పద్మాలయా పిక్చర్స్
(శ్రీ పద్మాలయా పిక్చర్స్ నుండి దారిమార్పు చెందింది)
పద్మాలయా పిక్చర్స్ భారత సినిమా నిర్మాణ, పంపిణీ సంస్థ. దీని అధిపతులు హీరో ఘట్టమనేని కృష్ణ సోదరులు జి.హనుమంతరావు, జి.ఆదిశేషగిరిరావు. దీనిని 1971లో స్థాపించారు. [2][3] ఈ సంస్థ హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉంది. ఈ సంస్థలో తెలుగు, హిందీ చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం ఈ సంస్థ ఇందిరా ప్రొడక్షన్స్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంటు, కృష్ణ ప్రొడక్షన్స్ ఎంటర్‌టైన్‌మెంటు గా పేరు మార్చబడినది.
రకం | ప్రైవేట్ |
---|---|
పరిశ్రమ | వినోదాత్మకం |
స్థాపన | 1971 |
స్థాపకుడు | ఘట్టమనేని కృష్ణ |
ప్రధాన కార్యాలయం | , భారతదేశం |
కీలక వ్యక్తులు | ఘట్టమనేని కృష్ణ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఘట్టమనేని హనుమంతరావు |
ఉత్పత్తులు | సినిమాలు |
సేవలు | సినిమా నిర్మాణం సినిమా పంపిణీ |
యజమాని | ఘట్టమనేని కృష్ణ |
అనుబంధ సంస్థలు |
|
నిర్మించిన సినిమాలు
మార్చు- వైభవం (1998)
- తెలుగువీర లేవరా (1995)
- పోలీస్ అల్లుడు (1994)
- పచ్చతోరణం (1994)
- అన్నా చెల్లెలు (1993)
- సామ్రాట్ (1987)
- సింహాసనం (1986)
- పాతాళ భైరవి (హిందీ సినిమా) (1985)
- మావాలి (హిందీ సినిమా)(1983)
- హిమ్మత్ వాలా (హిందీ సినిమా) (1983)
- ఈనాడు (1982)
- మేరీ ఆవాజ్ సునో (హిందీ సినిమా) (1981)
- పట్నవాసం (1978)
- కురుక్షేత్రం (1977)
- అల్లూరి సీతారామరాజు (1974)
- దేవుడు చేసిన మనుషులు (1973)
మూలాలు
మార్చు- ↑ "Padmalaya Telefilms Ltd". Business Standard. Retrieved 2019-11-02.
- ↑ "Padmalaya plays out dubious land plot - Times of India".
- ↑ "Padmalaya Studios [in]".