శ్రీ యఱ్ఱమిల్లి నారాయణ మూర్తి కళాశాల
శ్రీ వై యన్ కళాశాల గా ప్రఖ్యాతి వహించిన శ్రీ యఱ్ఱమిల్లి నారాయణ మూర్తి కళాశాల పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో ఉంది. 1949 వ సంవత్సరంలో స్థాపించిన ఈ కళాశాల వసిష్ఠ గోదావరి ఒడ్డున విద్యా కుసుమాలను వెదజల్లుతోంది. ప్రస్తుతం ఈ సంస్థ 9 ఇంటిర్, డిగ్రీ, పిజి కోర్సులతో పాటూ బిఇడి, యంబిఎ, యంసిఎ వంటి ప్రొఫెషనల్ కోర్సులనూ అందిస్తోంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాక్ (NAAC) చేత ఎ గ్రేడ్‌లో గుర్తింపు పొందిన తొలి కళాశాల ఇదే. ఇది ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిధిలోని ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాల.[1]
పూర్వపు నామములు | ది నరసాపూర్ కాలేజ్ |
---|---|
నినాదం | తమసోమా జ్యోతిర్గమయ |
ఆంగ్లంలో నినాదం | from dark to light |
రకం | సార్వత్రిక (ఎయిడెడ్) |
స్థాపితం | 1948 |
అనుబంధ సంస్థ | స్వతంత్ర (అటానమస్) పూర్వం ఆంధ్ర విశ్వవిద్యాలయంతో |
అధ్యక్షుడు | డా. చినమిల్లి సత్యనారాయణ రావు |
ప్రధానాధ్యాపకుడు | డా. యంవిఆర్‌కె నరసింహాచార్యులు |
స్థానం | నరసాపురం, ఆంధ్ర ప్రదేశ్ |
అథ్లెటిక్ మారుపేరు | వైయన్ కాలేజ్ |
జాలగూడు | sriyncollege.com www.sriyncollege.com] |
చరిత్ర
మార్చుపశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖ న్యాయవాది, విద్యావేత్త అయిన యఱ్ఱమిల్లి నారాయణ మూర్తి స్థానికుల సహాయ సహకారాలతో ఈ కళాశాలను ప్రారంభించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో విద్యా వ్యాప్తికి ప్రముఖ పాత్ర వహించిన విద్యా సంస్థల్లో ఇది ఒకటి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి విద్యార్థులు ఇక్కడ పెద్ద సంఖ్యలో చదువుకుంటున్నారు. ముందుగా ఈ కళాశాలను నరసాపురంలో మరో ప్రముఖ విద్యా సంస్థ అయిన టేలర్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రారంభించారు. తరువాత అప్పటి వరకూ నరసాపురం కలెక్టర్ బంగ్లాను ఈ కళాశాలకు కేటాయించారు. అప్పటి నుంచీ కాలేజీ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతూ వచ్చింది.
1956లో దీనికి పూర్తి స్థాయి కళాశాల హోదా వచ్చింది. 1989-90 విద్యా సంవత్సరంలో పిజి విభాగం ప్రారంభం అయింది. ఈ కళాశాలను ది నరసాపూర్ కాలేజ్ అనే పేరుతో ప్రారంభించారు. 1967లో కళాశాల వ్యవస్థాపకులు యఱ్ఱమిల్లి నారాయణ మూర్తి పంతులు పేరు ఈ సంస్థకు పెట్టారు. ఈ భవంతి డచ్ పాలనలో నిర్మితమైంది. దీనిని డచ్ బిల్డింగ్‌గా స్థానికులు పిలుస్తారు. 200కు పైగా సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ భవంతి గోదావరి నదీ తీరంలో 14 ఎకరాల విశాల ప్రాంగణంలో ఉంది. ఇప్పుడు ఈ భవంతి చుట్టూ అనేక కాలేజీ విభాగాల బిల్డింగులు వచ్చి చేరాయి. ఈ చారిత్రక భవంతిలో ప్రస్తుతం కళాశాల ప్రధాన పరిపాలన విభాగం, ప్రిన్సిపల్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ కళాశాలకు భాగవతుల జినేంద్రనాథ్ చాలాకాలం ప్రిన్సిపల్‌గా పనిచేసి ఇక్కడే రిటైరయ్యారు.
50వ వార్షికోత్సవం
మార్చు2000వ సంవత్సరంలో వైయన్ కళాశాల స్వర్ణోత్సవాలు జరుపుకుంది. 2007-2008 విద్యా సంవత్సరంలో యుజిసి నుంచి అటానమస్ హోదా పొందింది.[2]
పూర్వ విద్యార్థులు
మార్చుఆంధ్రప్రదేశ్లో ప్రఖ్యాతి వహించిన కళాకారులు మెగాస్టార్ చిరంజీవి, దాసరి నారాయణ రావు, యు వి కృష్ణంరాజు, గజల్ శ్రీనివాస్ వంటి అనేక మంది ప్రముఖులు ఈ కళాశాలలో చదివారు.
సూచనలు
మార్చు- ↑ "Andhra University - Affiliated Colleges". Archived from the original on 2012-10-09. Retrieved 2012-10-08.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2016-10-18. Retrieved 2012-10-08.
బయటి లింకులు
మార్చు- కళాశాల వెబ్ సైట్: https://web.archive.org/web/20121001172053/http://www.sriyncollege.org/