శ్వేతనాగు సంజీవి దర్శకత్వంలో సి. వి. రెడ్డి నిర్మించగా 2004 లో విడుదలైన చిత్రం.[1] ఇందులో సౌందర్య ప్రధాన పాత్ర పోషించింది. కథానాయికపై ఒక నాగు తనకు హాని చేసిన వారిపై పగబట్టడం, నాగదేవత సాయంతో ఆమె అందులోంచి బయటపడటం ఈ చిత్ర ప్రధాన కథాంశం.

శ్వేతనాగు
దర్శకత్వంసంజీవి
నిర్మాతసి. వి. రెడ్డి
రచనసాయినాథ్ (సంభాషణలు)
నటులుసౌందర్య, అబ్బాస్
సంగీతంకోటి
ఛాయాగ్రహణందివాకర్
కూర్పులంక భాస్కర్
నిర్మాణ సంస్థ
సి. వి. ఆర్ట్స్
విడుదల
ఫిబ్రవరి 18, 2004 (2004-02-18)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఈ సినిమా సౌందర్య 100వ సినిమా. ఆమె పెళ్ళైన తర్వాత మొదటి సినిమా. ఆమె చనిపోబోయే ముందు నటించిన ఆఖరి చిత్రాల్లో ఇది కూడా ఒకటి.

కథసవరించు

మధుమతి (సౌందర్య) పాములపై పరిశోధనలు చేసే ఒక విద్యార్థి. ఒకసారి ఆమె గైడు (శరత్ బాబు) నాగుల ప్రవర్తనపై కొన్ని శతాబ్దాల క్రితం కొంతమంది పూజారులచే రాయబడ్డ నాగ శాస్త్రం గురించి ఆమెకు చెబుతాడు. ఆ గ్రంథం నల్లమల అడవుల్లో ఎక్కడో దాగి ఉందనీ దానిని అన్ని వేళలా ఒక నాగుపాము సంరక్షిస్తూ ఉంటుందని చెబుతాడు. ఆ ప్రయత్నంలో భాగంగా మధుమతి నల్లమల అడవుల్లోని ఒక గూడేనికి చేరుకుని ఆ గ్రంథాన్ని స్వంతం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. ఆ ప్రయత్నంలో ఉండగా ఆమెకు ఒక శ్వేతనాగు కనిపించి ఆమెను కాటు వేయాలని ప్రయత్నిస్తుంటుంది. ఆమెకు ఒక సాధువు కనిపించి ఆమె పూర్వ జన్మలో ఒక పామును చంపిందనీ అది ఈ జన్మలో ఆమె మీద పగ తీర్చుకోవాలనుకుంటుందనీ చెబుతాడు. దాన్నుంచి రక్షించడానికి ఆమెకు తాయెత్తు కూడా ఇస్తాడు. మధుమతి ఆ శ్వేతనాగునుంచి తప్పించుకుని నాగదేవత అనుగ్రహం ఎలా సంపాదించుకుంటుందనేది మిగతా కథ.

తారాగణంసవరించు

మూలాలుసవరించు

  1. జి. వి, రమణ. "ఐడిల్ బ్రెయిన్ లో శ్వేతనాగు చిత్ర సమీక్ష". idlebrain.com. idlebrain.com. Retrieved 11 August 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=శ్వేతనాగు&oldid=2295585" నుండి వెలికితీశారు