శ్రీవారి శోభనం 1985 మార్చి 1న విడుదలైన తెలుగు సినిమా. రవి కళామందిర్ బ్యానర్ కింద ఎం.ఎస్.ప్రసాద్, ఆదుర్తి భాస్కర్ లు నిర్మించిన ఈ సినిమాకు జంధ్యాల దర్శకత్వం వహించాడు. నరేష్, అనితారెడ్డి, మనోచిత్ర లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రమేష్ నాయుడు సంగీతాన్నందించాడు.[1] మల్లాది వెంకటకృష్ణమూర్తి నవల పెద్దలకు మాత్రమే ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది.

శ్రీవారి శోభనం
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం జంధ్యాల
తారాగణం నరేష్,
అనితారెడ్డి
సంగీతం రమేష్ నాయుడు
గీతరచన వేటూరి సుందరరామమూర్తి
నిర్మాణ సంస్థ శ్రీ రవి కళామందిర్
భాష తెలుగు

నటీనటులు మార్చు

 • నరేష్[2]
 • అనితా రెడ్డి
 • మనోచిత్ర
 • సుత్తి వేలు
 • సుత్తి వీరభద్రరావు
 • గంగారత్నం
 • శ్రీలక్ష్మి
 • హేమసుందర్
 • రావి కొండలరావు
 • సాక్షి రంగారావు
 • పుచ్చా పూర్ణానందం
 • రాధాకుమారి
 • రాళ్ళపల్లి
 • భీమరాజు
 • అనుపమ
 • కె.కె.శర్మ
 • హరిబాబు
 • లక్ష్మీకాంత్
 • పొట్టి ప్రసాద్
 • ధమ్
 • సత్తిబాబు
 • టెలిఫోన్ సత్యనారాయణ
 • రామారావు
 • జిత్ మోహన్ మిత్రా
 • డబ్బింగ్ జానకి

సంక్షిప్త కథ మార్చు

కిరణ్ ఒక ప్రైవేట్ సంస్థలో పెద్ద పదవిలో వుంటాడు. అతనికి అమ్మాయిలంటే చచ్చేంత భయం. దానితో అమ్మాయిలంతా అతడికి రకరకాల పేర్లుపెడతారు. కిరణ్ పి.ఎ.ఐన మార్గరెట్ కూడా అతనిపై మనసు పడుతుంది. కిరణ్‌కు వివాహం జరుగుతుంది. శోభనం అంటే కిరణ్‌కు భయం వేస్తుంది. శోభనానికి ముందు ప్రేమ పాఠాలు నేర్చుకోవాలనుకున్న కిరణ్ మార్గరెట్ సహాయం అడుగుతాడు. వారిద్దరూ శారీరకంగా కలవాలనుకున్న ప్రతిసారి ఏవో ఆటంకాలు ఏర్పడతాయి. అనేక సార్లు ప్రయత్నించిన తర్వాత కిరణ్‌కు తన భార్యను మోసగించడం తప్పని తెలుస్తుంది. మార్గరెట్ కూడా కిరణ్‌ భయాన్ని అధిగమించే విషయంలో సహాయపడుతుంది. ఈలోగా ఒక అజ్ఞాత వ్యక్తి మార్గరెట్‌తో కిరణ్ సంబంధాన్ని బయటపెడతానని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెడతాడు. కిరణ్ ఈ అవరోధాన్ని దాటి తన భార్యతో శోభనం జరగడంతో కథ సుఖాంతమౌతుంది[3].

సాంకేతిక వర్గం మార్చు

 • దర్శకత్వం: జంధ్యాల
 • స్టూడియో: రవి కళామందిర్
 • నిర్మాత: M.S. ప్రసాద్, ఆదుర్తి భాస్కర్;
 • స్వరకర్త: రమేష్ నాయుడు
 • విడుదల తేదీ: మార్చి 1, 1985

పాటలు మార్చు

 • శ్రీవారి శోభనం
 • అలకపానుపు ఎక్కనేల చిలకా గోరింక
 • చంద్రకాంతిలో చందనశిల్పం

మూలాలు మార్చు

 1. "Srivari Sobhanam (1985)". Indiancine.ma. Retrieved 2022-11-15.
 2. ఆంధ్రప్రభ, సినిమా (22 April 2018). "అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టునయ్యా – నరేష్ – Andhra Prabha Telugu Daily". ర‌మేష్ గోపిశెట్టి. Archived from the original on 19 July 2020. Retrieved 19 July 2020.
 3. వి.ఆర్. (8 March 1985). "చిత్రసమీక్ష - శ్రీవారి శోభనం". ఆంధ్రపత్రిక దినపత్రిక. Archived from the original on 25 September 2020. Retrieved 18 January 2020.

బయటి లంకెలు మార్చు