ను 2005 సెప్టెంబరులో అందుకున్నారు. నోబుల్ బహుమతి గ్రహీత డిడి ఓషరఫ్ చేతుల మీదుగా దేశవ్యాప్త 14 మంది శాస్త్రవేత్తలలో ఒకరుగా ఈ ప్రైజ్ ను అందుకున్నారు.[4]

సేవలుసవరించు

సహజ ఉత్పత్తుల శాస్త్ర అభివృద్ధి విభాగాధిపతిగా ఉన్న ఆయన, అల్సర్ చికిత్సలో ఉపయోగించే మిసోప్రోస్టల్, క్యాన్సర్ వ్యాధి నివారణకు ఉపయోగించే ఎరిబులిన్, డిప్రెషన్ నివారణకు వాడే సెట్రాలైన్ రసాయనాలను తన పరిశోధనలతో వెలుగులోకి తెచ్చారు. ప్రకృతిలో చాలా అరుదుగా లభించే రసాయనాలను ల్యాబ్‌లలో సులువుగా తయారుచేసే పరిశోధనలలో చంద్రశేఖర్ కీలకపాత్ర పోషించారు. ఆయన ఆధ్వర్యంలో రసాయనశాస్త్రంలో ఇప్పటికే 50 మందికిపైగా విద్యార్థులు పీహెచ్‌డీ శిక్షణ పొందారు.[5]

అవార్డులుసవరించు

 • 2014 : ఇన్ఫోసిస్ ప్రైజ్ [6]
 • 2011 : OPPI Award, Work in Org. Synthesis, OPPI
 • 2010 : Ranbaxy Research Award, Pharmaceutical Sciences, Ranbaxy Laboratories Ltd., India
 • 2010 : Fellow of National Academy of Sciences, India (FNASc), Work in Chemical Sciences, National Academy of Sciences, India
 • 2009 : FAPCCI Award, Best Scientist, FAPCCI, Andhra Pradesh
 • 2008 : NASI-Reliance, Work in Industrial Org. Synthesis, NASI-Reliance
 • 2008 : Andhra Pradesh Young Scientist, Work in Org. Synthesis, Andhra Pradesh State Council of Science & Technology (APCOST)
 • 2007 : CNRS visiting Research director, Work in Org. Synthesis, University of Rennes, CNRS, France
 • 2006 : Innocentive Champion, For solving web based chemistry problems Innocentive Inc. USA
 • 2006 : Fellow of Andhra Pradesh Akademi of Sciences, Work in Org. Synthesis, A.P. Akademi of Sciences
 • 2005 : Rajib Goyal Young Scientist Award, Work in Org. Synthesis, Kurukshetra University
 • 2005 : Diamond Jubilee ‘Roll of Honour’, Work in Org. Synthesis, IICT
 • 2004 : AVRA Young Scientist Award, Work in Org. Synthesis, AVRA Foundation
 • 2001 : B.M. Birla Science Prize, Work in Org. Synthesis, B.M. Birla Science Foundation
 • 2000-2001 : Best Performance Award, Based on Research Publications, IICT
 • 2000 : Alexander Von Humboldt Fellowship, Work in Org. Synthesis, Alexander von Humboldt Foundation, Germany
 • 1997 : CSIR Young Scientist, Work in Org. Synthesis, CSIR
 • 1996 : INSA Medal for Young Scientist, Work in Org. Synthesis, INSA
 • 1995 : A P Akademi Young Scientist, Work in Org. Synthesis, A P Akademi

సత్కారాలుసవరించు

 • 2010 : Fellow of Indian Academy of Sciences, Bangalore
 • 2010 : Fellow of National Academy of Sciences, Allahabad
 • 2006 : Fellow of Andhra Pradesh Akademi of Sciences, A. P.

మూలాలుసవరించు

 1. ఫెలోషిప్
 2. .సిఎస్‌ఐరఆర్‌ శాస్తవ్రేత్తకు సిఎన్‌ఆర్‌ రావు అవార్డు[permanent dead link]
 3. CSIR-Indian Institute of Chemical Technology[permanent dead link]
 4. ఆంధ్ర శాస్త్రవేత్తలు (కృష్ణవేణి పబ్లికేషన్స్,విజయవాడ ed.). శ్రీ వాసవ్య. 2011. p. 31. Cite has empty unknown parameter: |1= (help)
 5. List of Thesis Submitted Students – Dr. S. Chandrasekhar
 6. ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్

ఇతర లింకులుసవరించు