శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థానం (కొండ బిట్రగుంట)

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నెల్లూరు జిల్లాలోని కొండ బిట్రగుంటలో నెలకొని ఉన్న హిందూ దేవాలయం.[1] ఈ క్షేత్రమును "బిలకూటక్షేత్రం" అంటారు. ఈ దేవస్థానం సుప్రసిద్ధమైన పురాతన వెంకటేశ్వరస్వామి ఆలయం. ఈ ఆలయం ఒక చిన్న కొండమీద ఉంది. ఈ ఆలయానికి కొండ కింది భాగంలో ఒక పెద్ద కోనేరు ఉంది. ఇది నెల్లూరుజిల్లా కావలి పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్వామి వారికి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవములను నిర్వహిస్తారు. ఈ బ్రహ్మాత్సవములలో స్వామి వారికి పలు రకాల వాహన సేవలు నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవముల సమయంలో జరిగే కార్యక్రమములు

మార్చు
  • గిరి ప్రదక్షణము, అంకురార్పణం
  • ధ్వజారోహణం, శేషవాహనసేవ
  • హనుమంతసేవ
  • మోహిని ఉత్సవం, గరుడసేవ
  • మ్రొక్కుబడులు, తెప్పోత్సవము, గజవాహనసేవ
  • కళ్యాణోత్సవం, రధోత్సవం, అశ్వవాహనసేవ
  • చక్రస్నానం, శ్రీ పుష్పయాగం, ఏకాంతసేవ

మార్గాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "About Temple". A. P Temples Portal. Retrieved 12 March 2023.{{cite web}}: CS1 maint: url-status (link)