షఫీ పరంబిల్ (జననం 12 ఫిబ్రవరి 1983) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు పాలక్కాడ్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై,[2] 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో వటకర లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]

షఫీ పరంబిల్
షఫీ పరంబిల్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 (2024-06-04)
ముందు కె. మురళీధరన్
నియోజకవర్గం వటకర

పదవీ కాలం
1 జూన్ 2011 (2011-06-01) – 12 జూన్ 2024 (2024-06-12)
ముందు కే.కే. దివాకరన్
నియోజకవర్గం పాలక్కాడ్

వ్యక్తిగత వివరాలు

జననం (1983-02-12) 1983 ఫిబ్రవరి 12 (వయసు 41)
కరక్కాడ్, పట్టాంబి , పాలక్కాడ్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు
  • షానవాస్ పరంబిల్
  • మైమూనా షానవాస్
జీవిత భాగస్వామి అషీలా అలీ
సంతానం 1
నివాసం పాలక్కాడ్

రాజకీయ జీవితం

మార్చు

షఫీ పరంబిల్ కాంగ్రెస్ విద్యార్థి సంఘం, కేరళ స్టూడెంట్ యూనియన్ (కేఎస్‌యూ) నుండి రాజకీయాలలోకి వచ్చి 2007లో కేఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితుడై 2009 వరకు పని చేశాడు. ఆయన 2011లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పాలక్కాడ్ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఎం అభ్యర్థి కెకె దివాకరన్‌పై గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2016 ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2017లో ఇండియన్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా, జూన్ 2020లో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికై 2023 వరకు పని చేశాడు.[4][5]

షఫీ పరంబిల్ 2021లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పాలక్కాడ్ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి మెట్రో మ్యాన్ ఇ శ్రీధరన్‌ను 3480 ఓట్ల తేడాతో ఓడించి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో వటకర లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఎం అభ్యర్థి కేకే శైలజపై 114506 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[6][7]

మూలాలు

మార్చు
  1. "Members - Kerala Legislature SHAFI PARAMBIL". 4 June 2024. Archived from the original on 30 July 2024. Retrieved 30 July 2024.
  2. Firstpost (10 March 2021). "Kerala Assembly Election 2021, Palakkad profile: Firebrand Youth Congress leader Shafi Parambil won second term in 2016" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 30 July 2024.
  3. The News Minute (4 June 2024). "Congress' Shafi Parambil defeats KK Shailaja in Vadakara, wins by huge margin" (in ఇంగ్లీష్). Retrieved 30 July 2024.
  4. "A humble start, an abrasive campaign and now, a seat at high table". 10 July 2024. Archived from the original on 30 July 2024. Retrieved 30 July 2024.
  5. TimelineDaily (31 March 2024). "Shafi Parambil: The Congress Candidate And Youth Leader For Vadakara Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 30 July 2024. Retrieved 30 July 2024.
  6. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Vatakara". Archived from the original on 30 July 2024. Retrieved 30 July 2024.
  7. The Indian Express (6 June 2024). "Kerala set for bypolls as 2 MLAs, including state minister, elected to Lok Sabha" (in ఇంగ్లీష్). Archived from the original on 30 July 2024. Retrieved 30 July 2024.