శ్రీ బాగ్ ఒడంబడిక

ఉమ్మడి మద్రాసులో 1937లో నవంబరు 16న ఎని మిది మంది సభ్యుల సమక్షంలో జరిగిన ఒప్పందమే శ్రీబాగ్‌ ఒడంబడిక. దీనినే పెద్దమనుషుల ఒప్పందం అని కూడా అంటారు. దీని ముఖ్య ఉద్దేశం రాయలసీమ అభివృద్ధి, ప్రయోజనాలు. ఇందులో ముఖ్యామ్శాలు:-

  1. రాష్ట్ర రాజధాని మద్రాసుగానీ, రాయలసీమలో ఏదో ఒక పట్టణంకాని అయివుండాలి.
  2. శాసనసభలో రాయలసీమకు సరియైన ప్రాతినిధ్యము ఉండాలి.
  3. సరిసమాన సంఖ్యలో మంత్రులుండాలి.
  4. ఆర్థిక వెనుకబాటుతనం మూలాన వెంటనే తుంగభద్ర, హగరి ప్రాజక్టులు చేపట్టాలి.
  5. రాష్ట్ర ఆదాయాన్ని సమానంగా పంచాలి.
ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని శ్రీబాగ్ ఒడంబడిక వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)

ఈతీర్మానాలు సభలో ప్రవేశపెట్టడం, ఏకగ్రీవంగా ఆమోదంపొందడం జరిగింది. సభ ముగిసిన వెంటనే సభ్యులందరూ మద్రాసులో కాశీనాధుని నాగేశ్వరరావుగారి శ్రీబాగ్ మహలు (Sri Baugh Palace) లో 1937 నవంబరు 19న సమావేశమై (సర్కారాంధ్ర, రాయలసీమ) సామరస్యసాధనగా పెద్దమనుషుల ఒప్పందం ( శ్రీబాగ్ ఒడంబడిక ) సాధించారు. ఆస్థల గౌరవార్ధం ఆ ఒడంబడికను శ్రీబాగ్ ఒడంబడికగా పిలవడం జరిగింది.